పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం | Board Officials discuss process for conducting pending 10th and 12th exams | Sakshi
Sakshi News home page

పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం

Published Thu, Apr 30 2020 5:32 AM | Last Updated on Thu, Apr 30 2020 5:32 AM

Board Officials discuss process for conducting pending 10th and 12th exams - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా పెండింగ్‌లో పడిన 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కచ్చితంగా నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ సాన్యం భరద్వాజ్‌బుధవారం చెప్పారు. లాక్‌డౌన్‌ కంటే ముందు కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఆయా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశించడానికి వీలుగా అత్యంత ముఖ్యమైన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ సన్నద్ధమవుతోంది. ఇంకా 40కిపైగా సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండగా, 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్‌ పరీక్షలు ఎప్పటినుంచి జరుగుతాయన్న దానిపై విద్యార్థులకు 10 రోజుల ముందే నోటీసు ఇస్తామని భరద్వాజ్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement