వైఎస్సార్ సీపీ కమిటీల్లో గ్రేటర్‌కు పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలు కీలక పదవులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సురేష్‌రెడ్డి
సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో గ్రేటర్ నేతలకు పెద్దపీట వేశారు. ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు పొంగులేని శ్రీనివాసరెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, కె.శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షునిగా వెల్లాల రాంమోహన్ (సనత్‌నగర్), డాక్టర్స్ విభాగం అధ్యక్షునిగా డాక్టర్ పి.ప్రఫుల్లా (జూబ్లీహిల్స్), మైనారిటీ విభాగం అధ్యక్షునిగా సయ్యద్ ముజ్‌తబా అహ్మద్(రాజేంద్రనగర్), క్రిష్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా జార్జి హెర్బెట్ (కూకట్‌పల్లి)లను నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా గ్రేటర్‌కు చెందిన జి.సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్, ఏనుగు మహీపాల్‌రెడ్డి, క్రిసోలైట్, బి.మోహన్‌కుమార్, కసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, ఎస్.హరినాథ్‌రెడ్డి నియమితులయ్యారు.
పార్టీని బలోపేతం చేస్తా
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తా. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తాం. బస్తీల నుంచి పార్టీని నిర్మిస్తాం. నగర ప్రజల సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రజా సమస్యలపై పోరు చేసి ప్రభుత్వ పాలకులతో చర్చించి అవి పరిష్కారమయ్యేలా కృషి చేస్తా. - కె.శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి
సమరశీల ఉద్యమాలు చేపడతా...
నగర పరిధిలోని బస్తీలు, రూరల్ మండలాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల ఉద్యమాలు చేపడతా. హైదరాబాద్ నగరంతో మిళితమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజవర్గాలతోపాటు, గ్రామీణ నియోజవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.
- కొండా రాఘవరెడ్డి,
అధికార ప్రతినిధి