న్యూఢిల్లీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం యుజిసి నెట్ 2021 మేలో పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షకు సంబందించిన తేదీలను యూజీసీ నెట్ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. యూజీసీ నెట్ 2021 పరీక్షా తేదీలు వరుసగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్)
జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. జూన్ నెలలో తొలి పరీక్ష, డిసెంబర్ నెలలో రెండో తుది పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అలాగే పేపర్-II 200 మార్కులకు ఉంటుంది. దీనిలో 100 మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పరీక్ష యొక్క వ్యవధి మూడు గంటలు ఉంటుంది.
ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభం కానున్న యూజీసీ నెట్ మే 2021 పరీక్ష దరఖాస్తుల తుది గడువు మార్చి 3న ముగియనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అవకాశం లభిస్తుంది. గతేడాది కరోనా కారణంగా ఒక్కసారే పరీక్ష నిర్వహించారు. మిగతా వివరాల కోసం యూజీసీ నెట్ లింకు క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment