
ఎన్‌టీఏ సైట్‌లో అందుబాటు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హతకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండవ సెషన్‌లో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో జరగనున్న పరీక్షల అడ్మిట్ కార్డులు శనివారం విడుదలయ్యాయి. ఎన్‌టీఏ సైట్‌లో ఉంచిన అడ్మిట్‌కార్డులను విద్యార్థులు సెషన్–2 దరఖాస్తు ఫారం నంబరు, పాస్‌వర్డ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షలకు ఎన్‌టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి.
పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8వ తేదీల్లో రెండు షిఫ్ట్‌లలో (ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ) పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి.