Student visa processing
-
అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి శుభవార్త
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు శుభవార్త. తమ దేశంలో చదువుకోండంటూ జనవరి నుంచి ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్ కోసం వీసా ధరఖాస్తు కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత్-అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వీసాల కోసం భారతీయులు ఎక్కువ కాలం ఎదురు చూడడం ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన అమెరికా ప్రభుత్వం పలు దేశాల్లోని అమెరికా కార్యాలయాల నుంచి సిబ్బందిని భారత్‌కు పంపటానికి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ వీసాలను జారీ చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కోవిడ్-19 నుంచి అన్ని రకాల వీసాలను జారీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టేది. దీంతో మిగిలిన వీసాల జారీని నిలిపివేసి కేవలం చేసి గడిచిన విద్యా సంవత్సరంలో ఎఫ్-1 వీసాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, గత ఎడ్యుకేషన్ ఇయర్ 82వేల మందికి ఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. త్వరలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్‌కు అదే తరహాలో వీసా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చైనాకు 2 రోజులు.. భారత్‌కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్‌కు రెండు రోజులు, ఇస్లామాబాద్‌కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్‌కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
ఈ వీసాతో వెళ్తే ‘తిరుగు టపా’నే!
♦ అమెరికా, బ్రిటన్‌లోని నిషేధిత యూనివర్సిటీలతో కాంట్రాక్ట్ ♦ బోగస్ ధ్రువీకరణ పత్రాలతో స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ♦ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం నిషేధించిన కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా చేరడానికి వెళ్తున్న 20 మందిని శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేసిన విషయం మరువకముందే.. ఇదే తరహా వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని, విద్యార్థుల్ని మోసం చేస్తున్న బోగస్ కన్సల్టెన్సీ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రట్టు చేశారు. ప్రధాన నిందితుడు మీర్ ఆమిర్ అలీఖాన్‌ను అరెస్టు చేసి, భారీగా బోగస్ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. నానల్‌నగర్‌కు చెందిన అలీఖాన్ ఎంబీఏ పూర్తి చేశాడని, 2009లో మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ కెరియర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడని, ఇతడికి నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతో ఒప్పందం ఉందని చెప్పారు. అటు విజిట్.. ఇటు స్టడీ వీసాలు.. తొలినాళ్లల్లో అలీఖాన్.. విజిటింగ్ వీసాలతో పాటు స్టడీ వీసాలు ఇప్పించేవాడు. వీటి ప్రాసెసింగ్‌కు అవసరమైన బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణ మంజూరు పత్రాలు, వివిధ కాలేజీల పేర్లతో ఉండే సిఫార్సు పత్రాలు, చార్టెడ్ అకౌంటెంట్ నివేదికలు, అఫిడవిట్లు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు.. బోగస్‌వి తయారు చేసేవాడు. స్టాంపులు కూడా నకిలీవి రూపొందించాడు. అతని కార్యాలయంలో ఏడెనిమిది మంది ఉద్యోగుల్నీ నియమించుకున్నా డు. నకిలీ పత్రాలు అందించడానికి ఒక్కో వ్యక్తి దగ్గర రూ.30 వేల నుంచి రూ.60 వేల వర కు వసూలు చేసేవాడు. బోగస్ వర్సిటీలతో ఒప్పందాలు.. నిషేధిత జాబితాలో చేర్చే వర్సిటీలు యూఎస్, యూకేల్లో అనేకం ఉన్నాయి. ఇలాంటి కోవకే చెందిన ఫ్రెండ్లీ వర్సిటీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూఎస్ఏలతో పాటు నిషేధిత జాబితాలో చేరిన నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతోనూ ఇతడికి ఒప్పందాలున్నాయి. వర్సిటీలో చేర్చిన ఒక్కో విద్యార్థికి 600 నుంచి వెయ్యి డాలర్ల వరకు అలీఖాన్‌కు కమీషన్ ఇచ్చేవి. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే విద్యార్థుల పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర వివరాలు తీసుకునేవాడు. ఆయా వర్సిటీల నుంచి కొరియర్ ద్వారా ‘ఐ-20’ ఫామ్‌ను తెప్పించేవాడు. ఆ వర్సిటీల్లో సీటు ఇప్పించడం ద్వారా రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసేవాడు. అలా వెళ్తే ఇక్కట్లు పడాల్సిందే.. అలీఖాన్ ఈ రకంగా కొన్నేళ్లుగా దాదాపు 300 మందిని విదేశాలకు పంపినట్లు పోలీసులు చెపుతున్నారు. ఇతడి మాటలు నమ్మి ఆయా వర్సిటీల్లో చేరడానికి వెళ్లేవారు ఇక్కట్లు పడాల్సిందే. అయితే వెళ్లేప్పుడు విమానాశ్రయంలో ఆపేయడమో, వెళ్ళినా.. అక్కడి విమానాశ్రయం నుంచి వెనుక్కి పంపడమో జరుగుతుందని, తిరిగి వచ్చే చార్జీలు సైతం విద్యార్థులే భరించాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అధికారులు అలీఖాన్‌కు సహకరించిన వీరాస్వామి అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.