
చర్చలకు పిలిచేంతవరకు సమ్మె కొనసాగింపు:జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపారు.
జూనియర్ డాక్టర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని డీఎంఈ చెప్పారు. జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే తాము ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు తాము వెళతామని వారు చెప్పారు.