న్యూఢిల్లీ: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)ని డిసెంబర్ 16–జనవరి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారితంగా 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష సిలబస్, భాష, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష జరిగే నగరాలు, మిగతా ముఖ్య సమాచారాన్ని సీటీఈటీ వెబ్‌సైట్ https://ctet.nic.in లో ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సీటీఈటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులకు తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment