UGC NET
-
నెట్ పరిధిలో చేర్చొద్దు
సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ ప్రవేశాలను యూజీసీ నెట్ పరిధిలో చేర్చేందుకు సిద్ధమైన రాష్ట్ర యూనివర్సిటీలు, తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నాయి. ఎప్పటిలాగే యూనివర్సిటీల అర్హత పరీక్ష ద్వారానే ప్రవేశాలు కలి్పంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు లేఖ రాయనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే లేఖను సిద్ధం చేసింది. మరోవైపు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ కూడా యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్‌ను కలిసి ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలిసింది. యూజీసీ ప్రతిపాదన ప్రకారం పీహెచ్‌డీలను జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా భర్తీ చేయాలన్న ప్రతిపాదన వల్ల ఇబ్బందులున్నాయని చెప్పినట్టు సమాచారం. తీవ్రంగా వ్యతిరేకించిన విద్యార్థులు రాష్ట్రంలో ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో అత్యధికంగా పీహెచ్‌డీలు చేస్తుంటారు. ప్రతి ఏటా 200కు పైగా విద్యార్థులకు అవకాశం కలి్పస్తారు. ఈ ప్రవేశాలు రెండు రకాలుగా ఉంటాయి. నెట్, కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ రీసెర్చి ఫెలోషిప్‌కు ఎంపికైన వారిని ఒక కేటగిరీగా భావిస్తారు. మొత్తం సీట్లల్లో సగం వీరికి కేటాయిస్తారు. మిగిలిన సగం సీట్లను యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చిలో యూజీసీ కొత్త నిబంధనను తీసుకొచి్చంది. జాతీయ విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పీహెచ్డీ ప్రవేశాలను జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీని అమలుకు రాష్ట్రంలోని వర్సిటీలు కూడా సిద్ధమయ్యాయి. అయితే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. పలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో దీనిపై సమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. నెట్‌తో అయితే నష్టమేంటి? జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష వల్ల తమకు నష్టం జరుగుతుందనేది విద్యార్థుల ఆందోళన. పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అరకొర వసతులతో చదువుతున్నారు. చాలా కాలేజీల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు లేవు. రాష్ట్ర స్థాయి సిలబస్‌తోనే విద్యాభ్యాసం ముగిస్తారు. నెట్ పేపర్ పూర్తిగా జాతీయ స్థాయిలో ఉండే సిలబస్ నుంచి ఇస్తారు. యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షతో పోలిస్తే ఇది కఠినంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీ పడటం, ఎంపిక కావడం కష్టమని వారు భావిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య నెట్ ద్వారా అర్హత పొంది పీహెచ్డీ చేయడం కష్టమని అంటున్నారు. ఈ వాదనతో ఏకీభవిస్తున్న వర్సిటీలు, అధికారులు విషయం యూజీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. -
నీట్ యూజీ ఫలితాలు: సెంటర్ల వారీగా విడుదల
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్లో శనివారం ఈ ఫలితాలను అప్లోడ్ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in. వెబ్సైట్లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. -
ఆన్లైన్లో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్‌షీట్?
సాక్షి,న్యూఢిల్లీ : యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ స్కూల్ విద్యార్ధి యూజీసీ- నెట్ నకిలీ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రాంలో షేర్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. సదరు విద్యార్ధిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జూన్ 18న నిర్వహణ.. ఆ వెంటనే పరీక్ష రద్దు కేంద్ర విద్యా శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ-నెట్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే కేంద్రం ఆ పరీక్షను జూన్ 18న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. అనూహ్యాంగా యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ అయ్యిందని కేంద్రానికి సమాచారం అందింది.వెంటనే ఆ మరుసటి రోజే (జూన్19) పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సత్వరమే విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీచేశారు. స్కూల్ విద్యార్థిపై CBI ఛార్జ్‌షీట్!దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పేపర్ లీకేజీ జరిగిందా? జరిగితే అందుకు కారకులు ఎవరనేది ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ తన దర్యాప్తులో జూన్ 18న జరిగిన పరీక్షకు సంబంధించి లీకైన ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్‌ను ఓ పాఠశాల విద్యార్థి టెలిగ్రామ్‌లో షేర్ చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. ఈ అంశంపై సదరు పాఠశాల విద్యార్ధిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుందని సమాచారం. యూజీసీ పరీక్ష కొత్త తేదీలు ఇవేకేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిద్ధమైంది. ఇప్పటికే ఆ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్సెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. -
రద్దైన యూజీసీ-నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది. పీహెచ్‌డీల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే యూజీసీ– నెట్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 దాకా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని శుక్రవారం రాత్రి తెలిపింది. తొలుత జూన్ 18న యూజీసీ-నెట్‌ను నిర్వహించారు. అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మరుసటి రోజు ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే వాయిదా పడ్డ సీఎస్ఐఆర్-యూజీసీ-నెట్‌ను జూలై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. వాయిదా పడ్డ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎన్సీఈటీ)ని జూలై 10న నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. -
లోతైన దర్యాప్తు అవసరం
తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్ మొదలుకొని నీట్, యూజీసీ నెట్ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. ఎన్టీఏ చీఫ్ సుబోద్ కుమార్ సింగ్ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్‌ను అనుమతించింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. ఆ తర్వాత 2017లో ఎన్టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్‌లు, ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్‌తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్ రాజన్ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్‌కు ముందు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్ మొదలైనాక ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. నీట్ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్‌వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్‌కు ముందు హెచ్ఎస్సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. అందుకే ఎన్టీఏ చీఫ్‌ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. -
ఏడేళ్లు.. 70 లీకేజీలు
నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతం నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. రోజుకోటి చొప్పున సంచలనాత్మక విషయాలు బయట పడుతూ దేశమంతటినీ కుదిపేస్తున్నాయి. మరోవైపు యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం లీకైనట్టు తేలడంతో ఆ పరీక్షే రద్దయింది. వీటి దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రవేశ, పోటీ పరీక్షల సమగ్రత, విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్న దుస్థితి! నిజానికి ప్రశ్నపత్రాల లీకేజీ మన దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న జాఢ్యమే. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడం సమస్య తీవ్రతకు, భారత్‌లో పరీక్షలపై పేపర్ లీకేజీ మాఫియాకు ఉన్న తిరుగులేని పట్టుకు అద్దం పడుతోంది. ఇవన్నీ అధికారికంగా వెలుగులోకి వచి్చనవి, దర్యాప్తు జరిగిన, జరుగుతున్న కేసులు మాత్రమే. అసలు వెలుగులోకే రాకుండా పకడ్బందీగా జరిగిపోయిన ప్రవేశ, పోటీ పరీక్షల లీకేజీ ఉదంతాలు ఇంకా ఎన్నో రెట్లుంటాయని విద్యా రంగ నిపుణులే అంటున్నారు! వాటి ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వోద్యోగాలు కొట్టేసిన అనర్హులు వేలు, లక్షల్లో ఉంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–యూజీ పేపర్ లీక్ కావడంతో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. ఇలా గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్లు లీకయ్యాయి. వాటికి 1.7 కోట్ల మందికి పైగా ఉన్నత విద్యార్థులు, ఉద్యోగార్థుల కలలు కల్లలైపోయాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పలు పెద్ద రాష్ట్రాలతో పాటు హరియాణా వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా తరచూ పలు ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ భూతం ఉన్నత విద్యకు, భారీ స్థాయి నియామక పరీక్షలకే పరిమితం కాలేదు. పదో తరగతి వంటి స్కూలు పరీక్షలకు కూడా పాకి కలవరపెడుతోంది. బిహార్‌లో పదో తరగతి ప్రశ్నపత్రాలు గత ఏడేళ్లలో ఆరుసార్లు లీకయ్యాయి. పశి్చమబెంగాల్లోనైతే స్టేట్ బోర్డు పరీక్ష పత్రాలు గత ఏడేళ్లలో ఏకంగా పదిసార్లు లీకయ్యాయి. తమిళనాడులో 2022లో 10, 12 తరగతుల ప్రశ్నపత్రాలు లీకై కలకలం రేపాయి. ఆ రాష్ట్రాల్లో అంతే...! రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కొన్నేళ్లుగా పరీక్షల లీకేజీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2015–23 మధ్య రాజస్తాన్‌లో పలు పోటీ పరీక్షలకు సంబంధించి 14కు పైగా పేపర్లు లీకేజీ బారిన పడ్డాయి. 2022 డిసెంబర్లో సీనియర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల నియామకానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రం లీకవడంతో ఆ పరీక్షనే రద్దు చేయాల్సి వచి్చంది. యూజీసీ నెట్, పోలీస్ రిక్రూట్మెంట్ గత రెండేళ్లు వరుసగా లీకయ్యాయి. గుజరాత్‌లోనూ గత ఏడేళ్లలో 14 లీకేజీ ఉదంతాలు నమోదయ్యాయి. సీపీఎస్సెస్సీ చీఫ్ ఆఫీసర్ పరీక్ష (2014), తలతీ పరీక్షలు (2015, 2016), టీచర్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ (2018), ముఖ్య సేవిక, నాయబ్ చిట్నిస్, డెక్ లోక్ రక్షక్ దళ్, నాన్ సచివాలయ క్లర్క్స్, హెడ్ క్లర్క్, సీఎస్‌ఎస్సెస్బీ (2021), సబ్ ఆడిటర్ (2021), ఫారెస్ట్ గార్డ్ (2022), జూనియర్ క్లర్క్ (2023), వంటి పలు పరీక్షలు ఈ జాబితాలో ఉన్నాయి. యూపీలో కూడా 2017–24 మధ్య కనీసం 9 లీకేజీ కేసులు వెలుగు చూశాయి. ఇన్స్పెక్టర్ ఆన్లైన్ రిక్రూట్‌మెంట్‌పరీక్ష (2017), యూపీ టెట్ (2021), 12వ తరగతి బోర్డు పరీక్ష వంటివి వీటిలో ముఖ్యమైవి. తాజాగా ఈ ఏడాది జరిగిన కానిస్టేబుల్ పేపర్ లీకేజీ ఏకంగా 48 లక్షల మంది దరఖాస్తుదారులను ఉసూరు మనిపించింది.అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం నోటిఫై చేసిన కేంద్రం న్యూఢిల్లీ: పేపర్ లీకేజీల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అనైతిక కార్యకలాపాల నిరోధ) చట్టం, 2024ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్, యూజీసీ–నెట్ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంటు ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ల జైలు, రూ.కోటి దాకా జరిమానా విధించవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. -
Rahul Gandhi: యుద్ధాలను ఆపే మోదీ పేపర్ లీకేజీలు ఆపలేరా?
న్యూఢిల్లీ: నీట్–యూజీ, యూజీసీ–నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా? అని ప్రశ్నించారు. లీకేజీలను ఆపాలని మోదీ కోరుకోవడం లేదని ఆక్షేపించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలను అధికార బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చెరబట్టాయని, అందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారనంత వరకు పేపల్ లీక్‌లు అగవని తేలి్చచెప్పారు. రాహుల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షలాది మంది నీట్ అభ్యర్థుల ఆందోళనలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో స్పీకర్‌ను ఎన్నుకోవడంపైనే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలిపోయారని, ఇకపై ఆయన ప్రభుత్వాన్ని నడిపించేందుకు మరింత ఇబ్బంది పడుతారని చెప్పారు. పార్లమెంట్లో లేవనెత్తుతాం.. ‘‘నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. గతంలో ఆయన ఛాతీ 56 అంగుళాలు ఉండేది. ఇప్పుడది 32 అంగుళాలకు కుదించుకుపోయింది. భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం మోదీకి అలవాటు. ఇప్పుడు ప్రజల్లో మోదీ అంటే భయం పోయింది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం’’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నీట్‌పై ఆందోళన అవసరం లేదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్ష విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎక్కడో జరిగిన చిన్నాచితక సంఘటనలు ఈ పరీక్ష సక్రమంగా రాసిన లక్షలాది మంది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని, అందుకే పరీక్ష రద్దు చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. -
యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ నెట్! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్! ఇందులో ప్రతిభ చూపి..మెరిట్ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్ జూన్–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ... పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్–2021 సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు సెషన్లకు సంయుక్తంగా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్–2020 సెషన్, జూన్–2021 సెషన్లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్–2020 సెషన్ వాయిదా పడింది. అలాగే జూన్–2021 సెషన్ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్–2020 సెషన్ అభ్యర్థులు కూడా జూన్–2021 సెషన్‌కు హాజరు కావొచ్చు. 81 సబ్జెక్ట్‌లలో పరీక్ష యూజీసీ నెట్ మొత్తం 81 సబ్జెక్ట్ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. అర్హతలు ► అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ► పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్సీఎల్, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ యూజీసీ–నెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ► యూజీసీ–నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ► మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ► పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ► పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ► పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ► పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కనీస అర్హత మార్కులు ► యూజీసీ నెట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి. ► కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌పై గట్టి పట్టుండాలి. పేపర్1: ఆసక్తి, అవగాహన ► పేపర్–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2: సబ్జెక్ట్ ప్రశ్నలు పేపర్–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. యూజీసీ నెట్ 2021–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 5,2021 ► ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2021 ► ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 12 ► పరీక్ష తేదీలు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ► ప్రతి రోజు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష (మొదటి షిప్ట్ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
యూజీసీ నెట్, జూన్ 2021: ముఖ్య సమాచారం
దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్‌షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్ ఎలిజి బిలిటీ టెస్ట్(నెట్)–జూన్ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ► అర్హత: హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో అడుగుతారు.పేపర్ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ముఖ్య సమాచారం: ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 ► పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 ► పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్ 06 నుంచి 11 వరకు జరుగుతాయి ► వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం యుజిసి నెట్ 2021 మేలో పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షకు సంబందించిన తేదీలను యూజీసీ నెట్ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. యూజీసీ నెట్ 2021 పరీక్షా తేదీలు వరుసగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్) జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. జూన్ నెలలో తొలి పరీక్ష, డిసెంబర్ నెలలో రెండో తుది పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అలాగే పేపర్-II 200 మార్కులకు ఉంటుంది. దీనిలో 100 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పరీక్ష యొక్క వ్యవధి మూడు గంటలు ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభం కానున్న యూజీసీ నెట్ మే 2021 పరీక్ష దరఖాస్తుల తుది గడువు మార్చి 3న ముగియనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అవకాశం లభిస్తుంది. గతేడాది కరోనా కారణంగా ఒక్కసారే పరీక్ష నిర్వహించారు. మిగతా వివరాల కోసం యూజీసీ నెట్ లింకు క్లిక్ చేయండి. -
యూజీసీ నెట్ 2020 ఫలితాల విడుదల
జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూజీసీ నెట్ 2020కి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ ) విడుదల చేసింది.అభ్యర్ధులు ఫలితాలను http://ugcnet.nta.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. యూజీసీ నెట్ 2020 పరీక్షలను సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 13 తేదీల మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. ఈ సంవత్సరం జనరల్ కాటగిరీ 47,161 ఓబీసీ 1,92,434, ఎస్సీ 88,914 ఎస్టీ 33,811, పీడబ్ల్యూడీ 7505 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 1,56,882 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం 1. మొదట యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.in లింక్ మీద క్లిక్ చేయండి. 2. హోమ్ పేజ్‌లో UGC NET June 2020 Result లింక్ మీద క్లిక్ చేయండి 3. లాగ్ఇన్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి 4. యూజీసీ పరీక్ష ఫలితాలు స్రీన్ మీద కనిపిస్తాయి. 5. ఈ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలి డైరక్ట్ లింక్ కోసం: https://ntaresults.nic.in/resultservices/UGCNet-auth-June-2020 -
దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదా వేయండి
న్యూఢిల్లీ: యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, ఇగ్నో పీహెచ్డీ, ఎన్సీహెచ్ఎం జేఈఈ, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ తదితర పరీక్షలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదావేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును మరో నెల రోజులపాటు వాయిదా వేయాలని పేర్కొంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం ట్వీట్ చేశారు. (కరోనాకు 35,349 మంది బలి) చదవండి: కరోనాను మించిన భయం -
యూజీసీ–నెట్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: జూలై 8న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం విడుదలచేసింది. పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 11,48,235 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా అందులో 8,59,498 మంది పరీక్ష రాశారు. వీరిలో 55,872 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 3,929 మంది అర్హత సాధించారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చారు. 84 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. మూడు పేపర్ల విధానాన్ని వదిలేసి రెండు పేపర్లకు పరీక్ష చేపట్టారు. -
ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ పరీక్ష
-
నీట్, జేఈఈలపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కీలక పరీక్షలుగా పేరొందిన నీట్, జేఈఈ, యూజీసీ నెట్, సీమ్యాట్‌లను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ప్రకటించారు. విద్యారంగంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా పలు సంస్కరణలు తీసుకొస్తామని గతంలోనే కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇకపై ఈ పరీక్షలన్నింటిని సీబీఎస్ఈ స్థానంలో ఎన్టీఏ నిర్వహిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్, జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు రెండు సార్లు నీట్ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఏడాదిలో ఒక ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు వెంటనే మరో ప్రయత్నం చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం కలుగుతుంది. -
మార్పుల దిశగా..యూజీసీ నెట్!
అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుందా! జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్తో పరిశోధనల వైపు అడుగులు వేయాలనుందా! ఈ రెండిటిలో మీ మార్గం ఏదైనా యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి నెట్ సిలబస్ సమూలంగా మారనుంది. నెట్ పరిధిలోని అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను మార్చి.. నూతన సిలబస్‌ను తీసుకొచ్చే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నెట్లో జరగనున్న మార్పులపై విశ్లేషణ.. యూజీసీ వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్‌తో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ దిశగా నూతన సిలబస్ రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సబ్జెక్టు నిపుణుల పేర్లను సిఫారసు చేయాలని యూనివర్సిటీలను కోరింది. ఇప్పటికే దేశంలోని చాలా యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు.. సిలబస్, కరిక్యులంలో మార్పులు చేశాయి. ప్రస్తుతం తాజా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాదాపు అన్ని కోర్సుల సిలబస్‌లోనూ కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. దీంతో యూజీసీ సైతం నెట్ సిలబస్‌ను తాజా అకడమిక్ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించి, మార్పులకు శ్రీకారం చుట్టింది. 25 కమిటీల ఏర్పాటు ప్రస్తుతం నెట్‌ను 100 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుండగా... ఇప్పటికే 25 సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులను సూచించేందుకు ఆయా సబ్జెక్టుల నిపుణులతో 25 కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి ప్రస్తుతం అకడమిక్‌గా అమలవుతున్న సిలబస్‌ను అధ్యయనం చేసి.. చేయాల్సిన మార్పులను సిఫారసు చేస్తాయి. మిగిలిన సబ్జెక్టుల సిలబస్ రివ్యూ కమిటీల ఏర్పాటును మరో నెల లోపు పూర్తిచేయనున్నట్లు సమాచారం. వృత్తి విద్యలో భారీ మార్పులు! వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ పేపర్ల సిలబస్‌లో ఎక్కువ మార్పులు జరిగే అవకాశముంది. ఏడాదికి ఒకసారే! నెట్ నిర్వహణలోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యూజీసీ ప్రస్తుతం ఏటా రెండుసార్లు నెట్ నిర్వహిస్తోంది. అయితే, ఇక నుంచి ఏడాదికి ఒకసారే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సెషన్‌కు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మాత్రం లక్ష నుంచి లక్షా పదివేల మధ్యే ఉంటోంది. దీంతో రెండుసార్లు నిర్వహించడం అనవసరమనే అభిప్రాయానికి యూజీసీ వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా ఈ విధానం 2019 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఎన్టీఏ ద్వారా నిర్వహణ ప్రస్తుతం నెట్ నిర్వహణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చేపడుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ బాధ్యతను నూతనంగా ఏర్పాటుచేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో సింగిల్ టెస్టింగ్ విండో తరహాలో తెరపైకొచ్చిన ఎన్టీఏ.. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది. తొలి ఆరుశాతంతోనే మెరిట్ ఇప్పటికే యూజీసీ రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో (అన్ని వర్గాల నుంచి) మొదటి ఆరు శాతానికి సమానమైన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఉదాహరణకు లక్ష మంది పరీక్షకు హాజరైతే వారిలో తొలి ఆరు శాతం (అంటే ఆరువేల మంది) మందిని నెట్ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. వీరికే అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. ఇలా తొలి ఆరు శాతంలో నిలిచిన అభ్యర్థులనే ఉత్తీర్ణులుగా ప్రకటించాలనే నిర్ణయాన్ని విద్యావేత్తలు సైతం హర్షిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని యాజీసీ 2017, నవంబర్ సెషన్ నుంచి అమల్లోకి తెచ్చింది. తొలి ఆరు శాతంతో రూపొందిన మెరిట్ జాబితాలోని వారికి రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయనుంది. ఇప్పటì వరకు సబ్జెక్టు వారీగా, అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా టాప్–15 శాతంలో నిలిచిన వారితో జాబితా రూపొందించి, వారిని అర్హులుగా ప్రకటిస్తూ వచ్చింది. జేఆర్ఎఫ్ ప్రక్రియ యథాతథం నెట్ అర్హతతో మొదటగా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అర్హత లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియలో మార్పులు చేస్తున్నప్పటికీ.. తర్వాత దశలో ఎంపిక చేసే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హుల ఎంపిక విధానం మాత్రం ప్రస్తుత తరహాలోనే కొనసాగుతుంది. ముఖ్య సమాచారం ♦ మొత్తం అన్ని పేపర్లలోనూ సిలబస్ మార్పులకు శ్రీకారం. ♦ ఇప్పటికే 25 సబ్జెక్టు కమిటీల ఏర్పాటు. ♦ వృత్తి విద్యా సబ్జెక్టుల్లో అధికంగా మార్పులు జరిగే అవకాశం. ♦ 2018 నుంచి ఏటా ఒక సారే నెట్ నిర్వహించే అవకాశం. యూజీసీ నెట్ పరీక్ష విధానం యూజీసీ నెట్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తారు. వివరాలు.. పేపర్–1 అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకూ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్–2, 3లు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల ఆధారంగా ఉంటాయి. వీటిలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్) అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే షార్ట్‌లిస్ట్ జాబితా రూపకల్పన ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. ఆహ్వానించదగ్గ పరిణామం యూజీసీ నెట్ సిలబస్‌లో మార్పులు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల తాజా పరిస్థితులకు అనుగుణంగా బోధన, పరిశోధనా నైపుణ్యాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. ఇటీవల అభ్యర్థులు సైతం అకడమిక్‌గా కొత్త అంశాలను నేర్చుకుంటున్నారు. వాటిలో తమకున్న సామర్థ్యాన్ని బహిర్గతం చేసే అవకాశం కలుగుతుంది. – డాక్టర్ డి.ఎన్.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు, డైరెక్టర్ డాక్టర్ సీఆర్‌రావు ఏఐఎంఎస్సీఎస్. -
29న యూజీసీ నెట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఈ నెల 29న జరగనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. హాల్‌టికెట్లనుwww.apset.org,www.osmania.ac.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలను 040-27097733 నంబర్‌కు ఫోన్‌చేసి లేదా apset2012@ gmail. com మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు.