రద్దైన యూజీసీ-నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల | NTA announces UGC NET Exam Reschedule | Sakshi
Sakshi News home page

రద్దైన యూజీసీ-నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల

Published Sat, Jun 29 2024 8:39 AM | Last Updated on Sat, Jun 29 2024 11:04 AM

NTA announces UGC NET Exam Reschedule

న్యూఢిల్లీ: అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది. పీహెచ్‌డీల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే యూజీసీ– నెట్‌కు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. 

ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 దాకా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని శుక్రవారం రాత్రి తెలిపింది. తొలుత జూన్‌ 18న యూజీసీ-నెట్‌ను నిర్వహించారు. అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మరుసటి రోజు ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

అలాగే వాయిదా పడ్డ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ-నెట్‌ను జూలై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. వాయిదా పడ్డ నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎన్‌సీఈటీ)ని జూలై 10న నిర్వహిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement