మే 2 నుంచి హాల్‌టికెట్ల జారీ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే 17న జరిగే ఎంసెట్-2014 పరీక్షకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణారావు మంగళవారం తెలిపారు. ఈసేవ/మీసేవ/ ఏపీ ఆన్‌లైన్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో తప్పులను ఆన్‌లైన్‌లోనే సవరించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు రూ.250, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులు రూ. 250 చొప్పున, రెండింటికీ హాజరయ్యేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
మే 2 నుంచి 15 వరకు హాల్ టి కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చన్నారు. అదేవిధంగా రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు పంపవచ్చని వివరించారు.
రేపటి నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
Published Wed, Feb 19 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement