Positions
-
AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. -
నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా వారికే పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మక స్థానాలు, కీలకమైన పదవుల్లో ఏపీ మహిళలది దేశంలోనే అగ్రస్థానం. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ ‘భారతదేశంలో వివిధ రంగాల్లో మహిళలు, పురుషులు–2022’ అనే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవే.. ♦ సాధారణ హోదా, సీనియర్ అధికారులు, మేనేజర్లు, శాసనసభ్యుల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంతో దేశ సగటుతో పాటు దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ♦సీనియర్ అధికారులు, మేనేజర్లు, ఎమ్మెల్యేల వంటి నిర్ణయాత్మక పదవుల్లో రాష్ట్ర మహిళల హవా కొనసాగుతోంది. ♦ శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల హోదాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 22.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది అత్యధికంగా 43.4 శాతం ఉంది. ♦ సీనియర్, మిడిల్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 18.1 శాతం ఉండగా ఏపీలో 30.3 శాతం ఉంది. మరే ఇతర పెద్ద రాష్ట్రాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఏపీలో ఉన్నంత స్థాయిలో లేదు. ♦ మొత్తం కార్మికుల్లో మేనేజర్ హోదాలో ఏపీలో 30.4 శాతం మహిళలే ఉండగా ఇదే దేశం మొత్తం చూస్తే కేవలం 18.0 శాతమే. ♦అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మంది మహిళలు (78,025 మంది) ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ♦అదే సాధారణ కార్మికులు, నిర్ణయాత్మక హోదాల్లోనూ, శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల స్థాయిలో మహిళల భాగస్వామ్యం బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది. ♦ సమాజంలో సగభాగమైన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ♦మంత్రిమండలితో పాటు స్థానిక సంస్థల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాలు చేసింది. ♦ అంతేకాక.. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలిస్తే వాటిని మహిళల పేరు మీదే పంపిణీ చేశారు. సాధారణ హోదాలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువమంది మహిళలున్నారని.. వీరంతా నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నట్లు నివేదిక వెల్లడించింది. -
పదవి సత్యం... పార్టీ మిథ్య!
అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ. చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్... గయా రామ్’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్ కామత్ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే! -
Telangana Congress: 3 నెలలు ఆగాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి మరో మూడు నెలలు సమయం పట్టనుందని తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కోశాధికారితోపాటు అధికార ప్రతినిధుల నియామకం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఈ పదవులతోపాటు మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించాలన్న టీపీసీసీ ప్రతిపాదనకు హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ నేతలకు ఈ పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై దృష్టి పెడతారని, ఈలోపు రాష్ట్రంలో నాలుగైదు చోట్ల ఇంద్రవెల్లి తరహా సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మరో ఇద్దరు కావాలి.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పుడే ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇందులో ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఒక రెడ్డి, ఒక ఎస్సీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించారు. బీసీల నుంచి రెండు ప్రధాన సామాజిక వర్గాలైన యాదవ్, రెడ్డిలకు అవకాశమివ్వగా, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గీతారెడ్డిని నియమించారు. అయితే, బీసీల్లో మరో ప్రధాన సామాజికవర్గానికి అవకాశమివ్వాలని, ఎస్సీల నుంచి మాదిగలను నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలకు అవకాశమిచ్చేలా మరో ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని టీపీసీసీ పార్టీ హైకమాండ్‌కు ప్రతిపాదన పంపినట్టు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఢిల్లీ నాయకత్వం బీసీల నుంచి కొండా సురేఖ (మున్నూరుకాపు), ఈరవత్రి అనిల్ (పద్మశాలీ), మాదిగ సామాజికవర్గం నుంచి ఎస్.సంపత్‌కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమతూకం.. సహకారం టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం సామాజిక సమతూకంతోపాటు తనకు పూర్తి సహకారాన్ని అందించగల నాయకులు ఎవరున్నారన్న దానిపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ నుంచి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పదవులు లభించే కోణంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో ఉన్న తరహాలో జంబో కార్యవర్గం కాకుండా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కలిపి 50 మంది దాటొద్దని, అధికార ప్రతి నిధుల సంఖ్య కూడా 20–25కు మించొద్దని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు కొన్ని జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని తన సన్నిహితుల వద్ద రేవంత్ చెప్పినట్టు తెలుస్తోంది. -
ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వ విద్యాలయంలో కీలక పదవులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. వర్సిటీలోని పరిస్థితులకు భయపడి పదవులు వదులుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్సిటీ హాస్టల్స్ ఛీఫ్ వార్డెన్, వార్డెన్, దూర విద్య విభాగం డైరెక్టర్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితర కీలక పోస్టులకు ప్రొఫెసర్లు కరువయ్యారు. పరీక్షల విభాగం డీన్‌గా ఒక ప్రొఫెసర్ ఉన్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక పదవులు ఖాళీగా ఉండడంతో వర్సిటీలో పాలన గాడి తప్పుతోంది. ఆర్యూ హాస్టల్స్ వార్డెన్ ఎవరో..? రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు మెన్స్, రెండు ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అందులో సుమారు 700 మంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమవుతుంది. వారికి రెండు హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అయితే హాస్టళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఛీఫ్ వార్డెన్‌గా ఎవరున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న ప్రొఫెసర్ వై.నరసింహులు సంవత్సరం కిత్రమే ఆ పదవికి రిజైన్ చేశారు. రిలీవ్ చేయాలని వందల సార్లు వీసీ, రిజిస్ట్రార్లకు మొరపెట్టుకున్నా చేయలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వర్సిటీలో ఆరŠట్ప్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖ విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని పనిభారం ఉందని విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. ఆయన స్థానంలో ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట శేషయ్యకు వార్డెన్‌గా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన మొదట అంగీకరించినప్పటికీ తరువాత నాకు ఏపదవి వద్దని చెప్పినట్లు సమాచారం. మెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఒక డిప్యూటీ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఇద్దరు డిప్యూటీ వార్డెన్లు హాస్టళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. అలాగే దూర విద్య విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు పదవి రాజీనామా చేశారు. అయితే ఉన్నతాధికారులు రిలీవ్ చేయలేదు. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. అంటీముట్టనట్లుగా పరీక్షల విభాగం డీన్ ఆర్యూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి విధులకు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నరని సమాచారం. పరీక్షల విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో బా«ధ్యతలు నిర్వర్తించడం లేదు. విభాగంలో అవకతవకల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విశ్వవిద్యాలయం -
పదవీ విరమణ.. పదవులు
విశ్లేషణ కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ఇక్కడే పరస్పర ప్రయోజనాల మధ్య వైరుధ్యం తలెత్తడానికి ప్రాతిపదిక ఉంది. పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బీజీ దేశ్‌ముఖ్ రిటైర్మెంట్ తర్వాత ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో చేరవచ్చా అని 1990లో నాటి ప్రధానిని అడిగారు. దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలందించిన ఆయన తనను అనుమతిస్తే పదవీ విరమణ తర్వాత కార్పొరేట్ రంగానికి వెళ్లాలని ఆకాంక్షించారు. నోటిమాటతో ఆమోదించడం నుంచి రాతపూర్వకంగా నిరాకరించడం వరకు ఆయన అభ్యర్థనకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉదాసీనత దెబ్బ తీసింది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రాజీనామా లేదా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కార్పొరేట్ ఉద్యోగాలపై చేరడానికి సంబంధించిన ఉదాసీనతను తొలగించి, ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని–కాన్‌ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంటరెస్ట్–క్రోడీకరిం చవలసిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు నొక్కి చెబుతాయి. పాశ్చాత్య దేశాల్లో సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగం చేయడానికి మూలం ఈ ప్రయోజనాల మధ్య వైరుధ్యమే. చాలావరకు బ్రిటన్ చరిత్రలో పాలకులు, వారి అధికారుల మధ్య ఈ ప్రయోజనాల వైరుధ్యం విస్తృతంగా ఉండేది. 1660లో రాయల్ నేవీలో గొప్ప సంస్కర్త శామ్యూల్ పెపీస్ సైతం స్మగ్లింగ్‌లో పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. కానీ కాలానుగుణంగా పాలక సంస్కృతిలో మార్పు వచ్చింది. చక్రవర్తి కింద పనిచేసే మంత్రులు ఉన్నతోద్యోగ వర్గంలో సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అప్పట్లో బ్రిటన్ అనేక యుద్ధాల్లో మునిగి ఉన్నందున ప్రత్యేకించి పన్నుల సేకరణలో సమర్థ పాలన అత్యవసరమైంది. స్వతంత్ర న్యాయవ్యవస్థతోపాటు వికసిస్తున్న ప్రెస్ వల్ల కార్యనిర్వాహక వర్గానికి, దాని అధికార దుర్వినియోగానికి పరిమితులు విధిం చాయి. విద్యా వ్యాప్తి వల్ల, ప్రజల్లో తమ హక్కుల పట్ల అప్రమత్తత పెరి గింది. ఇక జాతీయ ఆడిటర్ ఆఫీసు ఏర్పాటుతో పాలనా వ్యవహారాల్లో అవినీతిని తగ్గించడానికి దారితీసింది. 20వ శతాబ్ది నాటికి బ్రిటన్‌లో అవినీతి గణనీయంగా బలహీనపడింది. కొంతమంది ఉన్నతోద్యోగులు పబ్లిక్ సర్వీసులోని సుగుణాలను, రిటైర్మెంట్ సమయంలో ప్రైవేట్ లాభంతో కలిపేశారు. తమ చర్యలు, వైఖరుల కారణంగా వీరు ప్రయోజనాల మధ్య వైరుధ్యం బారిన పడ్డారు. దీనికి బదులుగా సామాజిక చైతన్యపరులు, నేతలు వీటిపై ప్రశ్నలు సంధించినప్పుడు వారి వాదనలు వృద్ధికి, పెట్టుబడికి వ్యతిరేకం అని ఆరోపిస్తూ ప్రశ్నించినవారినే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ వచ్చారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రయోజనాల మధ్య వైరుధ్యం విషయంలో మన ఉదాసీన సంçస్కృతిని మార్చేవైపుగా సరైన న్యాయ యంత్రాంగాన్ని కూడా నెలకొల్పాల్సి ఉంది. ఇకపోతే, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారక సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) ఉదాహరణను తీసుకుంటే, వ్యవస్థలోని రెగ్యులేటరీ బోర్డులను స్వార్థ ప్రయోజనాలు క్రమేణా కమ్మేస్తూ వచ్చాయి. ఆహారభద్రతను పర్యవేక్షించడంలో ఈ రెగ్యులేటర్ సూత్రరీత్యా స్వతంత్రంగా ఉండాలని భావించారు కానీ, 2014 వరకు ఆహార పరిశ్రమ ప్రతినిధులే దీనికి సంబంధించిన శాస్త్రీయ కమిటీలలో నియమితులవుతూ వచ్చారు. పురుగు మందులు, ఆహారాన్ని లేబుల్ చేయడం, వేడి చేసి మళ్లీ కావలసిన రూపంలో చల్లబర్చడం వంటి అంశాల్లో ప్రమాణాల కల్పనలో అధికారులను అనుసంధానించేవారు. ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సైన్స్ విభాగాల్లో పలు పరిశోధన ప్యానెళ్లకు కార్పొరేట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను నియమిస్తూ వచ్చారు. ఉదాహరణకు, మానవులపై జరిపే క్లినికల్ పరీక్షలకు చెందిన ఒక ప్యానెల్లో నియమితుడైన నిపుణుడు అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ పరీక్షల విభాగాధిపతిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ నియమావళిలో ఎలాంటి విధానాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందనుకోవద్దు. భారత ఉద్యోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఓ అధికారిక విధానం ఉంది. దీని ప్రకారం సీనియర్ ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత వాణిజ్య రంగంలో ఉపాధి పొందాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవలసిందే. కానీ, ఇలాంటి పరిమితిని మంజూరు చేయడం ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండేది కానీ దీనిపై ఎలాంటి క్రోడీకరణ యంత్రాంగం ఉండేది కాదు. చిట్టచివరకు అలాంటి అభ్యర్థనలపై ప్రభుత్వాలు ఒక ఉదార వైఖరిని చేపట్టాయి. ఉదాహరణకు, ఒక రెవెన్యూ కార్యదర్శి ఒకటి కాకుండా అయిదు సంస్థల్లో పలుహోదాల్లో చేరడానికి అనుమతించారు. ట్రాయ్ మాజీ అధిపతి రిటైరైన కొద్ది నెలల్లోపే అపఖ్యాతి చెందిన ఒక కార్పొరేట్ లాబీయిస్ట్ ప్రమోట్ చేసిన సంస్థలో పనిచేయడానికి అనుమతించారు. ఇకపోతే, కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తొలగిస్తూ నిబంధనలను అమలుచేస్తే అలాంటి బ్యూరోక్రాట్లు ప్రైవేట్ రంగంలో తమ అనుభవాన్ని ఉపయోగిస్తే తప్పులేదు. ప్రయోజనాల మధ్య వైరుధ్యంలో తమ పాత్రను బహిర్గతం చేయని వారిని శిక్షించేలా మనం చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఇఎమ్‌ఎస్ నాచియప్పన్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ 2012 ప్రకారం, ఇలాంటి చట్టం న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వంటి పాలనా రంగాలన్నింటికీ వర్తించాల్సి ఉంది. రిటైరయ్యాక ప్రైవేట్ రంగంలో చేరాలని ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా రిటైర్ అయ్యేలా నిబంధనలను మార్చాలని, కనీసం అయిదేళ్ల పాటు ప్రవేట్ రంగంలో పనిచేయకుండా వారిపై ఆంక్షలు విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది కూడా. అప్పుడే రిటైరైన ఉన్నతాధికారి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని తాను చేరే ప్రైవేట్ సంస్థకు ఉపయోగించలేడు. అదే సమయంలో అలాంటి సంస్థలలో చేరతామని రిటైర్డ్ అధికారులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చడానికి కారణాలను కూడా స్పష్టంగా ఈ చట్టంలో పొందుపర్చాలి. అంతిమంగా పారదర్శకతా సంస్కృతిని పెంపొందించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ వ్యవహారాల్లో పాలు పంచుకోలేదని స్పష్టం చేయడమే కాకుండా ఉన్నతాధికారులు కూడా తమ రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి ముందే బహిరంగ పర్చడం చాలా అవసరం. ఇలాంటి పారదర్శకత లేనిదే భారతీయ సమాజం, పాలనా వ్యవస్థ, దాని ప్రైవేట్ రంగం ఇన్ సైడర్ ట్రేడింగుతో ఘర్షిస్తూనే ఉంటుంది. -వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com -
ఇప్పట్లో లేనట్లే..
ఏప్రిల్‌లోనే టీఆర్ఎస్ కమిటీల ప్రకటన ఆశగా ఎదురు చూస్తున్న గులాబీ నేతలు సంస్థాగత ఎన్నికల తర్వాతే పదవులు వరంగల్ : అధికార టీఆర్ఎస్లో పార్టీ పదవుల పందేరం ఇప్పట్లో లేదని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో జరిగే సంస్థాగత ఎన్నికల తర్వాతే అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలు ఏర్పాటైన రోజునే పార్టీ కమిటీలను నియమించాలని టీఆర్ఎస్ అధిష్టానం తొలుత భావించింది. జిల్లా కమిటీలతోపాటే రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పార్టీ పదవులను ఆశిస్తున్న గులాబీ నేతలు తమకు అవకాశాలు వస్తాయని భావించారు. అధికార పార్టీలో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో కమిటీల ప్రకటన అంశం తాత్కాలికంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆ తర్వాత ఈ అంశం పూర్తిగా పక్కకు పోయింది. ఇలాంటి పరిస్థితిలో టీఆర్ఎస్ అధిష్టానం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రతి రెండేళ్లకోసారి ఏప్రిల్‌లో జరుగుతుంది. 2015లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది. అదే ఏడాది ఏప్రిల్‌లో జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. కేవలం అధ్యక్షుల ఎన్నికతోనే కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది. -
జనసేనలో ముగ్గురికి పదవులు
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి: పవన్ కల్యాణ్ సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మహేం దర్‌రెడ్డిని తెలంగాణ జనసేన రాజకీయ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఇన్చార్జిగా నేమూరి శంకర్‌గౌడ్, మీడియా విభాగం అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు పవన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లికి చెందిన వ్యాపారవేత్త. బోరబండకి చెందిన శంకర్‌గౌడ్ కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చురుకైన కార్యకర్తగా పనిచేశారని అందులో తెలిపారు. -
ఖాళీగా వున్న విప్, ఛీఫ్‌విప్ పదవులు
-
ఇక పదవులు అడగమన్నా..!
‘మా పరిస్థితి కొండకు ఎదురు చూసినట్లు అయ్యింది. ఇవాళ.. రేపు అంటూ రెండేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఎదురు చూపులే మిగిలాయి తప్ప అందివచ్చిన పదవి ఏమీ లేదు. ఇక పదవులు అడగమన్నా..’ అంటూ గులాబీ నేతలు రాజీ పడిపోతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధినేత రేపూ మాపూ అంటూ ఊరించిన పదవులు కొన్నే భర్తీ అయ్యాయి. పార్టీని నమ్ముకున్న.. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన కొందరు సీనియర్లను కదిలిస్తే కళ్ల నుంచి కన్నీళ్లు దునికేలా ఉన్నారు. ఆషాఢం.. శ్రావణం.. దసరా.. సంక్రాంతి అంటూ గడువులు పెట్టిన నాయకత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్న ఆవేదన వారిలో ఉంది. ఒకరికి ఒకరు ఎదురు పడితే బేల చూపులు.. వెర్రి నవ్వులతో పలకరించుకుంటున్నామని తమపై తామే జోకులూ వేసుకుంటున్నారు. ‘ఎప్పుడు కనపడినా.. మీ జిల్లాలో నువ్వే మిగిలావ్.. ఈ సారి అయిపోతుందిలే..’ అన్న హామీలు పొంది పొందీ అలవాటై పోయిందని, పదవి మాత్రం అందని పండుగానే మిగిలిందన్న ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘మేము ఎంతో నయం.. ముందు నుంచీ పరిస్థితులకు అలవాటు పడినోళ్లం. ఏదో సంపాదిద్దామని పార్టీలోకి వచ్చిన కొత్తవాళ్ల పరిస్థితే కక్కలేక.. మింగలేక అన్నట్లు అయ్యింది..’ అని ఓ నేత అన్నారు. ఇక ముందూ మిగిలింది ఎదురు చూపులే.. ఇస్తే తీసుకుంటం.. ఇక పదవులు అడగం అన్న నిర్ణయానికి వచ్చినట్లు వారి మాటలు చెప్పకనే చెబుతున్నాయి! -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
చిత్తూరు(అర్బన్): వైఎస్సార్ కాంగ్రెస్‌లో పుంగనూరుకు చెందిన పలువురిని పదవుల్లో నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంఖాన్‌ను రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్.సలీమ్ బాషా రాష్ట్ర కార్యదర్శిగా, పి.నూర్ అహ్మద్, కే.ఎస్ సఫీవుల్లాను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా, షేక్ ఫక్రూద్దీన్ షరీఫ్‌ను రాష్ట్ర మైనారి టీ విభాగం కార్యవర్గ సభ్యునిగా నియమించారు. -
పదవులు ఎవరికి ఇద్దాం!
జోగిపేట : ఎవరికి ఏ పదవులు కావాలో.. ఇవ్వాలో చెప్పదలచుకున్నారా.. చిట్టీ రాసి సంచిలో వేయండి అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల కోసం అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఆయన హైదరాబాద్‌లోని నెక్టార్ గార్డెన్ క్లబ్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎవరికి ఏ పదవి కావాలో చిట్టీ రాసి సంచిలో వేయాలని ఖాళీ సంచిని అక్కడుంచారు. కొందరు కార్యకర్తలు లేచి ఏ పదవైనా ఎమ్మెల్యేగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పగా అదే అభిప్రాయం రాసి వేయండి అంటూ ఆయన సూచించడం విశేషం. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరై కొద్ది సేపటి తర్వాత జిల్లా పర్యటనకు వెళ్లారు. అనంతరం ఈ చిట్టీల కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 250 మంది వరకు నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ మండలాల్లో మార్కెట్ కమిటీ పదవులు కోరుతూ పలువురు ఫలానా నాయకుడికి ఇస్తే బాగుంటుందని తెలుపుతూ చిట్టీలు రాసి సంచిలో వేశారు. చైర్మన్ పదవుల రేసులో ఉన్న వారు తమ పేర్లతో చిట్టీలు రాసినట్లు తెలిసింది. జోగిపేట మార్కెట్‌కు ముగ్గురు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే సంచిలోని చిట్టీలను ఎప్పుడు చదువుతారో... తమ పేరును ఎప్పుడు పలుకుతారోనని నాయకులు స్థానిక నాయకుల్లో టెన్షన్ పట్టుకుంది. -
టీడీపీలో ఆట మొదలైంది
ఇంతకూ రేవంత్‌కు ఏ పదవి! సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో ఆట మొదలైంది. పార్టీలో కీలకమైన పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఒకింత ఆలస్యంగానైనా, పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టడంతో పదవి కోసం లాబీయింగ్ ఊపందుకుంది. ఈ వారాంతంలోగా పార్టీ పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. కాగా, తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటికప్పుడు ఏపీ కమిటీలో ఉన్న నేతలతోనే తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించారు. మాజీ మంత్రి ఎల్.రమణ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏర్పాటైన ఆ కమిటీ పదవీ కాలం మహానాడుతోనే ముగిసింది. కమిటీ కొత్త అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవులు ఎవరికి దక్కుతాయో ఇప్పటి దాకా సస్పెన్స్‌గానే ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడు, ఇతర పదవుల భర్తీపై పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలియగానే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు పడిపోయారు. మొదటి నుంచీ అధ్యక్ష పదవిపై కన్నేసిన, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న ఆయనపై ఉన్న షరతులను కూడా కోర్టు ఎత్తివేయడంతో ఇక, ఏ ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారని, తెలంగాణలో పార్టీకి తన అవసరమే ఎక్కువ ఉందని ఆయన సన్నిహితుల వద్ద కూడా అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాట ఎత్తితే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న రేవంత్.. తనను తాను రాష్ట్ర స్థాయి నేతగా రుజువు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఓ సారి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ వెనకబడిన వర్గాల కోటాలో ఈసారీ తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పదవినీ ఆశిస్తున్నారు. ఆయన తొలి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి తనకు అవకాశం వస్తుందో రాదో అన్న బెంగ ఆయనలో ఉంది. అయినా, చివరి దాకా అధినేతను మెప్పించి పదవి పొందే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. వర్గ సమీకరణలు కుదరక, ఒక వేళ రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎర్రబెల్లి, రేవంత్ మధ్య ఆధిపత్య పోరు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇబ్బందులు పడ్డారన్న సానుభూతి పార్టీ అగ్ర నాయకత్వంలో ఉందని, ఇది ఒక రకంగా రేవంత్‌కు లాభించే అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎల్.రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్యే అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుని పదవులు దోబూచులాడుతున్నాయని పేర్కొంటున్నారు. వీరిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అది పార్టీలో ఎలాంటి అంతర్గత పోరాటానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
పదవులు శాశ్వతం కాదు: మంత్రి అయ్యన్న
-
పాలమూరుకు పెద్దపీట
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో జిల్లాకు నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం జాబితాను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భీష్వ రవీందర్ రాష్ట్ర యువజనవిభాగం అధ్యక్షుడిగా, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుల య్యారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జి.రాంభూపాల్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, మిడ్జిల్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు టి.భీమయ్య గౌడ్ (జడ్చర్ల), బంగి లక్ష్మణ్ (కొల్లాపూర్)లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీవరకు ైవె ఎస్ షర్మిల జిల్లాలో ఐదు రోజుల పాటు పరామర్శ యాత్ర చేపట్టారు. యాత్ర సందర్భంగా చురుకుగా వ్యవహరించిన ఎడ్మ కిష్టారెడ్డితో పాటు భీష్వ రవీందర్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితర నేతలకు కీలక పదవులు దక్కాయి. జిల్లాకు చెందిన మిగతా ముఖ్య నేతలకు అనుబంధ విభాగాలు, జిల్లా కమిటీలో చోటు దక్కే అవకాశం ఉంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం - రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మకిష్టారెడ్డి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారం కోసం పోరాడుతాం. తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కరువు, కరెంటు కోత, అప్పులు దొరకకపోవడంతో పాటు గిట్టుబాటు ధర రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. గతంలో రైతుల సమస్యలపై ఆమరణ దీక్ష, ధర్నాలు చేశాను. రైతులకు ధైర్యం కల్పిస్తా. నాకు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి రైతుల సమస్యలపై పోరాడే అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. పార్టీని బలోపేతం చేస్తాం భీష్వ రవీందర్,రాష్ట్రఅధ్యక్షుడు,యువజన విభాగం అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి యువజన విభాగం కార్యవర్గం ఏర్పాటు చేస్తా. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. విద్యార్థి, యువజనులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిశా నిర్దేశంలో అన్నివర్గాలకు పార్టీ చేరువయ్యేలా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణ, బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. పార్టీ పటిష్టతకు కృషిచేస్తా - జి.రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింనందుకు జగన్మోహన్రెడ్డి, షర్మిలమ్మ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయను. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను, ఆయన హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు అంకుటిత దీక్షతో పనిచేస్తా. పార్టీ అధినాయకత్వం నిర్ణయానుసారం పార్టీని ముందుకు నడిపిస్తాం. నమ్మకాన్ని నిలబెడతా - మామిడి శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాపై నమ్మకాన్ని ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాపై చెరగని ముద్ర వేశాయి. వైఎస్ పథకాల మూలంగా లబ్ధి పొందిన వారు నేటికీ ఆయన పాలనను తలచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తాం. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో గ్రేటర్‌కు పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలు కీలక పదవులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సురేష్‌రెడ్డి సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో గ్రేటర్ నేతలకు పెద్దపీట వేశారు. ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు పొంగులేని శ్రీనివాసరెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, కె.శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షునిగా వెల్లాల రాంమోహన్ (సనత్‌నగర్), డాక్టర్స్ విభాగం అధ్యక్షునిగా డాక్టర్ పి.ప్రఫుల్లా (జూబ్లీహిల్స్), మైనారిటీ విభాగం అధ్యక్షునిగా సయ్యద్ ముజ్తబా అహ్మద్(రాజేంద్రనగర్), క్రిష్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా జార్జి హెర్బెట్ (కూకట్పల్లి)లను నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా గ్రేటర్‌కు చెందిన జి.సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్, ఏనుగు మహీపాల్‌రెడ్డి, క్రిసోలైట్, బి.మోహన్‌కుమార్, కసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, ఎస్.హరినాథ్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేస్తా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తా. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తాం. బస్తీల నుంచి పార్టీని నిర్మిస్తాం. నగర ప్రజల సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రజా సమస్యలపై పోరు చేసి ప్రభుత్వ పాలకులతో చర్చించి అవి పరిష్కారమయ్యేలా కృషి చేస్తా. - కె.శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సమరశీల ఉద్యమాలు చేపడతా... నగర పరిధిలోని బస్తీలు, రూరల్ మండలాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల ఉద్యమాలు చేపడతా. హైదరాబాద్ నగరంతో మిళితమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజవర్గాలతోపాటు, గ్రామీణ నియోజవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. - కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధి -
ఎమ్మెల్సీ ఆశావహులు వీళ్ళే!
-
పేరిరెడ్డి, హనిమిరెడ్డికి పదవులు
పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని ఇద్దరు నాయకులకు పార్టీ పదవులు కట్టబెడుతూ వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పర్యవేక్షకునిగా ఆళ్ల పేరిరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పేరిరెడ్డి దాంతోపాటు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. పేరిరెడ్డి రామ్కీ గ్రూప్ అధినేతల్లో ఒకరు. ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విషయం విదితమే. వచ్చే నెల 5 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగనున్న ధర్నా కార్యక్రమం విజయవంతానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పేరిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ధర్నా ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షిస్తారు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పర్యవేక్షకునిగా పానెం హనిమిరెడ్డి నియమితులయ్యారు. దీంతోపాటు ఆయన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీచేశారు. పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలను ఇక నుంచి హనిమిరెడి పర్యవేక్షించనున్నారు. మైనింగ్ ఇంజినీరింగ్ చేసిన ఆయన పార్టీలో రాష్ట్రసేవాదళ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. -
తమ్ముళ్లు గుర్రు
చంద్రబాబు తీరుపై ఆగ్రహం ఎన్నికల ముందు పదవుల ఎరతో బుజ్జగింపులు ఇప్పుడు మొహం చాటు నామినేటెడ్ పదవులపై దాటవేత సాక్షి, విశాఖపట్నం : ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో... ఎన్నికల ముందు పదవుల ఎర చూపి తమ్ముళ్లను బుజ్జగించిన టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచిన తరువాత వారికి మొహం చాటేస్తున్నారు. బాబు నిజస్వరూపాన్ని తెలియని కొందరు తమ్ముళ్లు ఆయన వద్దకు వెళ్లి నగుబాటుకు గురయ్యారు. ఎన్నో ఆశలతో వెళ్తే కనీసం పలకరించకుండా మొహం చాటేయడంతో నిప్పులు కక్కుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత తమ నేత తీరును చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు చేసేది లేక భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారు. విశాఖలో కేబినేట్ సమావేశానికి హాజరైన చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని, బుజ్జగింపులతో దారికి వచ్చిన టీడీపీ నేతలు కొందరు కలిసే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏదోక నామినేటెడ్ పోస్టు ఇస్తానని స్వయంగా బాబు హామీ ఇవ్వడంతో కొందరు ఎయిర్‌పోర్టులోను, ఇంకొందరు ఏయూలో కలిసి విన్నవించారు. బాబు మాత్రం వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. యలమంచిలి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న సుందరపు విజయ్‌కుమార్ టిక్కెట్ లభించకపోవడంతో ఆమరణ దీక్ష చేపట్టారు. చివరకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఏదొక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ అయినా దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. గురువారం ఆయన బాబును కలవగా నామినేటెడ్ పదవులు ఏం లేవని, ఒకవేళ ఉంటే సెప్టెంబరులో చూద్దామని చెప్పినట్టు తెలిసింది. పాడేరుకు చెందిన మాజీ మంత్రి మణికుమారి సైతం బాబును కలిసి అధిష్టానంపై నమ్మకంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందును ఏదొక పదవి ఇవ్వాలని కోరారు. గిరిజన కార్పొరేషన్, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టు ఆశిస్తున్న ఈమెకు కూడా ఎలాంటి హామీ లభించలేదు. గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్‌గా బరిలో దిగాలని భావించినా అధినేత బుజ్జగింపుతో వెనుకంజ వేసి న కోన తాతారావు జీవీఎంసీ మేయర్ లేదా వుడా చైర్మన్ పోస్టు ఆశిస్తున్నారు. అతడు మంత్రి అయ్యన్న అనుచరుడు కావడంతో కలిసివచ్చినట్టుంది. మేయర్ పదవి ఇచ్చేందుకు బాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి అప్పలనరసింహరాజు భీమిలి అసెంబ్లీ టికెట్ తన కుమారుడి కోసం ప్రయత్నించి విరమించుకున్నారు. అక్కడ అభ్యర్థి గంటాకు పూర్తిగా సహకరించారు. ఇప్పుడు ఈయన ఏదొక పదవి ఆశిస్తున్నారు. బాబును కలిస్తే సరైన సమాధానం రాలేదు. పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ లేదా పేరున్న నామినేటెడ్ పోస్టు కావాలని కోరుతున్నారు. వీరెవరికి బాబు హామీ ఇవ్వలేదు. సరికదా సరిగా స్పం దించలేదని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగుతుందనుకుంటే, ఇప్పుడు పదవి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నెలకొందని మధనపడుతున్నారు. -
పదవులకు క్యూ..
టీడీపీ నేతల తహతహ చంద్రబాబుతో మంతనాలు పైరవీలు ముమ్మరం నామినేటెడ్ పోస్టులపై అసంతృప్త నేతల కన్ను సాక్షి, విశాఖపట్నం: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు పదవుల కోసం తహతహలాడుతున్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో అప్పుడే పార్టీలో పదవుల కోసం పోటీ మొదలైంది. కొత్తగా ఎ న్నికైన ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరులు, పోటీకి దూరంగా ఉన్న సీని యర్ నేతలు, టికెట్ దక్కని ఆశావహులు మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు ముమ్మరం చేస్తున్నారు. అందుకోసం కొందరు నేతలు నేరుగా చంద్రబాబును కలిసి తమ కోరికలు వినిపిస్తుంటే, మరికొందరు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ము ఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అటు కిందిస్థాయి నేతలు సైతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు, యాదవ, వెలమ సామాజిక వర్గాల నేతలంతా మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో నియోజక వర్గాల్లో అప్పుడే హల్చల్ చేస్తున్నారు. వారంతా ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ విజ్ఞప్తులు వినిపించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇప్పుడు గంటా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న, బండారు ఇద్దరు సీనియర్ నేతలే కావడం, గతంలో పార్టీలో మంత్రులుగా పనిచేయడంతో ఇప్పుడు ఇద్దరూ మం త్రి పదవులు మళ్లీ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికే ఆ చాన్స్ దక్కే అవకాశం ఉండడంలో వీరు పలువురు ముఖ్యనేతలతో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. అటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించడంతో ఆయన కూడా చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ ఎంపీ హరిబాబు ద్వారా, తన సామాజికవర్గ నేతలతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కన్నబాబురాజు తనకు టికెట్ దక్కకపోవడంతో కనీసం నామినేటెడ్ పోస్టు కావాలంటూ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభతోపాటు మరేదైనా పదవి దక్కించుకోవడానికి చంద్రబాబు కోటరీ నేత అయిన నారాయణ ద్వారా పావులు కదుపుతున్నారు. విశాఖ మహా నగరంలో అత్యంత కీలకమైన వుడా చైర్మన్‌తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నందున అవి తమకు దక్కేలా చేసుకునేందుకు మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌తోపాటు మరికొందరు కూడా పక్క జిల్లాల పార్టీ ముఖ్య నేతల ద్వారా బాబుపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కక భంగపడ్డ విశాఖ జిల్లా గాజువాక నేత కోన తాతారావు, యలమంచిలి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయకుమార్ ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం జిల్లా ముఖ్యనేతల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు.