సెంట్రల్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది. తాజాగా సీటెట్‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తివివరాలు...
ఒకటి నుంచి ఐదో తరగతి: ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు పేపర్-1 ఉంటుంది. అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమానం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) ఉత్తీర్ణత లేదా రెండో ఏడాది చదువుతున్నవారు./45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు
అర్హులు (2002-ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు)/50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు లేదా నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు./50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు./ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు.
ఐదు నుంచి ఎనిమిదో తరగతి: ఐదు నుంచి ఎనిమిదో తరగతి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు పేపర్-2 రాయాలి. అర్హతలు: డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు రెండో ఏడాది చదువుతున్న వారు అర్హులు./50 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) ఉత్తీర్ణుతులైన లేదా చదువుతున్నవారు అర్హులు./45 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) ఉత్తీర్ణుతులైన లేదా చదువుతున్నవారు అర్హులు(ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు).
/ 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/తత్సమాన ఉత్తీర్ణత, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులైన వారు లేదా నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు. లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, బీఏ/బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నాలుగో ఏడాది చదువుతున్న వారు అర్హులు./ 50 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధి గల బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులైన వారు లేదా చదువుతున్నవారు అర్హులు. ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు అర్హత మార్కుల్లో 5 శాతం తగ్గింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 19, 2015
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: ఆగస్టు 20, 2015
పరీక్ష తేదీ: సెప్టెంబరు 20, 2015.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్,విశాఖపట్నం,
విజయవాడ.
వెబ్‌సైట్: www.ctet.nic.in
కేంద్ర విద్యాసంస్థల్లో టీచర్ అర్హతకు సీటెట్
Published Thu, Aug 6 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement