న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో సమైక్యగళాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమర్థవంతంగా వినిపించలేకపోయారు. కేబినెట్ భేటీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పసలేని వాదనలు వినిపించినట్టు తెలిసింది. సమైక్య అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని సమాచారం.
అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలపాలన్న వాదనకు వారు పరిమితమైయ్యారు. కర్నూలుకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబటి తెలంగాణలో కలపాలని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు వెనుక బడిన జిల్లాలు కాబట్టి హైదరాబాద్ రెవెన్యూ ఆ జిల్లాలకు వెళ్తుందని మంత్రులు వాదించినట్టు తెలుస్తోంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేసి ఆంధ్రాకు విజయనగరాన్ని రాజధాని చేయాలని సీమాంధ్ర మంత్రి ఒకరు ప్రతిపాదించినట్టు సమాచారం.
సీమాంధ్ర కేంద్రమంత్రులు యూటీ కోసం పట్టుబట్టగా.. యూటీ మీకెందుకని షిండే ప్రశ్నించినట్టు తెలిసింది. ఎన్ని సంవత్సరాల యూటీ కావాలంటూ షిండే ఎదురు ప్రశ్న వేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత కోసమే యూటీ అడుగుతున్నామని సీమాంధ్ర మంత్రులు సమాధానమిచ్చారని తెలిసింది. సీమాంధ్రులపై గత నాలుగేళ్లలో దాడి జరిగిందా అని వారిని షిండే ప్రశ్నించారని సమాచారం. పోలవరం ప్రాజెకట్టు నిర్మాణాన్ని కేంద్రం చూసుకుంటుందని జైరామ్ రమేష్ హామీయిచ్చారు.
కేబినెట్ భేటీలో సీమాంధ్ర మంత్రుల పసలేని వాదనలు
Published Thu, Dec 5 2013 10:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement