suresh reddy
-
‘స్కిల్’ కుంభకోణం కేసులో 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీ వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోకేశ్‌ను ఇప్పటివరకు నిందితునిగా చేర్చలేదని కోర్టుకు నివేదించారు. నిందితుడు కానప్పుడు అరెస్ట్ చేయడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. కేవలం భయాందోళనతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఇప్పటికైతే అరెస్ట్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్లమని, తాము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తామని చెప్పారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అంశాల ఆధారంగా వాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి లోకేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆయన తండ్రి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు. ఆ రిమాండ్ రిపోర్టును ఆధారంగా 20 రోజుల తరువాత ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారన్నారు. లోకేశ్ చెబుతున్న కారణాల్లో సదుద్దేశం కనిపించడంలేదని, సంబంధం లేని అంశాలన్నింటినీ లేవనెత్తుతున్నారని చెప్పారు. నిందితునిగా చేర్చకుండానే బెయిల్ ఇవ్వాలంటూ ఎలా కోర్టుకొస్తారని ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. బుధవారం లేదా గురువారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని, అప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోర్టుకు నివేదించారు. అంతకు ముందు లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతున్నామన్నారు. చంద్రబాబు రిమాండ్ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులని పేర్కొందని, సీఐడీ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు. చంద్రబాబునే సీఐడీ అధికారులు ఈ కేసులో అక్రమంగా, అన్యాయంగా ఇరికించారని, తప్పుడు కేసు బనాయించారని అన్నారు. లోకేశ్ విషయంలో కూడా అదే రీతిలో చేస్తారని, సీఐడీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 4వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, కావాలంటే ఆ తరువాత విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోండని కోర్టును అభ్యర్థించారు. -
అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర లబ్ధి కోసమే ఐఆర్ఆర్ భూ దోపిడీ
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) భూ దోపిడీ వ్యవహారంలో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసు అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర సహకారానికి సంబంధించినదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కుటుంబానికి, పార్టీ కి, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు పరస్పరం సహకరించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, బాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరపున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పోలీసు కస్టడీ కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికే అరెస్టయిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన డీఫాల్ట్‌గా కస్టడీలో ఉన్నట్లు భావిస్తూ ఆయన న్యాయవాదులు ప్రస్తావిస్తున్న తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్, మరో కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడంలేదు కాబట్టే, ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందని చెప్పారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదన్నారు. కింది కోర్టుకెళ్లకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం శ్రీరామ్ వాదనల నిమిత్తం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వం, అధికారులు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలకు నేర స్వభావాన్ని ఆపాదిస్తున్నారని తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగలేదని, ఎలాంటి భూమినీ సేకరించలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. హెరిటేజ్ కంపెనీతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. అది లిస్టింగ్ కంపెనీ అని, లక్షల మంది వాటాదారులున్నారని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2014లో ఆ కంపెనీ అమరావతి పరిధిలో కొన్న భూమి రింగ్ రోడ్డుకు 9 కి.మీ. దూరంలో ఉందన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చారని, అందులో భాగంగానే కరకట్ట వద్ద ఉన్న ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లింగమనేని రమేష్ ఖాతాలో జమ చేసిన రూ.27 లక్షలు అవినీతి సొమ్ము కాదని, ఈ డబ్బు చంద్రబాబు తను ఉంటున్న ఇంటికి చెల్లించిన అద్దె మొత్తమని తెలిపారు. -
బాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. పలు కేసులు ఒకే పోలీస్టేషన్లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్‌తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని ఆయన కోరారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు. -
ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏడాది పెండింగ్‌లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారాయణ తదితరులను అరెస్ట్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు... తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్.ప్రణతి, అజయ్ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఏక కాలంలో రెండు పిటిషన్లా.. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సమీప బంధువులు, బినామీలు తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్ పిటిషన్ వేశారు. 2022లో ముందస్తు బెయిల్ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వాయిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయణ తదితరులు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు. -
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
పక్కా ప్రణాళికతోనే ప్రాణాలు తీశాడు..
నెల్లూరు(క్రైమ్): తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో కావ్యశ్రీని చంపడమే లక్ష్యంగా సురేష్‌రెడ్డి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చాడు.. అదును కోసం వేచి చూసి ఈ నెల 9న ఆమెను తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీని ఎక్కడ, ఎవరి వద్ద కొనుగోలు చేశాడు.. తదితర వివరాలను సేకరించిన పోలీసులు బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాలను గురువారం నెల్లూరు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి మీడియాకు వివరించారు. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన కావ్యశ్రీ.. అదే ప్రాంతానికి చెందిన సురేష్‌రెడ్డితో పెళ్లికి నిరాకరించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గతేడాది ఆగస్టులో ఆమెకు సురేష్‌రెడ్డి మెసేజ్ పంపాడు. దానికి ఆమె స్పందించకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. యాసిడ్‌తో దాడి, హత్యచేయడంపై ఇంటర్నెట్లో వీడియోలు చూశాడు. చివరకు తుపాకీతో కాల్చి చంపాలని నిర్ణయించుకుని, ఆ సమాచారం కోసం నెలల తరబడి డార్క్ నెట్లో శోధించాడు. బిహార్‌లో తుపాకులు దొరుకుతాయని తెలుసుకుని గతేడాది డిసెంబర్లో పాట్నాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పాట్నా పున్పున్ పోస్టు కందాప్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రమేష్‌కుమార్ అలియాస్ రోహిత్, అతని అన్న ఉమేష్‌ల నుంచి తుపాకీని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదును కోసం వేచి చూసి చివరికి కావ్యశ్రీని కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కోణంలో దర్యాప్తు ఘటనపై శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. అసలు సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సురేష్‌రెడ్డి సెల్‌ఫోను మెసేజ్‌లు, కాల్ డేటా, ట్రావెల్ హిస్టరీని సేకరించారు. మృతుడు గతేడాది డిసెంబర్లో బిహార్‌లోని ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.89,500 విత్‌డ్రా చేసినట్టు గుర్తించారు. తుపాకీ పైనున్న( స్టార్) గుర్తుల ఆధారంగా దానిని బిహార్‌లోనే కొనుగోలు చేసినట్టు నిర్ధారణకొచ్చారు. ప్రత్యేక బృందాలు పాట్నాకు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో.. తుపాకీని విక్రయించిన అన్నదమ్ముల్లో ఒకడైన రోహిత్‌కు నెల్లూరు వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీంతో రమేష్ ఈ నెల 17న నెల్లూరు వచ్చి సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి అన్న ఉమేష్ కోసం గాలిస్తున్నట్టు క్రైమ్స్ ఏఎస్పీ చౌడేశ్వరి వివరించారు. -
ఉప్పుడు బియ్యంపై అట్టుడికిన సభ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి టీఆర్ఎస్ కొనసాగిస్తున్న ఆందోళనతో మంగళవారం లోక్‌సభ అట్టుడికింది. ధాన్యం కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని కోరుతూ ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ అంశంపై త్వరితగతిన చర్చ చేపట్టి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనల నేపథ్యంలో సభ రెండుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనూ కేంద్రం తీరుకు నిరసనగా సభ్యులు వాకౌట్ చేశారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో డిప్యూటీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని విన్నవించారు. లోక్‌సభ రెండుమార్లు వాయిదా.. మంగళవారం సభ ఆరంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఎంపీలు నామా, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, కవిత, పసునూరి దయాకర్, ఎంఎస్ఎన్ రెడ్డి, వెంకటేశ్ నేత, రాములు.. తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు సైతం ధరల పెరుగుదల అంశంపై చర్చ కోరుతూ వెల్‌లోకి వెళ్లారు. వీరితోపాటే వెల్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం సేకరణపై జాతీయ విధానం తేవాలి.. అన్నదాతలను శిక్షించొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటున్న సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పెట్టి నిరసన కొనసాగించారు. టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశా రు. సభ తిరిగి మొదలయ్యాక సైతం ఎంపీలు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలో వాకౌట్... రాజ్యసభ ఆరంభం అయిన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు.. సురేశ్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సురేశ్‌రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. ‘బాయిల్డ్ రైస్‌పై చర్చించాలని నోటీసులిచ్చాం. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు కేంద్రం తీరుతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య అయినందున చర్చ పెట్టండి’అని కోరారు. చైర్మన్ నిరాకరిం చడంతో సురేశ్‌రెడ్డి సహా ఇతర ఎంపీలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు తెలంగాణ భవన్లో ఎంపీలు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు. -
పూర్వ వైభవం తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని సంస్థ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించు కోవటంతోపాటు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవటం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మెరుగు పరుస్తామని అన్నారు. కొత్త ఎండీగా నియమితులైన డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌తో కలసి కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పురోగమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఉదయం ఆయన బస్‌భవన్‌లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు అభినం దనలు భఃతెలిపారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ ప్రజాజీవితంతో ముడిపడిఉన్న సంస్థ అని, అందరికీ ఆర్టీసీతో అనుబంధం ఉంటుం దని, అలాంటి సంస్థను బతికించుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని పేర్కొ న్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా సంస్థ ఆదాయం పెరిగేందుకు సాయం చేయాలని, సురక్షిత ప్రయాణం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. కష్టపడి పనిచేసే తత్వమున్న సిబ్బంది, అనుభవం ఉన్న అధికారులున్నందున అంద రినీ కలుపుకొనిపోయి సంస్థను అభివృద్ధి బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలందించిందని, అలాంటి సంస్థను కాపాడుకోవటం మన విధి అని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మబోమని అన్నారు. కొత్తగా ప్రారంభమైన కార్గో అండ్ పార్శిల్ సర్వీసులను బలోపేతం చేయడం, ఆర్టీసీ స్థలాల్లో ఏర్పాటైన పెట్రోల్ బంకులను మెరుగ్గా నిర్వహించటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. అనంతరం ఆర్టీసీ కల్యాణమండపంలో కార్యకర్తలు, నేతలతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు వేల మంది వరకు కార్యకర్తలు, నాయకులు బస్‌భవన్‌కు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
ఎంపీ సురేష్ రెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్నే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు. దీంతో సురేష్ రెడ్డి హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా తనతో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పక్షాన కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శ్రమజీవి పార్టీ తరఫున నామి నేషన్లు వేసిన జాజుల భాస్కర్, భోజరాజ్ కోయల్కర్ నామినేషన్లను ఈ నెల 16న జరిగిన పరిశీలనలో ఎన్నికల అధికారి తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటా నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రస్తుత ఎన్నికతో అన్ని స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. అయితే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన డి.శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం... తనను వరుసగా రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు కేకే కృతజ్ఞతలు తెలిపారు. సురేశ్‌రెడ్డితో కలసి బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, వివిధ అంశాలకు సంబంధించి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కేశవరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు గర్వపడేలా తన పనితీరు ఉంటుందని కేఆర్ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజ్యసభ సభ్యు డిగా పనిచేయడం తనకు అత్యంత సవాల్‌గా భావిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. టీఆర్ఎస్ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్ కె.కేశవరావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు వెంటరాగా అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు కాగా.. కేకే, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులు, టీఆర్ ఎస్, ఏఐఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒక్కో సెట్‌పై 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా, ఒక్కో సెట్‌పై నలుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కుమారులు వెంకట్, విప్లవ్.. సురేశ్‌రెడ్డి సతీమణి పద్మజారెడ్డి అసెంబ్లీకి వచ్చిన వారిలో ఉన్నారు. కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యుల భేటీ.. నామినేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్టీ అభ్యర్థులు కేకే, సురేశ్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్లో పార్టీ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అసెంబ్లీ లాబీల్లో ఎంపీలు సంతోష్, బండా ప్రకా శ్, లింగయ్య యాదవ్ ఇప్పుడు మనం సీనియర్లం అయ్యాం అంటూ సరదాగా అన్నారు. కాగా, నామినేషన్ దాఖలుకు ముందు కేకే, సురేశ్‌రెడ్డి గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళుల ర్పించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, విప్ బాల్క సుమన్, గువ్వ ల బాలరాజు తదితరులతో అసెంబ్లీకి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు అభ్యర్థి సురేశ్‌రెడ్డితో పాటు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న హరీశ్‌రావు తదితరులు ఎన్నిక కావడం లాంఛనమే... టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరితో పాటు శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజ్ కోయల్కర్ ఒక్కో సెట్టు దాఖలు చేశారు. ఇలా మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయింది. 16న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా టీఆర్ఎస్కు 104, ఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే కానున్నది. -
ఎల్వీ ప్రసాద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను – కృష్ణంరాజు
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపాదించిన ప్రతి పైసా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీపై గౌరవం రావడానికి ఖర్చు చేశారు. ఆయనతో నాకు ఉన్న అనుబంధమే నన్ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది’’ అన్నారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ సమయంలో సినీ పరిశ్రమ వదిలేసి వెళ్లిపోదామనుకున్నాను. అప్పుడే ‘నేనంటే నేనే’ అనే సినిమా కోసం డూండీగారు నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో ఉన్న మూడు పాత్రల్లో ఒకటి కృష్ణగారు, మరొకటి నాగభూషణంగారు చేస్తున్నారని చెప్పారు. ఇంకో పాత్ర కోసం నన్ను అడిగారు. అయితే ఆ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న కారణంగా ఆ సినిమా చేయకూడదనుకున్నాను.ఓ సందర్భంగా ఎల్వీ ప్రసాద్‌గారిని కలిసినప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పాను. ‘సినిమాలో నువ్వు హీరోవా? విలన్‌వా? అని కాదు. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువ అవుతావు అన్నదే ముఖ్యం’ అని ఆయన నాకు హితబోధ చేశారు. దాంతో నేను ‘నేనంటే నేనే’ చిత్రంలో నటించాను. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు దోహదపడిన ఎల్వీ ప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. వారి కుటుంబంతో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘నా జీవితంలో మా నాన్నగారితో నేను గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ఆయన అంతగా చదువుకోలేదు. ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. ఆ అంకితభావంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను టెక్నికల్వైపు మారాను. ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటేడ్ బ్యానర్‌పై మా నాన్నగారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. తన సినిమాలు చూసి తనను గొప్పవాడిని చేసిన ప్రజలకు మంచి చేయాలని ఓ ట్రస్ట్‌ను స్థాపించారు. సినిమాల ద్వారా వచి్చన కోటి రూపాయలను డొనేషన్‌గా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఎలీ్వప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాలు రావడానికి మా సపోర్ట్‌ను కంటిన్యూ చేస్తాం’’ అన్నారు ఎలీ్వ ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. ‘‘ఎల్వీ ప్రసాద్‌గారి జయంతి సందర్భంగా ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్లో శిక్షణ పొందినవారికి గోల్డ్ మెడల్స్‌తో ప్రీ కాన్వకేషన్ ప్రదానం చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి. ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో మహామహా నటులు ఎల్వీ ప్రసాద్‌గారి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. అటువంటి ఆయనకు చెందిన ఈ ఫంక్షన్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. ఈ వేడుకలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, రమేష్ ప్రసాద్ కుమార్తె రాధ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈఈ
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొండసాని సురేష్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా, అనుచరుడిగా సుపరిచితుడైన సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. రాంనగర్లో ఆయన నివాసంతో పాటు పుట్టపర్తిలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా బేతంచర్లలోని అత్తారింట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో సాయి సంస్కృతి ఎడ్యుకేషన్ ట్రస్టు స్థాపించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. అతని భాగస్వామి విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. మొత్తం రూ.4.17 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నామని ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవీ అక్రమాస్తుల చిట్టా.. ఏసీబీ బయటపెట్టిన సురేష్ రెడ్డి అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2018లో పుట్టపర్తిలో ఎకరం ఖాళీ స్థలాన్ని, పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలో 1.63 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ వెల్లడించారు. తనిఖీల్లో 332.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.98 లక్షల విలువైన వస్తువులు, రూ.4.13 లక్షల నగదు గుర్తించారు. ఇన్నోవా, ఆల్టో కారు ఉన్నట్లు తెలిపారు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చనే కోణంలో విచారిస్తున్నారు. ఎవరీ సురేష్ రెడ్డి ? 1991లో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా అడుగుపెట్టి.. 2004లో ఆ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా వెళ్లారు. 2009లో జేసీ అండతో పుట్టపర్తి టికెట్ తనకే అనే ప్రచారం కూడా చేసుకుని.. పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ ఉద్యోగానికి రాజీనామా చేశారు. టికెట్ రాకపోవడంతో తన పలుకుబడితో మళ్లీ ఉద్యోగం సంపాదించుకున్నారు. సెటిల్మెంట్లకు పాల్పడుతూ రూ.కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి. -
బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్ తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది. -
‘ఫోర్బ్స్ ఇండియా’లో మనోడు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియజేసేందుకు ’ఫోర్బ్స్’ పత్రిక రూపొందించిన తాజా ప్రత్యేక సంచికలో నగరవాసికి చోటు లభించింది. నగరానికి చెందిన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ ‘క్రియేటివ్ మెంటర్స్’ వ్యవస్థాపకుడు కొవ్వూరి సురేశ్‌రెడ్డికి జాబితాలో చోటు లభించడంపై ‘క్రియేటివ్’ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్న వయసులోనే యానిమేషన్ సంస్థని స్థాపించి, 13 ఏళ్ల వ్యవధిలోనే ’ఫోర్బ్స్’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేశ్‌రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ నెలాఖరులో విశ్వవ్యాప్తంగా విడుదల కానున్న ఫోర్బ్స్ ఇండియా పత్రికలో డాక్టర్ పి.శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, హెచ్‌సీఎల్ శివ నాడార్, యదుపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, హావెల్స్ అనిల్‌రాయ్ గుప్తా, మహేంద్ర గ్రూప్స్ ఆనంద్ జి.మహేంద్ర... ఇలా 51 మంది అగ్రగామి వ్యాపారవేత్తల సరసన నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 30 ఏళ్ల వయసులోనే అనూహ్య విజయాలు సాధిస్తున్న 30 మంది జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించింది. అందులో మన తెలుగు నటుడు విజయ్ దేవరకొండకు స్థానం లభించగా... తాజా సంచికలో సురేశ్‌రెడ్డికి చోటు దక్కడం విశేషం. ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుకు అర్హత... ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ కాప్చర్ యానిమేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టడం, వేలాది మంది విద్యార్థులను యానిమేషన్ సంబంధిత రంగాల్లో తీర్చిదిద్దడం, ఇటీవల ప్రసాద్స్ ల్యాబ్స్‌తో కలసి సినీరంగంలో విభిన్న శాఖల్లో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణనివ్వడం... ద్వారా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ నగరంలో యువతకు కెరీర్ పరంగా విభిన్న సేవలు అందిస్తోంది. మే 30న లండన్‌లో బీబీసీ సౌజన్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ కాన్క్లేవ్–2019’ కార్యక్రమంలో భాగంగా ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సంచికలో చోటు సంపాదించిన 51 మందిని నామినేటెడ్ పర్సన్స్‌గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్‌రెడ్డికి ఆ పురస్కారం కూడా దక్కితే అది మన నగరానికి మరింత గర్వకారణం అవుతుందని క్రియేటివ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఇది తన జీవితంలో ఊహించని, మరిచిపోలేని పరిణామం అన్నారు. చిన్న వయసులోనే సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఎల్వీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
‘రాయలసీమపై ముఖ్యమంత్రి కక్ష్య సాధింపు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. కరువు సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని పేర్కొన్నారు. రేపు అనంతపురం కలెక్టరేట్ వద్ద సీమ సమస్యలపై ధర్న నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ గూండాలా వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ కార్యదర్శి జల్లి మధుసూదన్ విమర్శించారు. ఆరోపణలపై సమాధానం చెప్పకుండా జీవీఎల్‌ను దూషిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సీఎం రమేష్‌కు సభ్యత- సంస్కారం లేదని అన్నారు. కేంద్రం లెక్కలు అడిగితే జారుకోవటం ఎందుకన్నారు. సోమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్‌ను అవమానించారు
-
‘తెలంగాణ అభివృద్ధికి అంబాసిడర్‌గా పనిచేస్తా’
సాక్షి, నిజామాబాద్ : కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షమం చూసి దశాబ్దాల బంధం ఉన్న కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేనినట్లు మాజీ స్వీకర్ సురేష్ రెడ్డి తెలిపారు. వేగంగా జరిగిన అభివృద్ధి ప్రస్తుతం జంక్షలో ఉందని, రానున్న రోజుల్లో అభివృద్ధి రథం డ్రైవర్‌ను మార్బే అవసరం ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకూ విభేదించిన పార్టీలు సిద్దాంతాలు పక్కన పెట్టింది అభివృద్ధిని అడ్డుకోవడానికే అని విమర్శించారు. మహా కూటమి అనేది మహాకుట్ర అని ప్రజలు గమనిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్దికి తాను అంబాసిడర్‌గా పని చేస్తానని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూర్వ వైభవం కోసం.. కేసీఆర్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో అందరి గెలుపుకు కోసం తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వ్యవహరించిన సురేష్ రెడ్డి.. ఇటీవల అనూహ్యంగా గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. -
తెలంగాణ, ఏపీ మధ్య గొడవ సృష్టించాలని..
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటుగా మారిందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య గొడవ సృష్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణా ఎన్నికల్లో లబ్ది కోసమే నాన్‌బెయిలబుల్ వారంట్ అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షాపై చంద్రబాబు చేస్తోన్న అబద్ధపు విమర్శలను ప్రజలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. 20 సీట్లు కూడా రావు: బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబుపై కేసు నమోదైందని, కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీపై విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే నోటీసులు వచ్చాయని స్పష్టం చేశారు. మోదీపై విమర్శలు చేయడం వల్ల తెలంగాణ ఎన్నికల్లో, ఏపీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 22 సార్లు చంద్రబాబుకు కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే నోటీసులు వచ్చాయని తెలిపారు. జాతీయ స్థాయిలో మోదీ గ్రాఫ్ పడిపోతుందని అనే వారికి నిన్నటి సర్వేలు చెంపపెట్టు లాంటివన్నారు . ఏపీలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వ్యక్తమవుతోందని, ఇదేవిధంగా ప్రజా వ్యతిరేకత టీడీపీపై కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. టీడీపీకి వైఎస్సార్సీపీకి సర్వేల్లో 5 నుంచి 6 శాతం ఓట్ల తేడా ఉంది..రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను గ్రాఫిక్స్‌తో భ్రమలలో ముంచుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘1989 నుంచి కేసీఆర్ నాకు స్ఫూర్తి’
సాక్షి, హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు ఉపందుకున్నాయి. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి బుధవారం అపద్దర్మ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, ఎంపీలు కేశవరావు, కల్వకుంట్ల కవితల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. 1989 నుంచి కేసీఆర్ తనకు స్పూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్న కేసీఆర్ కోరిక మేరకే కాంగ్రెస్‌తో బంధాన్ని వదిలి, రేపటి తరాల భవిష్యత్ కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని వెల్లడించారు. సురేష్‌రెడ్డితోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శాంతి సైజన్, కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బిరుదు రాజమల్లులు కూడా టీఆర్ఎస్ చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్
కమ్మర్పల్లి(బాల్కొండ): గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన.. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైందని, గౌరవం లే ని చోట ఉండడం ఇష్టం లేక పార్టీ మారాల్సి వ చ్చిందని చెప్పారు. మాతృ పార్టీని వీడడం బాధ గా ఉన్నప్పటికీ, కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యతతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, సేవలు వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. 30 ఏళ్ల నుంచి తనను నమ్ముకొని ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని అడిగితే, వారికి కూడా సముచి త స్థానం కల్పించి అండగా ఉంటామని సీఎం హా మీ ఇచ్చారని చెప్పారు. ఆర్మూర్, బాల్కొండ ని యోజకవర్గాల అభివృద్ధిలో తన పాత్ర ఉం టుందని సీఎం స్పష్టం చేశారని వివరించారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నానని, ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. తామంతా మీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు షాక్ !
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆ పార్టీ ఎదురు దెబ్బతిన్నది. ఈ నెల 12న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైద రాబాద్‌లో సురేశ్‌రెడ్డి నివాసానికి మంత్రి కేటీఆర్, బాల్కొండ, ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సురేశ్‌రెడ్డి పార్టీని వీడనుండటం ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలామట్టుకు కారెక్కింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్‌ను వీడింది. తాజాగా జిల్లాలో ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మాజీ స్పీకర్ పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. సీని యర్ నేతగా పేరున్న సురేశ్‌రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. తిరిగి 2004 ఎన్నిక ల్లో కూడా విజయం సాధించిన ఆయన శాసనసభా స్పీకర్‌గా పనిచేశారు. తర్వా త 2009, 2014 ఎన్నికల్లో ఆర్మూర్ ని యోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూశారు. దాదాపు 35 సం వత్సరాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన సురేశ్‌రెడ్డి గులాబీ గూటికి వెళ్లడం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. గులాబీ గూటికి చేరనున్న సురేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీనిచ్చినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. ఆయన సేవలను జాతీయ రాజకీయాలకు వినియోగించుకోవాలని యో చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భా గంగా రాజ్యసభ సీటు కేటాయిస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. గురువారం హైడ్రామా.. సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఆరు నెలల కిత్రం ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకునే వరకూ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. టీఆర్ఎస్ గూటికి వెళుతున్నట్లు ఆయన అనుచర వర్గానికి కూడా సమాచారం లేదు. సురేశ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయమై పలుమార్లు సురేశ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్న విషయం పసిగట్టిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి సురేశ్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని, పార్టీని వీడవద్దని బుజ్జగించినట్లు సమాచారం. సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన నియోజకవర్గం బోధన్‌లో శుక్రవారం కార్యక్రమాలను రద్దు చేసుకున్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. అలాగే డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ నేత గడుగు గంగాధర్ కూడా శుక్రవారం పీసీసీ సమావేశానికి హాజరయ్యారు. -
టీఆర్ఎస్లోకి సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఈనెల 12న టీఆర్ఎస్లో చేరనున్నారు. మంత్రి కె.తారక రామారావు శుక్రవారంæ ఉదయం సురేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లోకి రావాల్సిందిగా సురేశ్‌రెడ్డిని ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన.. తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని వెల్లడించారు. 12న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సముచిత స్థానం కల్పిస్తాం: కేటీఆర్ సమైక్య రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా అందరి మన్ననలు పొందిన సురేశ్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు. సురేశ్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ సమయంలో సురేశ్‌రెడ్డితో భావసారూప్యత ఉండేదని చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ ఆహ్వానాన్ని అంగీకరించి పార్టీలోకి వస్తున్న సురేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవం: సురేశ్‌రెడ్డి రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నానని సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే టీఆర్ఎస్ ఆ హ్వానాన్ని అంగీకరించినట్లు చెప్పారు. వ్యవసాయం, సాగునీ టి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. టీఆర్ఎస్లోకి రావడంలో రాజకీయ లబ్ధి చూసుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు. మండలి చైర్మన్‌గా సురేశ్‌రెడ్డి? ఎన్నికలైన తర్వాత శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇవ్వడంతోపాటు చైర్మన్‌గా ఎన్నుకుంటామని సురేశ్‌రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే శాసనమండలికి పలువురు రిటైర్ అవుతున్నారు. ఆ జాబితాలో శాసన మండలి ప్రస్తుత చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఉన్నారు. స్వామిగౌడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. 1984లో మండల స్థాయి లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2004–09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్‌గా పనిచేశారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
‘అందుకే సురేశ్ రెడ్డి పార్టీ వీడారు’
హైదరాబాద్: మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం వల్లే వచ్చే నష్టం ఏమీ లేదని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ఈ క్రమంలోనే సురేశ్ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు. మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో చేరడానికి అనేకమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు టీఆర్ఎస్ వంద సీట్లు గెలిచే ధైర్యం ఉంటే ఇతర పార్టీ నేతల కాళ్ల మీద ఎందుకు పడుతున్నారంటూ మధుయాష్కీ మండిపడ్డారు. మరొకవైపు మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలని, దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ...ఎస్సీలను మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పతన ఖాయమని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. తనపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థులే లేరన్న గీతారెడ్డి.. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు తనదేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కారెక్కిన కాంగ్రెస్ నేత సురేశ్ రెడ్డి -
రాజకీయ లబ్ధికోసం రావడం లేదు