engineering candidates
-
ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలి.. ఆవేదనతో విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుత విద్యా వ్యవస్థ నచ్చక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా గండసి గ్రామానికి చెందిన హేమంత్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజినీరింగ్ విద్యా ర్థి. హేమంత్ హాసన్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమంత్ నేటి విద్యా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. తన తండ్రి ఉపాధ్యాయుడని, ఆయన వద్ద చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలను అలంకరించారన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే సైబర్ సెంటర్లో పనిచేయాలని అసంతృప్తి వ్యక్తం చేసాడు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆదిచుంచనగిరి స్వామి రావాలని, తన అవయవాలు దానం చేయాలని వీడియోలో కోరాడు. చదవండి: Tamilnadu Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం -
విద్యారంగంలో వ్యాపార ధోరణికి సీఎం జగన్ చెక్ పెట్టారు..
-
AP EAPCET ఫలితాలు విడుదల
-
ఏపీ ఈఏపీ సెట్: టాప్ టెన్.. అబ్బాయిలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్–2021 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఫలితాల్లో 80.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకులను బాలురు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విజయవాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ర్యాంకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీ నుంచి అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,76,586 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 1,66,460 పరీక్షకు హాజరయ్యారని, వీరిలో 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇందులో బాలురు 79,221 మంది కాగా.. బాలికలు 54,984 మంది ఉన్నారు. గత ఏదితో పోలిస్తే అదనంగా వెయ్యి మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు వివరించారు. ఈ నెల 14వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీలో 120, తెలంగాణలో 3 కేంద్రాల్లో 15 సెషన్లలో ‘ఏపీ ఈఏపీసెట్–2021’ పరీక్షలను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) 2021 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కోవిడ్ సోకడంతో పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి ర్యాంకు కార్డులు అందజేస్తామని మంత్రి చెప్పారు. పరీక్షకు హాజరైన 18,547 మంది ఎస్సీ, 3,455 మంది ఎస్టీ విద్యార్థులు నూరు శాతం అర్హత సాధించినట్టు వివరించారు. రెండు నెలల రికార్డు సమయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఏపీ ఈఏపీసెట్–2021ను నిర్వహించిన కాకినాడ జేఎన్టీయూ వర్సిటీ అధికారులను మంత్రి అభినందించారు. ఎంసెట్ స్థానంలో ఈఏపీ సెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. అయితే, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. ఈ క్రమంలో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పేరుతో కొనసాగిస్తున్నారు. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ స్ట్రీమ్‌కు పరీక్షలు (ఇంగ్లిషు, తెలుగు భాషల్లో) నిర్వహించారు. 160 మార్కులకు కంప్యూట్ బేస్ట్ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఫైనల్ కీ విడుదల చేసి ప్రత్యేక వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణులతో వెరిఫికేషన్ కమిటీ నియమించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పారదర్శకంగా మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేశారు. విద్యను వ్యాపారం కానివ్వం గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడంతో చాలా మంది నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైందని మంత్రి ఆదిమూలపు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాంకేతిక విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అర్హత సాధించిన పేద పిల్లలకు కూడా ప్రైవేట్ వర్సిటీలు, కార్పొరేట్ కళాశాలల్లో 35 శాతం సీట్లు కేటాయించేలా కేబినెట్లో ఆమోదించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలు జవాబుదారీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల ఖాతాల్లోనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తోందన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2 వేల కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్టు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయడంపై కోర్టు స్టే విధించిందని మంత్రి తెలిపారు. తల్లుల ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయడం వల్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, బోధనా సిబ్బంది తదితర అంశాలను తల్లిదండ్రులు తెలుసుకుని తమ పిల్లలను చేర్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన వారిలో ఒకరిద్దరు తల్లులు పొరపాటున లేదా మరే కారణం వల్ల కళాశాలలకు ఫీజులు చెల్లించి ఉండకపోవచ్చన్నారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేసుకోవాలనుకోరని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ప్రైవేట్ వర్సిటీల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల కేటాయింపు మెరిట్ చూడకుండా, పారదర్శకత పాటించకుండా పూర్తి వ్యాపార ధోరణితో కేటాయించే పరిస్థితి ఉండేదన్నారు. బీ–కేటగిరీ కింద ఈ ఏడాది నుంచి 70 శాతం ‘ఏపీ ఈఏపీసెట్’ ద్వారా, మిగిలిన 30 శాతంలో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, మిగిలిన 15 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం స్థానిక, స్థానికేతర కోటాలో భర్తీ చేస్తామన్నారు. ఇంటర్మీడియెట్‌లో గత ఏడాది నుంచి ఆన్లైన్లో ప్రవేశాలు తీసుకొచ్చామన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం కలిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 శాతం కళాశాలల్లో ప్రవేశాలు పొందారని వివరించారు. ఆన్లైన్ ప్రవేశాలపై కోర్టు స్టే విధిస్తూ.. తల్లిదండ్రలకు అవగాహన కల్పించి విసృత ప్రచారం కల్పించాలని సూచిందన్నారు. పేదలకు సైతం కార్పొరేట్ విద్య ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఫీజుల నియంత్రణకు కమిటీ లేకపోవడం వల్లే ప్రైవేట్ వర్సిటీలు ఇష్టానుసారంగా దండుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు సైతం కార్పొరేట్ విద్యను అందించే మహాయజ్ఞం చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సెట్స్ డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం: శ్రీనిఖిల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన కోయి శ్రీనిఖిల్ 160 మార్కులకు గాను 158.3400 మార్కులు సాధించాడు. శ్రీనిఖిల్ తండ్రి వెంకటేశ్వరరావు కొడిగెనహళ్లిలోని ప్రభుత్వ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో, తల్లి సుజాత హిందూపురంలోని నేతాజీ మునిసిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీనిఖిల్ మాట్లాడుతూ.. ఐఐటీలో సీటు సంపాదించే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. నా లక్ష్యం సివిల్స్: మహంత నాయుడు ఇంజనీరింగ్ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వారాడ మహంతనాయుడు 160 మార్కులకు గాను 156 మార్కులు సాధించాడు. అతడి తల్లిదండ్రులు త్రివేణి, రామారావు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మహంత నాయుడు మాట్లాడుతూ.. తాను జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంక్ పొంది ఐఐటీ ముంబైలో చేరి సివిల్స్ సాధించడమే లక్ష్యమని తెలిపారు. చదవండి: దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్ -
ఇక స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థులు, అర్హులైన నిరుద్యోగులకు ఐటీ హబ్ ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు పొందే మహోన్నత అవకాశం లభించనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ నెల 7వ తేదీన తనతో సహా నలుగురు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మం ఐటీ హబ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐటీ ఉద్యోగాలకే ఈ హబ్ పరిమితం కాకుండా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా నిరుద్యోగులకు నిరంతరం శిక్షణ ఇచ్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే తన క్యాంప్ కార్యాలయంలో నడుస్తున్న టాస్క్‌ను ఐటీ హబ్‌కు తరలిస్తున్నామని, ఎటువంటి విద్యార్హత ఉన్నా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుందని అన్నారు. ఈ నెల 2న జరగాల్సిన మంత్రుల పర్యటన జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, ఈ నెల 5న మంత్రుల పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసుకున్న ఐటీ హబ్‌లో స్వల్ప మార్పులతో అదనంగా మరో అంతస్తు ఏర్పాటు చేశామని, మొదటి దశ పూర్తి చేసి వివిధ ఐటీ కంపెనీలకుగాను 425 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకున్న ఐటీ హబ్‌లో ఇప్పటికే 16 కంపెనీలు భాగస్వాములయ్యాయని, ఇటీవలే నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 5వేల మందికి పైగా యువత జాబ్‌మేళాకు హాజరయ్యారని తెలిపారు. ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్, పతో తరగతి అర్హతపై కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన సంకల్పమని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పోటీపడి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని, నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి చొరవతో వందల కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నగరంలో నూతన హంగులతో అన్ని వసతులతో ఏర్పాటవుతున్న ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా జనవరిలో ప్రారంభించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. నగరాభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఇప్పటికే సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్లను నాలుగు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేసి.. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమపద్ధతిన బాధ్యతాయుతంగా నగరాభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు పునరావాసం కల్పించడంలో కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ జి.పాపాలాల్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ జి.కృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ వద్దు.. సివిల్సే ముద్దు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసు కేడర్ పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల వైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఎక్కువ దృష్టి సారిస్తోంది. గతంలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లలో డిగ్రీ చేసిన వారు సివిల్స్‌కు ఎక్కువగా హాజరయ్యేవారు. బీఈ, బీటెక్ చేసిన వారు ఐటీ, తదితర తమ కోర్ గ్రూపు పోస్టుల వైపు వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అభ్యర్థులతోపాటు బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు సివిల్స్‌వైపు మొగ్గుచూపుతుండడమే కాకుండా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే.. ► ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో పట్టు ఉండడంతో సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ► అభ్యర్థుల్లో లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఆంగ్ల నైపుణ్యం పరిశీలనకు సీశాట్ పెట్టారు. ఈ మూడింటిలోనూ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది. ► ఐటీ రంగంలో మంచి అవకాశాలు దక్కుతున్నా ప్రైవేటు రంగంలో అనిశ్చిత పరిస్థితులు, ప్రతికూల పరిణామాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల్లో కోత తదితర కారణాలతో సివిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ► అంతేకాకుండా ఈ అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తమ కోర్ గ్రూప్ సబ్జెక్టులను కాకుండా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టు (ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ తదితర)లను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ► జేఈఈ మెయిన్స్, అడ్వాన్సులతోపాటు బిట్స్ పిలానీ వంటి వాటి ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన అనుభవం సివిల్స్ సన్నద్ధతకు బాగా ఉపయుక్తంగా ఉంటోంది. ► 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన సివిల్స్ పరీక్షల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే ఉన్నారని.. తమ సంస్థ నుంచి 10 మంది ఎంపికయ్యారని సివిల్స్ శిక్షణ సంస్థ మెంటార్ ఒకరు వివరించారు. ► సివిల్స్–2019లో విజయం సాధించిన మొత్తం 829 మందిలో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులే అత్యధికమని విశ్లేషిస్తున్నారు. ► ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులలో కూడా 90 శాతం మంది వీరేనని పేర్కొంటున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, నల్లగొండ: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించనున్న క్షితిజ్ వార్షిక టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020 జనవరి 17 నుంచి జరిగే ఈ ఫెస్ట్‌కు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనాల్సి ఉందన్నారు. సాంకేతిక రంగంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఐబీఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్ డెవలపర్స్ ఫర్గో, సెబీ లాంటి సంస్థలు వర్క్‌షాప్‌లో పాల్గొంటాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 70వేల మంది విద్యార్థులు పాల్గొంటారని, ఉత్తమ ప్రతిభ చూపిన సాంకేతిక అంశాలను ప్రదర్శించిన వారికి రూ. 50లక్షల బహుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం www.ktj.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. -
పోలీసు పోస్టులకు బీటెక్, ఎంటెక్‌లు
♦ 32 వేల మంది బీటెక్, 1,836 మంది ఎంటెక్ అభ్యర్థుల దరఖాస్తు ♦ మొత్తం దరఖాస్తులు 5,36,037.. పోస్టులు 9,281.. ♦ ఒక్కో పోస్టుకు 57 మంది పోటీ ♦ అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 మంది దరఖాస్తు ♦ పోటీలో తెలంగాణేతరులు 18,358 మంది సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఉన్నత విద్యావంతులే కాదు.. ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా భారీగా పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ కనీస అర్హత కాగా... పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్, బీటెక్ చదివినవాళ్లూ పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల గడువు గురువారం రాత్రి 12 గంటలతో ముగిసే సమయానికి మొత్తం 5,36,037 దరఖాస్తులు వచ్చాయి. అందులో మహిళలు 82,889 మంది, పురుషులు 4,53,148 ఉంది ఉన్నారు. బీటెక్ గ్రాడ్యుయేట్లు 32,729, పీజీ చేసినవారు 28,610, బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 1,32,327 మంది ఉన్నారు. మొత్తంగా 9,281 పోస్టులు ఉండగా... ఒకో పోస్టుకు 57 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మహిళా అభ్యర్థులు అంతంతే.. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మహిళల నుంచి అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పోలీసు విభాగంలో మహిళల శాతం తక్కువగా ఉండటంతో... వారి సంఖ్యను పెంచడానికి ఈసారి ప్రత్యేకంగా 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. అయినా పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా అభ్యర్థుల నుంచి కేవలం 82,889 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా 4,219 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి 11,691 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల్లో నల్లగొండ జిల్లా టాప్ పోలీసు కొలువుల కోసం వచ్చిన దరఖాస్తులలో నల్లగొండ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పోలీసు విభాగంలో అన్ని ఫార్మాట్లలో నల్లగొండ జిల్లావాసులే ఎక్కువగా ఉండడం గమనార్హం. అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో వరంగల్ (67,583), మహబూబ్‌నగర్ (56,292), రంగారెడ్డి (55,720), కరీంనగర్ (55,600), ఆదిలాబాద్ (51,212), ఖమ్మం (51,144), హైదరాబాద్ (38,757), మెదక్ (38,516), నిజామాబాద్ (31,112) ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన వారు 18,358 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
రేపటి నుంచి ఆన్లైన్లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
మే 2 నుంచి హాల్‌టికెట్ల జారీ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే 17న జరిగే ఎంసెట్-2014 పరీక్షకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు మంగళవారం తెలిపారు. ఈసేవ/మీసేవ/ ఏపీ ఆన్లైన్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సవరించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు రూ.250, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులు రూ. 250 చొప్పున, రెండింటికీ హాజరయ్యేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 2 నుంచి 15 వరకు హాల్ టి కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చన్నారు. అదేవిధంగా రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు పంపవచ్చని వివరించారు. -
కొలువుదీరుతాం
సాక్షి, నల్లగొండ: వీఆర్ఓ (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. పల్లెల్లో కొలువుదీరడానికి అభ్యర్థులు తహతహలాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ గగనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల ప్రకటన నిరుద్యోగులకు సువర్ణావకాశంగా మారింది. వీటిని దక్కించుకునేందుకు ఉన్నత విద్యావంతులూ పోటీ పడుతున్నారు. దర ఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. వాస్తవంగా వీఆర్ఏకు ఎస్సెస్సీ, వీఆర్ఓకు ఇంటర్మీడియెట్ అర్హతగా ఉన్నా పీజీ చేసినవారూ దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 70శాతం వారివేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంత పోటీ..? జిల్లాలో 68 వీఆర్ఓ, 201 వీఆర్ఏ పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 2న రాత పరీక్ష జరగనుంది. గతనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించారు. గడువు ముగిసేనాటికి మొత్తం 88,299 దరఖాస్తులు అందాయి. ఇందులో ఒక్కో వీఆర్ఓ పోస్టు దక్కించుకునేందుకు దాదాపు 1,255మంది పోటీపడుతున్నారు. వీఆర్ఓ ఉద్యోగం పొందితే జీవితానికి ఢోకా లేదన్న ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. విద్యార్హతలు బట్టి కొన్నేళ్లలోనే తహసీల్దార్ వరకు పదోన్నతి ద్వారా వెళ్లొచ్చు. వీఆర్ఏలు.. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎదగవచ్చు. అన్నీ కలుపుకుని వీఆర్ఓకు ప్రారంభం వేతనం 15వేలు. అది కూడా సొంత జిల్లాలో. ఈ కారణాల వల్ల ఈ పోస్టులకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని చేజిక్కించుకునేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు నిరుద్యోగులు. ఈ నెల 15వ తేదీలోపు ఫొటో పరిశీలన పూర్తికాగానే హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాలతోపాటు ఆయా మండల కేంద్రాల్లో దాదాపు 250 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్ సెంటర్లు కిటకిట.... వీఆర్ఓ, వీఆర్ఏ భర్తీ ప్రకటన రాగానే ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఆరు నుంచి ఇంటర్ వరకు సిలబస్ లభ్యం కావాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో దరఖాస్తుదారులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడల్లోని ఒక్కో ఇనిస్టిట్యూట్ 2వేల నుంచి 4వేల వరకు అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. అంతేగాక జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్, మల్లు వెంకట నర్సింహారెడ్డి(ఎంవీఎన్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉన్నత విద్యావంతులూ ఇదే బాటలో... ఉద్యోగ భద్రత ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను పొందేందుకు ఉన్నత విద్యావంతులూ రంగంలోకి దిగారు. గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే వారు సైతం ఈ పోస్టులకు పోటీపడుతుండడం విశేషం. ఎంసీఏ, ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులు, ఇంజినీరింగ్, బీఈడీ చేసిన వాళ్లూ దృష్టిపెట్టారు.