DATE ANOUNCED
-
మార్చిలో రష్యా ఎన్నికలు
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదో సారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచి్చన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు. చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్‌ను ఎదుర్కొనే వారెవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించిన ఇద్దరిలో, మాస్కో ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్, లాయర్ అయిన యక్తెరినా దుంట్సోవా ఉన్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం, ప్రైవేట్ సైన్యాధిపతి యెవ్గెనీ ప్రిగోజిన్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పారీ్టకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్‌కు సైతం వర్తిస్తాయి. 2018లో స్వతంత్రుడిగా పోటీ చేసిన పుతిన్ తరఫున ప్రచారకర్తలు సంతకాలు సేకరించారు. 2012 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ ఆయనను నామినేట్ చేసింది. దీంతో, సంతకాల సేకరణ అవసరం లేకుండాపోయింది. -
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్‌లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్‌స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
ఛాలెంజ్‌తో పాటు బాధ్యత
షూటింగ్ ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టనే లేదు.. అప్పుడే తెరపైకి సినిమాని తెచ్చే తేదీని కూడా ఫిక్స్ చేసేసింది ‘ఆదిపురుష్’ చిత్రబృందం. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్న ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన రాముడి పాత్ర పోషించనున్నారనే సంగతి తెలిసిందే. ‘‘ప్రతీ పాత్రకు ఒక్కో ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నేను చేయబోయే పాత్రకు ఛాలెంజ్‌తో పాటు చాలా బాధ్యత కూడా ఉంది’’ అని ఈ సినిమాని ప్రకటించినప్పుడే ప్రభాస్ అన్నారు. ఈ పాత్ర కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టారని టాక్. భారీ బడ్జెట్‌తో త్రీడీ చిత్రంగా రూపొందనున్న ‘ఆదిపురుష్’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
జూన్ 1నుంచి కాలువలకు నీరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని కాలువలకు జూన్ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 10లోగా నారుమడులు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇందుకు అనువుగా 7 నుంచి 10 టీఎంసీల వరకు సీలేరు జలాలను అదనంగా రప్పిస్తామని తెలిపారు. శివారు ప్రాంత భూములకు సమృద్ధిగా నీటిని అందించి జూన్ నెలాఖరు నాటికి జిల్లా అంతటా వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 15 నాటికి పనులు పూర్తి కావాలి చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తప్ప మిగిలిన ఇరిగేషన్ పనులన్నిటినీ జూన్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు కురిస్తే డెల్టా ఆధునికీకరణ పనులు చేయడం కష్టమవుతుందని, ఈలోగా ఎర్రకాలువ, నందమూరు అక్విడెక్ట్, ఎస్‌కేకేవైఆర్ వంటి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. తాడిపూడి ఎత్తిపోతల కోసం సేకరించిన భూమిలో పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వేస్తే తొలగిస్తామనే విషయాన్ని రైతులకు చెప్పాలని అన్నారు. ఆ భూములను సాగుకు పనికిరాకుండా గుంతలు తవ్వాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. శేషావతారం చానల్ నుంచి జూన్ 15 నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్ 5 నాటికి పోణంగి పుంత పనులు పూర్తి చేయాలని కోరారు. లబ్బీపేట స్లూయిజ్ 19 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పాతబడిన లాకుల షట్టర్లను తొలగించి కొత్తవి వేయాలని, వచ్చే మంగళవారం ప్రతి ప్రాంతానికి వెళ్లి తాను చూస్తానని అన్నారు. ఎక్కడైనా పాత షట్టర్లు కనిపించినా, పనులు కాకున్నా చర్యలు తప్పవని శెట్టిపేట డ్రెయినేజీ ఈఈ శ్రీనివాసరావును హెచ్చరించారు. హైవేను పొడిగించండి జాతీయ రహదారి–65ను కొవ్వూరు నుంచి నరసాపురం వరకు పొడిగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మలను కలెక్టర్ ఆదేశించారు. దీనివల్ల జాతీయ రహదారులకు కనెక్టివిటీ వస్తుందన్నారు.