కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్, జూలై 18 నుంచి 23 వరకు జరగనున్న జేఈఈ మెయిన్స్, జూలై 26న జరగనున్న నీట్ కన్నా ముందుగానే సీబీఎస్‌ఈ వాయిదాపడిన పరీక్షలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ తేదీలను నిర్ణయించారు.
లాక్‌డౌన్‌తో వాయిదా పడిన 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉండగా, అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలను ఇప్పుడు నిర్వహిస్తామని తెలిపారు. షెడ్యూల్ వచ్చేవారం ప్రకటిస్తామన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయుల ఇళ్ళనుంచి జరిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి ముందే, ఆగష్టు చివరికి 12వ తరగతి రిజల్ట్సును ప్రకటించేందుకు యత్నిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment