
పూరీ / న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీంతోపాటు ఐదు, ఏడవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను పై తరగతులకు పంపబోమని వెల్లడించారు.
మరో అవకాశం కల్పించిన తర్వాత కూడా ఉత్తీర్ణులు కాకపోతేనే తర్వాతి తరగతులకు పంపబోమని జవదేకర్ స్పష్టం చేశారు. బోర్డు పరీక్షల్లో భారీ పర్సంటేజీలు సాధించేందుకు, మొత్తం ఉత్తీర్ణతా శాతంలో ఏకరూపకత కోసం పది, ఇంటర్ విద్యార్థులకు అదనపు మార్కులు నిలిపివేయాలని సీబీఎస్‌ఈతో పాటు అన్ని రాష్ట్రాలకు మానవవనరుల శాఖ సూచించింది. గ్రేస్ మార్కులను మాత్రం కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది.