
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్‌తో రావాలని సీబీఎస్‌ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్‌డౌన్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే.