ఎమ్మెల్యే, పోలీసుల మధ్య స్వల్ప వివాదం | mla prasanth Reddy takes on police | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే, పోలీసుల మధ్య స్వల్ప వివాదం

Published Wed, Jul 22 2015 7:08 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

mla prasanth Reddy takes on police

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పోచంపాడు నాలుగో వీఐపీ పుష్కరఘాట్ వద్ద బుధవారం బాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు.

ఆ క్రమంలో పోలీస్ బెటాలియన్‌కు చెందిన బస్సు రహదారికి అడ్డంగా నిలిపారు. రహదారికి అడ్డంగా ఎందుకు బస్సు నిలిపారంటూ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దాంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కాసేపు స్థానికంగా ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement