prasanth Reddy
-
మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తయినందున ఇక నుంచి ఇంట్రా(అంతర్గత సరఫరా) పనుల మీద దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇంట్రా పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రధాన పనులు చేసిన వర్క్ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని చెప్పారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా అయిన ఇంట్రా పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్రా పనుల కోసం ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు ఉన్నందున పనుల్లో మరింత వేగం చూపించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంట్రా విలేజ్ పనులు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
కేసీఆర్ దీక్ష వల్లే డిసెంబర్ 9 చారిత్రకం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష వల్లనే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ప్రకటించిందని, కేసీఆర్ దీక్షతోనే డిసెంబర్ 9 చారిత్రక దినమైందని మిషన్ భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమ గరిమను చూసి ప్రకటించిందన్నారు. డిసెంబరు 23న తెలంగాణ ప్రకటనపై వెనక్కి తగ్గిన రోజును తెలంగాణ విద్రోహ దినంగా కాంగ్రెస్ అంటున్నదా అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 60 కొత్త అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దగానా అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రమంతా 24 గంటలపాటు వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నారని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 3 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామని వివరించారు. ఇవన్నీ చేస్తే సీఎం కేసీఆర్ దగా చేసినట్టుగా జైపాల్ రెడ్డికి కనిపించిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబంపై సంస్కార హీనంగా మాట్లాడితే అందరి బాగోతాలను బయటపెడతామని ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విషయాల గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్నారు. -
తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు!
- జేఈఈ మెయిన్స్‌లో గుంటూరు విద్యార్థి ప్రతిభ - రాష్ట్రస్థాయిలో టాపర్, జాతీయస్థాయిలో 3వ ర్యాంకు కైవసం గుంటూరు: సీబీఎస్ఈ బోర్డు బుధవారం విడుదలచేసిన జేఈఈ-మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు నగరానికి చెందిన మూల్పురు ప్రశాంత్‌రెడ్డి జాతీయస్థాయిలో 3వ ర్యాంకర్‌గా నిలిచాడు. గుంటూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివిన ప్రశాంత్‌రెడ్డి ఇంటర్మ్‌డియట్‌లో 987 మార్కులు సాధించాడు. ఈ నెల 3న జరిగిన జేఈఈ-మెయిన్స్‌కు హాజరై 360 మార్కులకు అత్యధికంగా 335 మార్కులు కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచాడు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి శివరామకృష్ణారెడ్డి తాపీమేస్త్రీ. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపాడు. -
ఎమ్మెల్యే, పోలీసుల మధ్య స్వల్ప వివాదం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పోచంపాడు నాలుగో వీఐపీ పుష్కరఘాట్ వద్ద బుధవారం బాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ క్రమంలో పోలీస్ బెటాలియన్‌కు చెందిన బస్సు రహదారికి అడ్డంగా నిలిపారు. రహదారికి అడ్డంగా ఎందుకు బస్సు నిలిపారంటూ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దాంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కాసేపు స్థానికంగా ధర్నా నిర్వహించారు.