సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.
వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment