రాయలసీమ విశ్వవిద్యాలయం
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వ విద్యాలయంలో కీలక పదవులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. వర్సిటీలోని పరిస్థితులకు భయపడి పదవులు వదులుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్సిటీ హాస్టల్స్ ఛీఫ్ వార్డెన్, వార్డెన్, దూర విద్య విభాగం డైరెక్టర్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితర కీలక పోస్టులకు ప్రొఫెసర్లు కరువయ్యారు. పరీక్షల విభాగం డీన్‌గా ఒక ప్రొఫెసర్ ఉన్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక పదవులు ఖాళీగా ఉండడంతో వర్సిటీలో పాలన గాడి తప్పుతోంది.
ఆర్‌యూ హాస్టల్స్ వార్డెన్ ఎవరో..?
రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు మెన్స్, రెండు ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అందులో సుమారు 700 మంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమవుతుంది. వారికి రెండు హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అయితే హాస్టళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఛీఫ్ వార్డెన్‌గా ఎవరున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న ప్రొఫెసర్ వై.నరసింహులు సంవత్సరం కిత్రమే ఆ పదవికి రిజైన్ చేశారు. రిలీవ్ చేయాలని వందల సార్లు వీసీ, రిజిస్ట్రార్‌లకు మొరపెట్టుకున్నా చేయలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వర్సిటీలో ఆరŠట్ప్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖ విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని పనిభారం ఉందని విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు.
ఆయన స్థానంలో ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట శేషయ్యకు వార్డెన్‌గా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన మొదట అంగీకరించినప్పటికీ తరువాత నాకు ఏపదవి వద్దని చెప్పినట్లు సమాచారం. మెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఒక డిప్యూటీ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఇద్దరు డిప్యూటీ వార్డెన్‌లు హాస్టళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. అలాగే దూర విద్య విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు పదవి రాజీనామా చేశారు. అయితే ఉన్నతాధికారులు రిలీవ్ చేయలేదు. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు.
అంటీముట్టనట్లుగా పరీక్షల విభాగం డీన్
ఆర్‌యూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి విధులకు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నరని సమాచారం. పరీక్షల విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో బా«ధ్యతలు నిర్వర్తించడం లేదు. విభాగంలో అవకతవకల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment