సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారిలో కొందరు ఇప్పటికే వివరణ ఇవ్వగా, ఇంకొందరు స్పందించలేదు. దీంతో వారిపై వేటు వేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తెప్పించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా వారిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీవ్ర సంచలనంగా మారింది. అనుభవం ఉండి, సీనియర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏడాదికిపైగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకక తప్పట్లేదని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment