ఇంజినీరింగ్‌ చేస్తే సైబర్‌ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య | Bengaluru: Engineering Student Ends His Life Overhaul Education System Video | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ చేస్తే సైబర్‌ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య

Published Wed, Oct 27 2021 9:26 AM | Last Updated on Wed, Oct 27 2021 11:24 AM

Bengaluru: Engineering Student Ends His Life Overhaul Education System Video - Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుత విద్యా వ్యవస్థ నచ్చక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా గండసి గ్రామానికి చెందిన హేమంత్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్‌ విద్యా ర్థి. హేమంత్‌ హాసన్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమంత్‌ నేటి విద్యా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 

20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. తన తండ్రి ఉపాధ్యాయుడని, ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్‌ చేస్తే సైబర్‌ సెంటర్లో పనిచేయాలని అసంతృప్తి వ్యక్తం చేసాడు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆదిచుంచనగిరి స్వామి రావాలని, తన అవయవాలు దానం చేయాలని వీడియోలో కోరాడు. 

చదవండి: Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement