NV ramana rao
-
మే 27న ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఈ నెల 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కమిటీ చేపట్టిన కసరత్తు పూర్తయింది. 1,44,510 మంది ఇంజనీరింగ్ 1,02,012 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ సిబ్బందితోనే నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు సమావేశమై పరీక్ష కేంద్రాలను నిర్ణయించారు. ఇంజనీరింగ్‌కు 276 పరీక్ష కేంద్రాలు అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు 190 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదు చేయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని రమణారావు తెలిపారు. పరీక్ష జరిగిన రోజే(మే15న) ఎంసెట్ కీ విడుదల చేయనున్నారు. మే 27న ఎంసెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. జూలై 1 నుంచి ఇంజనీరింగ్, మెడికల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. -
కేంద్ర బిందువు రిజిస్ట్రారే..!
- జేఎన్టీయూహెచ్లో ‘క్రెడిట్స్’ పెంపు రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయమే - వెల్లువెత్తుతున్న ఆరోపణలు - ‘సాక్షి’ కథనంతో దుమారం.. సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూహెచ్)లో ప్రమోషన్ క్రెడిట్స్ పెంపు అంశం దుమారం రేపుతోంది. వర్సిటీ అధికారులు అర్ధంతరంగా క్రెడిట్స్ పెంచడంతో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ‘విద్యార్థులపై క్రెడిట్స్ పిడుగు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అధికారుల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే పరి స్థితి ఏర్పడటంతో ఈ కథనం యూనివర్సిటీలో చర్చనీయాం శంగా మారింది. రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయంతోనే ఈ దుస్థితి దాపురించిందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ లో కిందిస్థాయి అధికారులు సైతం క్రెడిట్స్ పెంపు పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్వీ రమణారావు పదవీ విరమణ తర్వాత రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ యాదయ్య తన మార్క్ ప్రదర్శించాలన్న తహతహతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోధనలో నాణ్యత, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలన్న ఉద్దేశం మంచిదే అయినా.. ఉన్నఫళంగా అమలు చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’ రిజిస్ట్రార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్ని స్వీకరించలేదు. నేడు సమావేశం.. ధర్నా: ‘సాక్షి’ కథనం నేపథ్యంలో సమస్య వర్సిటీ ఇన్చార్జి వీసీ రాజీవ్ ఆచార్య దృష్టికి వెళ్లింది. ఆయన ప్రమోషన్ క్రెడిట్స్ విషయాన్ని ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో క్రెడిట్స్ పెంపుపై చర్చ కోసం గురువారం భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ ఆచార్య, రిజిస్ట్రార్, రెక్టార్, ఇవాల్యూషన్ డెరైక్టర్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డెరైక్టర్‌తోపాటు సంబంధిత విభాగాధిపతులు పాల్గొననున్నారు. అటు రిజిస్ట్రార్, వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వర్సిటీ లో గురువారం ధర్నా నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. -
ఇంటర్ వెయిటేజి మార్కులతో ఎంసెట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. వీరిని మొదటి దశ కౌనె ్సలింగ్లో అనుమతిస్తామన్నారు. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చి రెండో దశలో ర్యాంకులను ఖరారు చేస్తామని, ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు వారిని అనుమతిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌లో వచ్చే మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ర్యాంకులను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. -
మళ్లీ మళ్లీ రాసేవారిపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఎంసెట్‌లో మంచి ర్యాంకు పొంది ఇప్పటికే కాలేజీలో చేరిన విద్యార్థులు ఈ ఏడాది కూడా ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. వీరిపై పోలీసు నిఘా పెట్టామని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు చెప్పారు. వేరెవరికైనా సాయం చేసేందుకు వీరు యత్నిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష కుంభకోణం నేపథ్యంలో ఎంసెట్‌లో అక్రమాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆదివారం ‘సాక్షి’కి చెప్పారు. వివరాలు.. గత ఏడాది మంచి ర్యాంకు వచ్చినా ఈ ఏడాది కూడా ఎంసెట్ రాయడానికి దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మంచి ర్యాంకు వచ్చిన వారు కూడా మళ్లీ ఎందుకు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకోవాలని ఆయా అభ్యర్థుల వివరాలు పోలీసులకు ఇచ్చాం. అనుమానాలుంటే కేసులు నమోదు చేస్తాం. లేట్ ఫీజు కింద రూ. 5 వేలు కట్టి దరఖాస్తు చేయడం వెనక ఏమైనా ప్రలోభాలున్నాయా? అనే కోణంలోనూ విచారిస్తాం. మెడికల్ పీజీ ఎంట్రెన్స్ కుంభకోణం నేపథ్యంలో.. ఎంసెట్‌లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసుల సహాయం కోరాం. అక్రమాలకు అడ్డుకట్ట వే సేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాం. ఈ నెల 12న డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌తో భేటీ కానున్నాం. ఎంసెట్ ఏర్పాట్ల పర్యవేక్షణ, అక్రమాల నివారణ కోసం అన్ని పెద్ద సెంటర్లకు నేను స్వయంగా వెళతాను. మిగతా సెంటర్లకు సీనియర్ అధికారులను పంపిస్తాం. ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించనున్నాం. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించం. పేపర్‌ను స్కాన్ చేసే కళ్లద్దాలు మార్కెట్లోకి వచ్చాయని తెలిసింది. అలాంటివి తీసుకురాకుండా తనిఖీ చేస్తాం. ఎంసెట్‌కు 3.95 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో 2.85 లక్షల మంది ఇంజనీరింగ్, 1.13 లక్షల మంది మెడికల్ అభ్యర్థులున్నారు. ఈ నెల 8 నుంచి వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రేపటి నుంచి ఆన్లైన్లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
మే 2 నుంచి హాల్‌టికెట్ల జారీ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే 17న జరిగే ఎంసెట్-2014 పరీక్షకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు మంగళవారం తెలిపారు. ఈసేవ/మీసేవ/ ఏపీ ఆన్లైన్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సవరించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు రూ.250, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులు రూ. 250 చొప్పున, రెండింటికీ హాజరయ్యేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 2 నుంచి 15 వరకు హాల్ టి కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చన్నారు. అదేవిధంగా రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు పంపవచ్చని వివరించారు.