సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.
సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్‌లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.
తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment