Exam calendar
-
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’
నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలిచింది. దీంతో వారు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈఈ మెయిన్ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలుఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.యూజీసీ నెట్ పరీక్షనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలుయూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2 పరీక్షస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.యూకేసీఎస్‌సీ ఎస్ఐ పరీక్షఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్ఐ) పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.జేఈఈ మెయిన్స్ పరీక్షఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
విద్యార్థులకు పరీక్ష
బలిజిపేట: పగటి ఉష్ణోగ్రతలతో పాటు విద్యార్థులకు పరీక్షల వేడి మొదలైంది. ఈ నెల 27 వ తేదీ నుంచి పదవ తరగతి, వచ్చేనెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనుండగా ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు 26వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 6,7 తరగతులకు మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. 8వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం పరీక్షలు ఉదయం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు మధ్యాహ్నం ఉంటాయి. 9వ తరగతి విద్యార్థులకు పేపర్–1 ఉదయం, పేపర్–2 మధ్యాహ్నం జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షలను ఆయా పాఠశాలలు నిర్వహిస్తాయి. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. మే 15వ తేదీ లోగా ప్రమోషన్ జాబితాలను సిద్ధంచేయాలని స్పష్టం చేసింది. పరీక్షకు గంట ముందే.. ప్రశ్నపత్రాలను జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు ప్రాథమిక పాఠశాలల ప్రశ్నపత్రాలు క్లస్టర్ వారీగా పంపించారు. యూపీ, ఉన్నత పాఠశాలల ప్రశ్నపత్రాల బండిళ్లను ఎప్పటికప్పుడు పరీక్ష రోజున గంటముందు ఎంఆర్సీ నుంచి ప్రధానోపాధ్యాయులు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. పదో తరగతి మాదిరిగా వార్షిక పరీక్షలు వార్షిక పరీక్షలను పదవతరగతి పరీక్షల మాదిరిగా పకడ్బందీగా నిర్వహిస్తాం. ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. పర్యవేక్షణ ఉంటుంది. శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట పకడ్బందీగా శ్లాస్ పరీక్ష విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించే శ్లాస్ (స్టేట్ లెవెల్ లెర్నింగ్ అసెస్మెంట్ సర్వే) పరీక్షను గురువారం బలిజిపేట మండలంలో పకడ్బందీగా నిర్వహించారు. మండలంలోని గంగా డ డీపీఈపీ, నారాయణపురం, నారాయణపురం–2, నూకలవాడ, గలావల్లి, అజ్జాడ రెగ్యులర్, పలగర, బలిజిపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. బలిజిపేట మండలంలో 4వతరగతి విద్యా ర్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల విజ్ఞానానికి శ్లాస్ సీతానగరం/పార్వతీపురంటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శ్లాస్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు పార్వతీపురం ఎంఈఓ సూరిదేముడు తెలిపారు. మండలంలోని గాదెలవలస జెడ్పీ ఉన్నత పాఠశాల, హోలీక్రాస్ ఉన్నత పాఠశాల (ప్రైవేట్) ఆరోతరగతి విద్యార్థులకు, అలాగే అంటిపేట, జోగింపేట, బూర్జ, నిడగల్లు ప్రాథమిక పాఠశాలల్లో నాల్గవతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేసి పై చదువులకు అవసరమైన తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు మండలంలో ఎస్ఏ–2 పరీక్షలు ఈనెల 22నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 9గంటలనుంచి 11.30 గంటలవరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
ఏపీపీఎస్సీకి ప్రిపేరవుతున్నారా?
ఏపీపీఎస్సీలో ఏదైనా ఉద్యోగానికి సిద్దం అయ్యే ముందు కొన్ని కచ్చితమైన పనులు అభ్యర్దన చేయవలసి ఉంటుంది. అవి ఏంటంటే... పరీక్ష సిలబస్ / పాఠ్య ప్రణాళిక. పరీక్షకు ప్రిపేరయ్యేవారు కచ్చితమైన పాఠ్య ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. పాఠ్య ప్రణాళిక లో ముఖ్యమైన విషయాలు (టాపిక్స్) ఎప్పటికప్పుడు టిక్ చేసుకొని, వీటినే ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.కనీసం 30 నుంచి 60 రోజుల సమయాన్ని కేటాయించడం లేదా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.అలా, ముఖ్యమైన విషయాలు చదివిన తర్వాత మిగతా సిలబస్‌ని చదవాలి. అదేవిదంగా, పూర్తి సిలబస్ పై పట్టు వచ్చిన తర్వాత లేదా పూర్తి సిలబస్ అయ్యాక, మళ్ళీ ఒక్కసారి సిలబస్‌ను పూర్తిగా రివిజన్ చేసుకోవాలి. ఇలా, కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళితే ప్రభుత్వరంగ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇందులో మీకు ఎటువంటి సందేహం అనవసరం. అయితే ఏపీపీఎస్సీ కాలెండర్ 2020లో అసలు ఉద్యోగాలు ఉన్నాయా అనే డౌటు మీకు రావచ్చు.. కానీ కచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి! ఎందుకంటే 2019 సంవత్సరంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌లు చేసిన ప్రకటనతో పాటు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన నిరుద్యోగుల్లో ఆశాభావం రేకెత్తించింది. వీరి ప్రకటనను పరిగణలోకి తీసుకుని చూస్తే మొత్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. AP DSC 2020 Notification AP Police Constable 2020 Notification AP SI Police 2020 Notification AP Sachivalayam Notification 2020 AP Groups Notification 2020 (1, 2, 3, & 4) AP GENCO AE Notification 2020 AP MLHP Notification 2020 AP Staff Nurse Notification 2020 తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కావున అభ్యర్డులు, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ప్రణాళిక సరిగ్గా పాటించడం లేదా? కొందరు అభ్యర్థులు సిలబస్ ప్రణాళిక వేసుకున్న తర్వాత కూడా దానిని పాటించడం కష్టంగా బావిస్తారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. అప్పుడే అనుకున్న ఉద్యోగం / పని సాధించడానికి వీలవుతుంది. -
ఒకే ఎగ్జామ్ కేలండర్‌ను అమలు చేయాలి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లుగానే మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ రూపొందించే ఎగ్జామ్ కేలండర్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి గురువారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు నిపుణుల బృందాన్ని నియమించి, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సమస్యల్లో ఉన్నాం... ఆదాయం లేదు ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం సవాలక్ష సమస్యల్లో ఉందని, ఆదాయం కూడా లేదని దాని వల్ల సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన గురువారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జనచైతన్య యాత్రలో, అంతకు ముందు విజయవాడలో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తర్వాత దెందులూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సాక్షి పత్రిక చదివి మనసులు పాడుచేసుకోవద్దంటూ విమర్శలు గుప్పించారు. జనచైతన్యయాత్రలకు గ్రేడింగ్ హైదరాబాద్: తెలుగుదేశం నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రల తీరును పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆయన సుమారు ఏడు వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మీడియా కమిటీ జాతీయ సమన్వయకర్త ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలు వరద సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్బుక్), బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్), వారెన్ బఫెట్ (వ్యాపారవేత్త) స్ఫూర్తితో యువత, కార్పొరేట్ వర్గాలు ఏపీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కాగా, చంద్రబాబు శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతులు కలిసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనాల్సిందిగా వారు ఆహ్వానించనున్నారు. అదేరోజు రాత్రి ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి మనుమరాలి వివాహ రిసెప్షన్లో బాబు పాల్గొంటారు. జల సంరక్షణపై కలసి పనిచేస్తాం జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. విజయవాడ సీఎం కార్యాలయంలో బాబుతో ఈబీటీసీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.