లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు.