అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు శుభవార్త. తమ దేశంలో చదువుకోండంటూ జనవరి నుంచి ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్ కోసం వీసా ధరఖాస్తు కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇటీవల భారత్-అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వీసాల కోసం భారతీయులు ఎక్కువ కాలం ఎదురు చూడడం ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన అమెరికా ప్రభుత్వం పలు దేశాల్లోని అమెరికా కార్యాలయాల నుంచి సిబ్బందిని భారత్‌కు పంపటానికి రంగం సిద్ధం చేసింది.
ఈ క్రమంలో ఎడ్యుకేషన్ వీసాలను జారీ చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కోవిడ్-19 నుంచి అన్ని రకాల వీసాలను జారీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టేది. దీంతో మిగిలిన వీసాల జారీని నిలిపివేసి కేవలం చేసి గడిచిన విద్యా సంవత్సరంలో ఎఫ్-1 వీసాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, గత ఎడ్యుకేషన్ ఇయర్ 82వేల మందికి ఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. త్వరలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్‌కు అదే తరహాలో వీసా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment