31 శాతం వృద్ధి నమోదు
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, తయారీలో సానుకూలం
ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడి
ఏఐ నైపుణ్యాలకు డిమాండ్
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాలు డిసెంబర్‌లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 31 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో నియామకాలు 12 శాతం పెరిగాయి. ఆన్‌లైన్ జాబ్ పోస్టింగ్‌ల ద్వారా ఈ వివరాలను ఫౌండిట్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో నియామకాలు 36 శాతం పెరిగాయి.
→ కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57 శాతం నుంచి 60 శాతం వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్‌లో పెరిగాయి.
→ ఏఐ ఉద్యోగాలు గడిచిన రెండేళ్లలో 42 శాతం వృద్ధితో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డీప్ లెరి్నంగ్, ఎస్‌క్యూఎల్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. టెన్సార్‌ఫ్లో, పైటార్చ్ తదితర ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ల్లో నైపుణ్యాలున్న వారికి సైతం అధిక డిమాండ్ కనిపించింది.
→ హెచ్‌ఆర్ అడ్మిన్ ఉద్యోగ నియామకాలు గత మూడు నెలల్లో 21 శాతం పెరిగాయి.
→ మెడికల్ ఉద్యోగాలు సైతం 44 శాతం అధికంగా నమోదయ్యాయి. టెలీ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్‌కేర్ అనలిస్ట్ తదితర హెల్త్‌టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.
→ డిసెంబర్‌లో కోయింబత్తూరులో అత్యధికంగా 58 శాతం మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 33 శాతం చొప్పున అధిక నియామకాలు చోటుచేసుకున్నాయి.
→ టైర్–2, 3 నగరాలు హెల్త్‌కేర్ కేంద్రాలకు నిలయాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30 శాతం పెరిగాయి.
→ బెంగళూరులో 26 శాతం, పుణెలో 17 శాతం, ఢిల్లీలో 14 శాతం చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి.
ఏఐ కీలకం..
‘‘అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42 శాతం పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14 శాతం మేర వృద్ది ఉండొచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది’’అని ఫౌండిట్ సీఈవో వి.సురేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment