DME
-
పీజీ మెడికల్ సీట్లపై కత్తి!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జన రల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ సమీక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్ఎంసీ సమీక్షిస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 481 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 178 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీలో 213 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.సీట్లు కోల్పోయే అవకాశం లేదు పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్ వాణి, డీఎంఈ -
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్‌లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
కోఠిలోని డీఎంఈ కార్యలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
-
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.ఎస్.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్లను రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్ త్రివేణి మెమో జారీ చేశారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్ పోస్టింగ్‌లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. ‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. సొమ్ములు చేతులు మారేందుకేనా అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్‌నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ ఉంటుంది. అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ 18 మంది డీఎంహెచ్‌వోల మాటేమిటి కాగా, డిప్యుటేషన్‌పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి. ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. -
అదనపు డీఎంఈల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈ గా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితిని 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదనపు డీఎంఈ పదోన్నతి ప్రక్రియను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డీఎంఈ (వైద్య విద్య డైరెక్టర్), అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల వయోపరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే గవర్నర్ తిరస్కరించినా దీన్ని ఎలా అమలు చేస్తారన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ స్పష్టత ఇవ్వలేదు. బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపే ప్రక్రియను ప్రారంభిస్తారా? లేక ఏం చేస్తారన్న దానిపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నిర్ణయంతో డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల్లో ఉన్న వారి వయో పరిమితి పెరుగుతుంది. డీఎంఈ రమేష్‌రెడ్డి కొనసాగింపునకు ఎలాంటి అవరోధం ఉండదని చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పదోన్నతి బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డీఎంఈ రమేష్ రెడ్డిని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తిచేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. వైద్య విధాన పరిషత్‌లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అందులోనే 371 నర్సు పదోన్నతుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని వెల్లడించారు. అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్‌కు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులకు హరీశ్‌రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై వారం రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం సరికాదని జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. కాగా, డెంగీ వ్యాధి చికిత్సలో ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ మిషన్లను రూ.10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటివల్ల సకాలంలో రోగ నిర్ధారణ జరిగి సత్వరం చికిత్స అందించడానికి వీలవుతుంది. కాగా, కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, 204 అత్యవసర 108 వాహనాలు, భౌతికకాయాలను తీసుకెళ్లే 34 వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. -
ఆ పోస్టులకు ఏజ్ భారమైంది!
వైద్య విద్య విభాగంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించిన వయో పరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించడమే ఇందుకు కారణం. దీనివల్ల డీఎంఈ సహా ఆయా పోస్టుల వయో పరిమితి 61 ఏళ్లకే పరిమితం కానుండగా.. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లుగా కొనసాగనుంది. ఇలా ఒకే విభాగంలో రెండు రకాల వయో పరిమితి కొనసాగనుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగానే.. వారిలో కొందరిని డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈ పోస్టింగులు పొందిన తర్వాత వయో పరిమితి తగ్గిపోనుండటం సంక్షోభానికి దారితీస్తోంది. డీఎంఈల వయో పరిమితి పెంచకపోవడంతో.. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ)గా డాక్టర్ రమేష్‌రెడ్డి ఉన్నారు. డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అదనపు డీఎంఈలుగా పని చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. అయితే నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వం ప్రొఫెసర్ల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచింది. కానీ అప్పట్లో డీఎంఈ తదితర పోస్టుల వయో పరిమితి పెంపు మాత్రం జరగలేదు. ఆ పోస్టులకు ముందుకొచ్చేదెవరు? గవర్నర్ తాజా నిర్ణయంతో ఆయా పోస్టుల్లో పనిచేసే 61 ఏళ్లు పైబడినవారు అనర్హులవుతారు. ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి సహా ఎనిమిది మంది ఇప్పటికిప్పుడు రిటైర్ కావలసి వస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది కూడా పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. గవర్నర్ నిర్ణయం ఇకముందు కూడా అమలైతే ప్రస్తుతం పనిచేసే ప్రొఫెసర్లలో ఎంతమంది.. అడిషనల్ డీఎంఈలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పని చేసేందుకు ముందుకు వస్తారు?, ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు కొనసాగే అవకాశాన్ని వదులుకుని 61 ఏళ్ల వయో పరిమితి ఉన్న పోస్టులకు ఎందుకు వెళతారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ అక్కడ 61 ఏళ్ల వరకు ఉండి, తిరిగి ప్రొఫెసర్‌గా కాలేజీల్లో 65 ఏళ్ల వరకు కొనసా గే అవకాశం ఉన్నా బాగుండేదని, కానీ ఆ చాన్స్ లేదని అంటున్నారు. పైగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తక్షణ కర్తవ్యం ఏమిటి? వయో పరిమితి పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించడంతో, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని అమలు చేయడమా? లేక బిల్లును మరోసారి అసెంబ్లీలో పాస్ చేసి తిరిగి పంపడమా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఏదో ఒకటి తేలేవరకు...ఆయా పోస్టుల్లో 61 ఏళ్లు దాటిన వారు దిగిపోవాలా? లేదా కొనసాగాలా? అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒకవేళ వారిని తొలగిస్తే ఆయా పోస్టుల్లో ఉన్నవారు కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రొఫెసర్ పోస్టుకు 65 ఏళ్లుండగా, ప్రొఫెసర్ పోస్టులు వదులుకుని వచ్చే అడిషనల్ డీఎంఈలు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల వయో పరిమితిని 61 ఏళ్లకే పరిమితం చేయడం ఏమేరకు కరెక్ట్ అనే వాదనతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి మొత్తం 52 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 18 మంది ప్రిన్సిపాళ్లుగా, సూపరింటెండెంట్లుగా ఉన్నారు. కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చినా చేరలేదు. దీంతో అక్కడ సీనియర్లను ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. చదవండి: నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'! -
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
హెచ్3ఎన్2పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ♦ ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్ ప్రభావం ఉంటుంది. ♦ కరోనా వైరస్లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. ♦ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. ♦ ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం. ♦ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం ♦ తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ♦దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. టవైరల్ జ్వరాలకు యాంటిబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు. ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారిలో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మెడిసిన్ వైద్యుడు డా. సుధాకర్ చెప్పారు. ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది సీజన్ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయన్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్ చెప్పారు. -
అవయవ మార్పిడిని ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడిని ప్రోత్సహించాలని, బోధనాసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని బోధనాసుపత్రుల పనితీరుపై ఆదివారం ఆయన నెలవారీ సమీక్ష చేశారు. గర్భిణులకు టిఫాతో పాటు అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్లు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు. బోధనాసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని, అనవసరంగా రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ను పంపించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎయిర్ చెకింగ్‌తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చి పంపాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో మూడు నెలల బఫర్ నిల్వలు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు పాడైతే.. వెంటనే వాటిని గంటల్లోనే మరమ్మతులు చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామని వివరించారు. ప్రతి ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రి వేళ పోస్ట్‌మార్టం చేయాలని, హర్ సే వెహికిల్ అందుబాటులో ఉంచి, ఉచితంగా గమ్యానికి చేర్చాలన్నారు. బోధనాసుపత్రులకు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపామని తెలిపారు. ప్రతి ఆసుపత్రికి 25 నుండి 30 మందిని కేటాయించామని వివరించారు. ఇటీవల కాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, మరింత కచ్చి తత్వంతో సులువుగా చికిత్స అందించేందుకు అధునాతన చికిత్స విధానాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్(ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెలలోనే ఎస్‌ఆర్‌ల నియామకానికి డీఎంఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్లో కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ చదివిన వారికి అవకాశం కల్పించారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారికీ అవకాశం కల్పిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. 45 ఏళ్ల లోపు వయసుండి, ఏపీ స్థానికత కలిగి ఉండి పీజీ/డెంటల్ డిగ్రీ చదివి ఏపీ మెడికల్/డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రార్ వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జ్టి్టp://ఛీఝ్ఛ.్చp.nజీఛి.జీn ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాల్టీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన(థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. -
అఖిల మృతిపై డీఎంఈ విచారణ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి విచారణ నిర్వహించారు. మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేం«ద్రంలో ఉన్న వార్డులను డీఎంఈ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తమను కించపరిచేవిధంగా దుర్భాషలాడుతున్నారని పలువురు ఆయనకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి వర్గాల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ అఖిల మృతిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని తెలిపా రు. కాన్పుల సందర్భంగా సిబ్బంది తీరుపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. మరోవైపు మృతు రాలి అత్త, మామ, భర్త, కుటుంబసభ్యులు శిశువుతోపా టు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని డీఎంఈ కనీసం పలకరించకపోవడం గమనార్హం. ధర్నా లో కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పాల్గొన్నారు. న్యాయంచేయాలని అఖిల మామ పోలీసు ల కాళ్లపైపడి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. -
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ డీ ఎడిక్షన్ (మద్యానికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించేలా చికిత్స ఇచ్చే) కేంద్రాల ఏర్పాటుపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లు నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ డీ ఎడిక్షన్, లిక్కర్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవోలో ఉన్నా.. ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ హైకోర్టులో 2016లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. డీ ఎడిక్షన్ కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చిందన్నారు. పిటిషన్ దాఖలు చేసి ఆరేళ్లవుతున్నా ప్రతివాదులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. -
చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సంఘంతో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు డిమాండ్లపై చర్చించినా డైరెక్టర్ నుం చి స్పష్టమైన హామీ రాలేదని, దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడిం చింది. పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. స్టైఫండ్ పెంపుతోపాటు ప్రోత్సాహకాలు, కోవిడ్ విధుల్లో మరణిస్తే ఇచ్చే పరిహారం, కరోనాతో బాధపడుతున్న కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఉచిత చికి త్స వంటి అంశాలపై జూడాలు సమ్మెకు దిగారు. తొలిరోజు సమ్మెలో భాగంగా బుధవారం అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కాగా, మిగతా విధులను బహిష్కరించారు. ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ... ప్రస్తుత సమయంలో సమ్మె సరికాదని, జూడాల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుపుతూ చర్చలు జరపాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సైతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని ట్విట్టర్ ద్వారా విన్నవించారు. ఈ క్రమంలో బుధవారం సాయం త్రం వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంపు పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పినా లిఖితపూర్వక హామీ రాలేదు. డైరెక్టర్ రమేశ్‌రెడ్డి జూడాల హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం బయటకు వచ్చిన జూడాల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తా మని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. అయితే సీఎం, మంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాకపోవడంతో సమ్మె ను కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. సమ్మె సరికాదు.. ‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. చీటికీ మాటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, కరోనా పరిస్థితులను కూడా చూడకుండా విధులను బహిష్కరించడం సరికాదు’. – సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నాం... లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాం. మా హామీలు అమలు చేయడం కుదరదని రమేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాలేదు. –జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశాలు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని15 శాతం పెంచాలి. మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి ‘కోవిడ్’వైద్య సేవల్లో కొనసాగుతున్న విద్యార్థులకు సైతం సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలి. కోవిడ్ విధుల్లో మరణించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకుఎక్స్‌గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో, జూడాల కోరిక మేరకు సత్వరమే చెల్లించాలి. జూడాలకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి. స్తంభించిన వైద్య సేవలు జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. సకాలంలో సేవలు అందక సాధారణ రోగులు ఇబ్బందిపడ్డారు. క్లిష్టమైన ఈ సమయంలో మందులు, ఆక్సిజన్ మానిటరింగ్ చేసే వైద్యులు లేక కోవిడ్ బాధితులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రోగుల బంధువులు మద్దతు పలికారు. ఇది సమయం కాదు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. –మంత్రి కేటీఆర్ చదవండి: జూడాల సమస్యలను పరిష్కరించాలి సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారిలో కొందరు ఇప్పటికే వివరణ ఇవ్వగా, ఇంకొందరు స్పందించలేదు. దీంతో వారిపై వేటు వేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తెప్పించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా వారిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీవ్ర సంచలనంగా మారింది. అనుభవం ఉండి, సీనియర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏడాదికిపైగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకక తప్పట్లేదని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో నిఫా వైరస్ లేదు
-
నేడు పునర్విభజన కమిటీ భేటీ
-
చర్చలకు పిలిచేంతవరకు సమ్మె కొనసాగింపు:జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్‌తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని డీఎంఈ చెప్పారు. జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే తాము ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు తాము వెళతామని వారు చెప్పారు. -
పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు
-
పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు
సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ డాక్టర్ల సమ్మె మొదలై బుధవారానికి 45 రోజులు నిండాయి. పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు మార్చి-ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు అర్హులు కారు. వారికి కావాల్సిన హాజరుశాతం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజి్రస్ట్రార్కు రాస్తాం. దీనివల్ల 2 వేల మంది పీజీ విద్యార్థులు, 1500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు’ అని వైద్య విద్యా డెరైక్టర్ డాక్టర్ పి.శ్రీనివాస్ వివరించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులకు 1950 తర్వాత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో ఆస్పత్రికి కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా వైద్య పరికరాల కొనుగోలు కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొంటూ ప్రజా సేవలను విస్మరించిన జూనియర్ డాక్టర్లు తమ ‘డిసర్టేషన్’ ( థీసిస్ సమర్పించడం) మాత్రం పూర్తి చేశారని, కానీ, వారు సమ్మెలో కొనసాగుతున్నందున గైర్హాజరుగానే పరిగణించి వాటిని తిరస్కరిస్తున్నామని, ఇదే విషయాన్ని విశ్వవిద్యాలయానికి తెలియజేస్తామన్నారు. వివిధ వైద్య కళాశాలల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది జూడాలను వారి మాతృ కళాశాలలకు పంపిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని 3 వేల మంది వారి తల్లిదండ్రులకు లేఖలు రాశామని, 20 మంది మాత్రమే వచ్చారన్నారు. ఇప్పటికైనా అధికారికంగా సమ్మె విరమిస్తున్నట్లు రాసి ఇస్తే, ఎవరికీ నష్టం జరగకుండా చూసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరతానని డీఎంఈ తెలిపారు. ప్రజాధనంతో వైద్య విద్య అభ్యసిస్తున్న వారు, అదే ప్రజానీకానికి ఏడాదిపాటు సర్వీసు చేయాల్సిందేనని, ఒక్కో విద్యార్థిపై రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా ప్రభుత్వం వెచ్చిస్తోందని వివరించారు. ఎంసీఐ తనిఖీలు జరిగాయని, దీనికి కూడా జూడాలు సహకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన, త్వరలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. క్లోరోఫాంను అనస్థీషియగా గుర్తించిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదని, దేశంలో తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఘనత కూడా ఉస్మానియాకు ఉందన్నారు. అలాగే, దేశ ంలో తొలి గుండె మార్పిడి చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి రికార్డు సృష్టించిందని డీఎంఈ వివరించారు. ఈ ఆస్పత్రులకు కేటాయించిన బడ్జెట్‌ను మార్చినాటికి పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టి, అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని డీఎంఈ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
'విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు'
హైదరాబాద్: రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్ల (జూడాలు) పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రేపటిలోగా విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవని జూడాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పి.శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 75 శాతం హాజరు లేకుంటే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పని చేసే జూడాలకు కాలపరిమితిని రెండేళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పని చేసే నిబంధన ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని పి.శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.