
ప్రధానితో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రధానిని కలసిన వారిలో చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు సమాచారం.
అనంతరం వీరు కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేతోనూ భేటి అయ్యారు. హైదరాబాద్లో మూడు రోజులుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 'సమైక్య దీక్ష' చేస్తుండటం, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తున్న నేపథ్యంలో మంత్రులు ఇక్కడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.