Central Teacher Eligibility Test
-
డిసెంబర్ 16 నుంచి సీటీఈటీ
న్యూఢిల్లీ: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)ని డిసెంబర్ 16–జనవరి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారితంగా 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష సిలబస్, భాష, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష జరిగే నగరాలు, మిగతా ముఖ్య సమాచారాన్ని సీటీఈటీ వెబ్సైట్ https://ctet.nic.in లో ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సీటీఈటీ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులకు తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది. -
అర్హత పరీక్షల్లో రిజర్వేషన్‌కు వీల్లేదు
న్యూఢిల్లీ: అర్హత పరీక్షల్లో రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ–(సీటెట్)–2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జడ్జీలు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎవరికైనా రిజర్వేషన్ అనేది అడ్మిషన్ల వేళ మాత్రమే పరిశీలనలోకి వస్తుందంది. అర్హత పరీక్షలకు రిజర్వేషన్ అనేది అర్ధరహితమని పేర్కొంది. సీటెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమేనని, రిజర్వేషన్ అంశం అడ్మిషన్ల సమయంలోనే తెరపైకి వస్తుందని తెలిపింది. జూలై 7వ తేదీన జరగనున్న సీటెట్ పరీక్ష నోటిఫికేషన్ గురించి పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించగా ధర్మాసనం స్పందించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకుగానీ రిజర్వేషన్ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తొలుత పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా లాయర్ మరోసారి అభ్యర్థించడంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. సీటెట్–2019 నిర్వహణ కోసం సీబీఎస్ఈ జనవరి 23వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌పై విచారణ 2018 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. జస్టిస్ ఇందిర, జస్టిస్ సంజీవ్‌ల బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ తన వాదనలు వినిపిస్తూ.. 2018 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుని, కేటాయించిన కేడర్లలో ఈ నెల 10వ తేదీన వారు జాయిన్ కావాల్సి ఉందన్నారు. ఈ సమయంలో అధికారుల కేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై 17న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేడర్ కేటాయింపులు అన్యాయంగా ఉన్నాయంటూ నలుగురు ఐపీఎస్ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోకేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. కాగా, తీవ్రమైన ఎండలు, రంజాన్ నెల కారణంగా ఆఖరి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ను ఉదయం 7కు బదులు 5.30గంటలకే మొదలయ్యేలా ఈసీను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేంద్ర విద్యాసంస్థల్లో టీచర్ అర్హతకు సీటెట్
సెంట్రల్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది. తాజాగా సీటెట్కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తివివరాలు... ఒకటి నుంచి ఐదో తరగతి: ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు పేపర్-1 ఉంటుంది. అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమానం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) ఉత్తీర్ణత లేదా రెండో ఏడాది చదువుతున్నవారు./45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు (2002-ఎన్సీటీఈ నిబంధనల మేరకు)/50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు లేదా నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు./50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు./ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి: ఐదు నుంచి ఎనిమిదో తరగతి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు పేపర్-2 రాయాలి. అర్హతలు: డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు./50 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) ఉత్తీర్ణుతులైన లేదా చదువుతున్నవారు అర్హులు./45 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) ఉత్తీర్ణుతులైన లేదా చదువుతున్నవారు అర్హులు(ఎన్సీటీఈ నిబంధనల మేరకు). / 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/తత్సమాన ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు లేదా నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు. లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, బీఏ/బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు./ 50 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా చదువుతున్నవారు అర్హులు. ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు అర్హత మార్కుల్లో 5 శాతం తగ్గింపు ఉంటుంది. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 19, 2015 ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: ఆగస్టు 20, 2015 పరీక్ష తేదీ: సెప్టెంబరు 20, 2015. పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్,విశాఖపట్నం, విజయవాడ. వెబ్సైట్: www.ctet.nic.in -
ఉపాధ్యాయ అర్హతకు సీటెట్!
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)... సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష. దీనిలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు! తాజాగా సీటెట్-2015 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు... నోటిఫికేషన్ సీటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు (1 నుంచి 5వ తరగతి) పేపర్-1లో అర్హత సాధించాలి. ఉన్నత పాఠశాలలో (6 నుంచి 8 తరగతి) ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు స్థాయిల్లో అంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయ అర్హత కోసం రెండు పేపర్లలో అర్హత సాధించాలి. పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. పరీక్ష విధానం: సీటెట్‌ను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. మార్కులు 150. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు. పేపర్-1 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ 30 30 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30 మొత్తం 150 150 పేపర్-2 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ (లేదా)సోషల్ సైన్స్ 60 60 మొత్తం 150 150 పేపర్ -1 అర్హత: అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)లో ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు/ తత్సమానం పేపర్-2 అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఏడాది వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ తత్సమానం ప్రిపరేషన్: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజిలో విద్యార్థుల వయసుకనుగుణంగా టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సైకాలజీలోని కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. లాంగ్వేజ్ విభాగంలో సంబంధిత మాధ్యమంలో అభ్యర్థి ప్రొఫిషియెన్సీతోపాటు కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. కాబట్టి బేసిక్ గ్రామర్ మీద పట్టు పెంచుకోవాలి. కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సోషల్ సైన్స్‌లో ఎక్కువగా కాన్సెప్ట్స్, ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించేందుకు పేపర్ -1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ/ సీబీఎస్ఈ పుస్తకాల్లోని సిలబస్‌కు అనుగుణంగా ప్రిపేరవ్వాలి. పేపర్-2కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదో తరగతి సిలబస్‌ను ఔపోసన పట్టాలి. అయితే ప్రశ్నల కఠినతా స్థాయి మాత్రం పేపర్-1కు పదోతరగతి స్థాయిలో, పేపర్-2కు సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఉంటాయి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అవగాహన పెంచుకుని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 8, 2015. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015. వివరాలకు: http://ctet.nic.in/