ఆన్‌లైన్‌లో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌? | Cbi Likely To File Charge Sheet Against Youth Who Circulated Doctored Screenshot Of Ugc Net Paper | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌?

Published Thu, Jul 11 2024 11:45 AM | Last Updated on Thu, Jul 11 2024 12:43 PM

Cbi Likely To File Charge Sheet Against Youth Who Circulated Doctored Screenshot Of Ugc Net Paper

సాక్షి,న్యూఢిల్లీ : యూజీసీ-నెట్‌ పేపర్‌ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ విద్యార్ధి యూజీసీ- నెట్‌ నకిలీ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రాంలో షేర్‌ చేసినట్లు సీబీఐ గుర్తించింది. సదరు విద్యార్ధిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.  

జూన్‌ 18న నిర్వహణ.. ఆ వెంటనే పరీక్ష రద్దు 
కేంద్ర విద్యా శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ-నెట్‌ పరీక్షను నిర్వహిస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే కేంద్రం ఆ పరీక్షను జూన్‌ 18న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. అనూహ్యాంగా యూజీసీ నెట్‌ ప్రశ్నాపత్రాలు డార్క్‌ వెబ్‌లో లీక్‌ అయ్యాయని, టెలిగ్రామ్‌ యాప్‌లో షేర్‌ అయ్యిందని కేంద్రానికి సమాచారం అందింది.

వెంటనే ఆ మరుసటి రోజే (జూన్‌19) పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. సత్వరమే విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీచేశారు.  

స్కూల్‌ విద్యార్థిపై CBI ఛార్జ్​షీట్​!
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పేపర్‌ లీకేజీ జరిగిందా? జరిగితే అందుకు కారకులు ఎవరనేది ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ తన దర్యాప్తులో జూన్ 18న జరిగిన పరీక్షకు సంబంధించి లీకైన ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్‌ను ఓ పాఠశాల విద్యార్థి టెలిగ్రామ్‌లో షేర్‌ చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. ఈ అంశంపై సదరు పాఠశాల విద్యార్ధిపై సీబీఐ  ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుందని సమాచారం.  

యూజీసీ పరీక్ష కొత్త తేదీలు ఇవే
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్‌ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిద్ధమైంది. ఇప్పటికే ఆ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్‌ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్‌సెట్‌ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement