కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియా గాంధీ విభజిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కేంద్ర మంత్రులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన కేంద్రమంత్రులు వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.