Seemandhra union ministers
-
విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్‌బాబు
విజయవాడ: తెలంగాణ బిల్లును అడ్డుకోని సీమాంధ్ర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సమైక్య పోరాటంలో నేటి నుంచి తొలి అడుగు వేశామని తెలిపారు. ఈనెల 11న ధియేటర్లు, పెట్రోల్ బంకుల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. 17, 18న చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. దీని కోసం 15న ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. తనకు తెలిసి విభజన జరగదని అశోక్‌బాబు అన్నారు. మహాయితే విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని చెప్పారు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందదని అన్నారు. పార్లమెంట్లో విభజన ఆపేవిధంగా సీమాంధ్ర నాయకుల చర్యలుండాలని సూచించారు. మన నేతలు ముందుంటే సమైక్యతకు జాతీయ నేతలు కలిసి వస్తారు. -
తెగించి పోరాడకుండా డ్రామాలేంటి?
* సవరణల పేరుతో విభజనకు అంగీకరిస్తారా? * సీమాంధ్ర మంత్రులపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు సవరణలు ప్రతిపాదిస్తూ చివరి నిమిషంలో కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగంగా ముందుకు తీసుకెళుతున్న తరుణంలో తెగించి పోరాడకుండా ఈ డ్రామాలేంటని ఆమె కేంద్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. గురువారం నాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను యూటీ చేయాలని, సీమాంధ్రకు యూనివర్సిటీలు కావాలంటూ సవరణలు కోరుతారా? ఇదేనా మీరు సమైక్యం కోసం చేస్తున్న పోరాటం’’ అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏదో చేస్తామంటూ ఇంతకాలం మాట్లాడి చివరకు విభజనకు సహకరిస్తూ వారంతా చవటలు, దద్దమ్మలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారిని చీల్చడానికి వీల్లేదని తమ పదవులను వదులుకోవాల్సిన మంత్రులకు అసలు పౌరుషం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏదేదో చేసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కేంద్రంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు ఆడుతున్నందునే లగడపాటికి చెందిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా కొత్తగా రూ. 2,300 కోట్ల రుణం మంజూరైందని ఆమె ఆరోపించారు. సుజనాచౌదరి సంస్థలకు కూడా కేంద్రం విరివిగా రుణాలిచ్చిందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు డిమాండ్ చేస్తున్నదేమిటి? ‘‘అన్ని పార్టీల నేతల వద్దకూ వెళ్లి లాబీయింగ్ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వారిని అడుగుతున్నదేమిటి? అసలు ఆయన డిమాండ్ ఏమిటి?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కొద్ది నెలల క్రితమే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కచ్చితమైన డిమాండ్‌తో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలసి వారి మద్దతు కూడగ ట్టారని, ఇప్పుడు ఎటువంటి డిమాండ్ లేకుండా బాబు చేస్తున్న హడావుడి జగన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే విధంగా ఉందని చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చివరి వరకూ తలూపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమైక్యం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేదని తేలిపోయిందని ఆమె విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకుని సమైక్యం కోసం పోరాడేవారన్నారు. ఈ తరుణంలో కిరణ్, చంద్రబాబు, ఎంపీలు, కేంద్రమంత్రులంతా సమైక్యం అనాలని ఆమె డిమాండ్ చేశారు. -
అసంపూర్తిగా ముగింపు..
-
కేబినెట్ భేటీలో సీమాంధ్ర మంత్రుల పసలేని వాదనలు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో సమైక్యగళాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమర్థవంతంగా వినిపించలేకపోయారు. కేబినెట్ భేటీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పసలేని వాదనలు వినిపించినట్టు తెలిసింది. సమైక్య అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని సమాచారం. అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలపాలన్న వాదనకు వారు పరిమితమైయ్యారు. కర్నూలుకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబటి తెలంగాణలో కలపాలని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు వెనుక బడిన జిల్లాలు కాబట్టి హైదరాబాద్ రెవెన్యూ ఆ జిల్లాలకు వెళ్తుందని మంత్రులు వాదించినట్టు తెలుస్తోంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేసి ఆంధ్రాకు విజయనగరాన్ని రాజధాని చేయాలని సీమాంధ్ర మంత్రి ఒకరు ప్రతిపాదించినట్టు సమాచారం. సీమాంధ్ర కేంద్రమంత్రులు యూటీ కోసం పట్టుబట్టగా.. యూటీ మీకెందుకని షిండే ప్రశ్నించినట్టు తెలిసింది. ఎన్ని సంవత్సరాల యూటీ కావాలంటూ షిండే ఎదురు ప్రశ్న వేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత కోసమే యూటీ అడుగుతున్నామని సీమాంధ్ర మంత్రులు సమాధానమిచ్చారని తెలిసింది. సీమాంధ్రులపై గత నాలుగేళ్లలో దాడి జరిగిందా అని వారిని షిండే ప్రశ్నించారని సమాచారం. పోలవరం ప్రాజెకట్టు నిర్మాణాన్ని కేంద్రం చూసుకుంటుందని జైరామ్ రమేష్ హామీయిచ్చారు. -
YSR మరణంతో రాష్ట్రంలో దుర్భర పరిస్తితి
-
సీమాంధ్ర కేంద్ర మంత్రులు దద్దమ్మలు: మేకపాటి
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలను పట్టించుకోవడంలేదన్నారు. త్వరగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రాన్ని కోరుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత పాలనా అని మేకపాటి ప్రశ్నించారు. రాజకీయలబ్దికోసం సీమాంధ్ర నేతలు ఇలాగే వ్యవహరిస్తే వారిని సీమాంధ్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు. అడ్డగోలు విభజనను తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని మేకపాటి కోరారు. -
మూల్యం చెల్లించక తప్పదు: అశోక్ బాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతగానితనం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై దూకుడుగా వ్యవహరిస్తోందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మండిపడ్డారు. ఇప్పటికైనా విభజనను అడ్డుకోకుంటే వారు తగిన మూల్యం చెల్లించకోక తప్పదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదని హెచ్చరించారు. ఈనెల 24న నిర్వహించనున్న సదస్సులో సమైక్య ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. అశోక్‌బాబు నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి, హెల్త్‌కార్డులు, పెన్షన్ల అంశాలపై ఆయనతో చర్చించారు. -
జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
తెలంగాపై కేంద్ర మంత్రుల బృందం చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందంతో సోమవారం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ఆరంభమైంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్, భద్రాచలం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. 11 అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. సమావేశంలో పాల్గొనేముందు వీరందరూ పల్లంరాజు ఇంట్లో సమావేశమైన చర్చించారు. అంతకుముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, సర్వేసత్యనారాయణ పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల బృందం హైదరబాద్, భద్రాచలం సహా కీలక అంశాలపై చర్చలు జరిపారు. కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా కేంద్ర మంత్రుల బృందంతో భేటీ కానున్నారు. -
యూటీ చేస్తే ఓకే!
విభజనపై నివేదించనున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలి నేడు జీవోఎంతో భేటీ.. భారీ ప్యాకేజీలపైనే దృష్టి భేటీకి ముందు పళ్లంరాజు నివాసంలో సమావేశం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను అడ్డుకోవడం అనే ఎజెండాకు స్వస్తి పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. ఆంధ్ర రాష్ట్రానికి ప్యాకేజీల డిమాండ్లపై దృష్టి సారించారు. ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రుల్లో నెలకొన్న భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని హెచ్ఎండీఏ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ, పుదుచ్చేరి తరహాలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని.. అలాచేస్తే విభజనకు అభ్యంతరం లేదని జీవోఎంకు నివేదించాలని యోచిస్తున్నారు. సోమవారం ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం ఎదుట హాజరుకావాల్సిన నేపథ్యంలో.. దానికి ముందుగా కేంద్రమంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం తదితరులు విభజన అనివార్యమైందని, విడిపోతే సీమాంధ్ర ప్రజలకు కావాల్సిన అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జీవోఎం ఎదుట సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉంచే డిమాండ్లు ఇలా ఉన్నాయని సమాచారం... సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలి. అక్కడ ఏర్పాటయ్యే పారిశ్రామిక, ఐటీ హబ్‌ల విషయంలో తగిన ఆర్థిక సాయం చేయాలి. కనీసం దశాబ్ద కాలం పాటు రాయితీలు కూడా అందించాలి. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రానికి అప్పగించాలి. భద్రాచలాన్ని సీమాంధ్రలో విలీనం చేయాలి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి వసతుల కల్పనకు కేంద్రం తగిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. -
'సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి తొత్తులు'
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియా గాంధీ విభజిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కేంద్ర మంత్రులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన కేంద్రమంత్రులు వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. -
భారీ ప్యాకేజీ కోరనున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు
ఢిల్లీ: సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనకు సిద్ధపడిపోయారు. ఇక ప్యాకేజీ కోరాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే వారు పదవులకే ప్రధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర కేంద్రమంత్రులు రేపు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలవనున్నారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీ కోరాలని వారు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, కేంద్రంలోని వివిధ శాఖల కార్యదర్శులు తెలంగాణ విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)ను రేపు కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వారు జిఓఎంను కలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వారు చర్చిస్తారు. -
ప్రధానితో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ రద్దు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర కేంద్రమంత్రుల సమావేశం అర్థాంతరంగా రద్దు అయ్యింది. కేంద్రమంత్రులకు మరోసారి అపాయింట్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా సీమాంధ్ర కేంద్రమంత్రులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానిని కలిసి సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేయాలనుకున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు..... వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. -
ప్రధానితో రేపు సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్రకు ప్యాకేజీ విషయం గురించి చర్చించనున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధానికి మంత్రులు నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో కూడా సీమాంధ్ర మంత్రులు కలవనున్నారు. ఇదిలావుండగా, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం కానున్నారు. -
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి సీమాంధ్ర కేంద్ర మంత్రుల విన్నపం
-
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి నలుగురు కేంద్ర మంత్రుల విన్నపం
తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తాము మంత్రులుగా కొనసాగలేమని, మంగళవారం నుంచి విధులకు హాజరుకాబోమని చెప్పారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం చిరంజీవి, పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో పదవులకు రాజీనామాలు చేసినట్టు వివరించారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ప్రధాని సూచించినట్టు చిరంజీవి చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో మాట్లాడాల్సిందిగా చెప్పారని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు చిరంజీవి తెలిపారు. -
ప్రధానితో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రధానిని కలసిన వారిలో చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు సమాచారం. అనంతరం వీరు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతోనూ భేటి అయ్యారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 'సమైక్య దీక్ష' చేస్తుండటం, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తున్న నేపథ్యంలో మంత్రులు ఇక్కడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
లోక్ సభలో సీమాంధ్రకేంద్ర మంత్రుల చిరునవ్వులు