
లక్నో: సార్వత్రిక ఎన్నికల ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సావిత్రి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు ఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ సచాన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని, దాని పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పూలే తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూపీలో మరిన్ని సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే చేరికలపై దృష్టిసారించారు. సావిత్రిబాయి పూలే 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. బహ్రైచ్ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి లోక్‌సభకు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment