తెలంగాపై కేంద్ర మంత్రుల బృందం చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాపై కేంద్ర మంత్రుల బృందం చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందంతో సోమవారం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ఆరంభమైంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్, భద్రాచలం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. 11 అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. సమావేశంలో పాల్గొనేముందు వీరందరూ పల్లంరాజు ఇంట్లో సమావేశమైన చర్చించారు.
అంతకుముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, సర్వేసత్యనారాయణ పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల బృందం హైదరబాద్, భద్రాచలం సహా కీలక అంశాలపై చర్చలు జరిపారు. కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా కేంద్ర మంత్రుల బృందంతో భేటీ కానున్నారు.