రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: నీట్–యూజీ, యూజీసీ–నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా? అని ప్రశ్నించారు. లీకేజీలను ఆపాలని మోదీ కోరుకోవడం లేదని ఆక్షేపించారు.
దేశంలో ఉన్నత విద్యా సంస్థలను అధికార బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ చెరబట్టాయని, అందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారనంత వరకు పేపల్ లీక్‌లు అగవని తేలి్చచెప్పారు. రాహుల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
లక్షలాది మంది నీట్ అభ్యర్థుల ఆందోళనలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు పార్లమెంట్‌లో స్పీకర్‌ను ఎన్నుకోవడంపైనే ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలిపోయారని, ఇకపై ఆయన ప్రభుత్వాన్ని నడిపించేందుకు మరింత ఇబ్బంది పడుతారని చెప్పారు.
పార్లమెంట్‌లో లేవనెత్తుతాం..
‘‘నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. గతంలో ఆయన ఛాతీ 56 అంగుళాలు ఉండేది. ఇప్పుడది 32 అంగుళాలకు కుదించుకుపోయింది. భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం మోదీకి అలవాటు. ఇప్పుడు ప్రజల్లో మోదీ అంటే భయం పోయింది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం’’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నీట్‌పై ఆందోళన అవసరం లేదు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్ష విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎక్కడో జరిగిన చిన్నాచితక సంఘటనలు ఈ పరీక్ష సక్రమంగా రాసిన లక్షలాది మంది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పారు. యూజీసీ–నెట్ ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయ్యిందని, అందుకే పరీక్ష రద్దు చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment