Central Board of Secondary Education (CBSE)
-
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
సీబీఎస్ఈకి ఆదాయ పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: పరీక్ష ఫీజులు, పాఠ్యపుస్తకాల విక్రయాలు మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి ఆర్థిక శాఖ మినహాయింపునిచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఫీజులు, అఫిలియేషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు.. ప్రచురణల విక్రయం, రిజిస్ట్రేషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, శిక్షణ ఫీజులు మొదలైన ఆదాయాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో సీబీఎస్ఈ ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా ఉంటేనే ఈ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 2020 జూన్ 1 నుంచి పరిమిత కాలం పాటు మాత్రమే ప్రస్తుత నోటిఫికేషన్లో ప్రస్తావించినందున అంతక్రితం సంవత్సరాలకు కూడా దీన్ని వర్తింపచేసేలా, అప్పటికే కట్టిన ట్యాక్స్‌ల రీఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి కోసం సీబీడీటీకి సీబీఎస్ఈ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ జాయింట్ పార్ట్నర్ ఓమ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. -
సీబీఎస్ఈ 10, 12 పరీక్షల్లో చాట్‌జీపీటీపై నిషేధం
న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొబైల్ ఫోన్లు, చాట్‌జీపీటీ యాక్సెస్ ఉన్న పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. పరీక్షల్లో చాట్‌జీపీటీ ఉపయోగించడం అంటే అనైతిక పద్ధతులు అనుసరించినట్లేనని అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రి–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్) గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్ఈ టర్మ్–1 పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల టర్మ్–1 బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గురువారం ప్రకటించింది. నవంబర్–డిసెంబర్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుందని, ఒక్కో టెస్టు వ్యవధి 90 నిమిషాలని పేర్కొంది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. టర్మ్–1, టర్మ్–2 పరీక్షల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. టర్మ్–2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. -
డిసెంబర్ 16 నుంచి సీటీఈటీ
న్యూఢిల్లీ: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)ని డిసెంబర్ 16–జనవరి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారితంగా 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష సిలబస్, భాష, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష జరిగే నగరాలు, మిగతా ముఖ్య సమాచారాన్ని సీటీఈటీ వెబ్సైట్ https://ctet.nic.in లో ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సీటీఈటీ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులకు తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో ఫలితాలను చూసుకోవచ్చు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దయినందున టాపర్స్ మెరిట్ జాబితాను ప్రకటించడం లేదని తెలిపింది. మొత్తం 12,96,318 మంది విద్యార్థులు 99.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2020లో 88.78 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం బాలుర కంటే బాలికలు 0.54% పైచేయి సాధించారు. బాలికల ఫలితాలు 99.67% కాగా, బాలురు 99.13% ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. -
2022లో రెండు టర్మ్‌లుగా విద్యా సంవత్సరం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి 10, 12 బోర్డు పరీక్షలకు ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం కోసం సిలబస్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్క్‌లను మరింత పారదర్శకంగా చేసేందుకు అనుసరించనున్న ప్రణాళికలను బోర్డు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు గతేడాది కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయగా, ఈ ఏడాది బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లో మొదటి టర్మ్ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో టర్మ్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీబీఎస్ఈ డైరెక్టర్ (అకాడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. విభజించిన సిలబస్ ఆధారంగా బోర్డు ప్రతి టర్మ్ చివరిలో పరీక్షలు నిర్వహిస్తుంది. విద్యాసంవత్సరం చివర్లో 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం సిలబస్‌ను గత విద్యాసంవత్సరం మాదిరిగా క్రమబద్ధీకరించి ఈ నెలలో ప్రకటిస్తారు. పాఠశాలలు విద్యాప్రణాళికలను కొనసాగించేందుకు ఎన్సీఈఆర్టీ నుంచి ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్, ఇన్‌పుట్స్‌ని తీసుకొనే అవకాశాన్ని కల్పించారు. -
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) , ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( ఐసీఎస్ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షలు గత షెడ్యూల్‌ప్రకారం జూలైలో జరగాల్సిఉంది. ఇంటర్నల్ పరీక్షల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ పరీక్షల్లో మార్కుల్ని నిర్ణయించి ఆగస్టులో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారికి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాస్తారా, లేదంటే గత మూడు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికెట్తో ముందుకు వెళతారా అన్నది వారి ఇష్టానికే వదిలిపెట్టారు. ఇలాంటి అవకాశం పదో తరగతి విద్యార్థులకులేదు. ఐసీఎస్ఈ 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్, సంజీవ్‌ఖన్నాల సుప్రీంకోర్టు బెంచ్‌కు కేంద్రం, సీబీఎస్ఈ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. జూలై 1–15 వరకు జరగాల్సిన మిగిలిన బోర్డు పరీక్షలన్నీ రద్దు చేసినట్టు సుప్రీంకు చెప్పారు. సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాయాలని భావించే విద్యార్థు లకు కోవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల్ని నిర్వహించవద్దంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం విచారణ చేపట్టిన సందర్భంగా కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయాన్ని తెలిపింది. తాజా నోటిఫికేషన్ ఇవ్వండి : సుప్రీం సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థులకు ఇచ్చిన పరీక్షల ఆప్షన్, గత పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులు ఏ విధంగా నిర్ణయిస్తారు ? , ఫలితాల తేదీ వంటివాటిపై కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండడం వల్ల పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు?
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని పరీక్షల నిర్వహణపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1-15 మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను రద్దుచేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 10, 12వ తరగతి పరీక్షల రద్దు అవకాశాలను పరిశీలించాలని సీబీఎస్ఈ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. (ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!) ‘కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అలా అని ఆలస్యంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 19 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు నిర్వహించాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాలు పలితాలు కూడా విడుదల చేశాయి. దీంతో కొన్ని యూనివర్సిటీలు కొత్త అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అప్పుడు సీబీఎస్ఈ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేసి గ్రేడ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే మార్కులు/గ్రేడ్స్ విషయంలో ఎవరికైన అభ్యంతరాలు ఉంటే వారికి తర్వాత పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అవుతుంది కావచ్చు. కానీ ఆ పరీక్షలు రద్దు చేయడం అసాధ్యం’ అని ఓ ప్రభుత్వాధికారి అనధికారికంగా తెలిపారు. (కరోనా సోకిన వ్యక్తి ఫోన్ చోరీ చేశాడు..) -
సీబీఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిలే టాప్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాల్లో బాలికలు దుమ్ములేపారు. బాలుర కంటే దాదాపు 9 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. అలాగే 500కు 499 మార్కులు సాధించి ఇద్దరు బాలికలు టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాలురు 79.40 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఈ పరీక్షల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఫలితాలను సీబీఎస్ఈ తన వెబ్సైట్లో పొందుపరిచింది. నగరాల వారీగా చూస్తే 98.20 ఉత్తీర్ణతా శాతంతో తిరువనంతపురం తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఉన్న చెన్నై రీజియన్ 92.93 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 91.87 శాతంతో ఢిల్లీ మూడో స్థానం పొందింది.విదేశాల్లో 78 సెంటర్లలో సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించగా.. వీరిలో 95.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు దాదాపు 12.05 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టాపర్లుగా నిలిచిన హన్సిక, కరిష్మా.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, ముజాఫర్‌నగర్‌కు చెందిన కరిష్మా అరోరాలు 500కు 499 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. రిషీకేశ్‌కు చెందిన గౌరంగీ చావ్లా, రాయ్‌బరేలీకి చెందిన ఐశ్వర్య, జిండ్కు చెందిన భవ్య 500కి 498 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 497 మార్కులతో మొత్తం 18 మంది విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. పరీక్షల ముందు నుంచే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండి, విశ్రాంతి వేళ పాటలు విన్నానని హన్సిక చెప్పింది. రిలాక్స్ అయ్యేందుకు డ్యాన్స్ చేసేదానినని కరిష్మా చెప్పింది. కేజ్రీవాల్ కుమారుడికి 96.4 శాతం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్‌కు 96.4 శాతం మార్కులు వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా పలువురు మంత్రులు పుల్కిత్‌కు అభినందనలు తెలిపారు. స్మృతీ ఇరానీ కుమారుడికి 91 శాతం ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కొడుకు జోహర్‌కు 91 శాతం మార్కులు వచ్చాయి. ‘వరల్డ్ కెంపో చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలవడమే కాదు, జోహర్ 12వ తరగతిలో 91 శాతం మార్కులు సాధించాడు. యాహూ’ అని స్మృతి ట్వీట్ చేశారు. రీ వెరిఫికేషన్‌కు 8 వరకు అవకాశం మార్కుల రీ వెరిఫికేషన్ కోసం మే 4 నుంచి 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు రుసుము రూ.500. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం విద్యార్థులు మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఆన్షర్ బుక్కు రూ.700 చొప్పున రుసుము చెల్లించాలి. జవాబు పత్రాల రీ వ్యాల్యుయేషన్‌కు మే 24, 25 తేదీల్లో దరఖాస్తు చేయడానికి సీబీఎస్ఈ అవకాశం కల్పిస్తోంది. ఒక్కో ప్రశ్నకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
ఔరా అనిపించిన అమ్మాయిలు
నొయిడా: సీబీఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో బాలికలే ముందంజలో ఉండగా.. బాలురు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన నిధి ఉపాధ్యాయ, సృష్టి సింగ్‌లు ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి 96 శాతం మార్కులు సాధించారు. వీరిద్దరు నొయిడాలోని సెక్టార్ 44 గల మహామాయ ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాలలో చదువుతున్నారు. ర్యాంకులు సాధించడానికి పట్టుదల, నిబద్ధత అవసరమని రుజువు చేశారు. ఖరీదైన, కార్పొరేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశారు. హ్యుమనిటీస్ విభాగంలో నిధి ఉపాధ్యాయ 96.2 శాతం మార్కులు సాధించగా, బయాలజీ విభాగంలో సృష్టి సింగ్ 98.8 శాతం మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం: నిధి ‘మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివాను. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు విషయంలో నాన్న వెన్నంటి ఉన్నారు. నా లక్ష్యం ఐఏఎస్ కావడం. కష్టపడి చదివి నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తా’ ఆమె కోసమే ఇక్కడికొచ్చా.. నిధి తండ్రి రామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ‘నా కూతురు చదువులో చురుగ్గా ఉంటుంది. ఆమె చదువు కోసమే ఈ పట్టణానికి వచ్చా. రోజంతా ఆటో నడిపినా పూట గడవడమే కష్టం. అయినే సరే ఆమె కోసం కష్టపడటంలో ఆనందం ఉంది. నిధి తప్పకుండా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది’ ఆర్మీ డాక్టర్నవుతా: సృష్టి ‘వ్యాపారం చేసుకుని మమ్మల్ని బాగా చూసుకునే నాన్నకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నా అనారోగ్యం కారణంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన వ్యాపారం పూర్తిగా నష్టాల బాట పట్టింది. నా ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. కానీ, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివా. నా కోసం మా టీచర్లు సాయంత్రం కూడా క్లాసులు పెట్టారు. వారికి నా ధన్యవాదాలు. చదువులో రాణించాలంటే గురువుల మార్గదర్శనం తప్పనిసరి. డాక్టర్ని అయి ఆర్మీలో సేవలందిస్తా’