సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనకు సిద్ధపడిపోయారు.
ఢిల్లీ: సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనకు సిద్ధపడిపోయారు. ఇక ప్యాకేజీ కోరాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే వారు పదవులకే ప్రధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర కేంద్రమంత్రులు రేపు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను కలవనున్నారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీ కోరాలని వారు నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా, కేంద్రంలోని వివిధ శాఖల కార్యదర్శులు తెలంగాణ విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)ను రేపు కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వారు జిఓఎంను కలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వారు చర్చిస్తారు.