union territory status of hyderabad
-
కేబినెట్ భేటీలో సీమాంధ్ర మంత్రుల పసలేని వాదనలు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో సమైక్యగళాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమర్థవంతంగా వినిపించలేకపోయారు. కేబినెట్ భేటీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పసలేని వాదనలు వినిపించినట్టు తెలిసింది. సమైక్య అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని సమాచారం. అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలపాలన్న వాదనకు వారు పరిమితమైయ్యారు. కర్నూలుకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబటి తెలంగాణలో కలపాలని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు వెనుక బడిన జిల్లాలు కాబట్టి హైదరాబాద్ రెవెన్యూ ఆ జిల్లాలకు వెళ్తుందని మంత్రులు వాదించినట్టు తెలుస్తోంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేసి ఆంధ్రాకు విజయనగరాన్ని రాజధాని చేయాలని సీమాంధ్ర మంత్రి ఒకరు ప్రతిపాదించినట్టు సమాచారం. సీమాంధ్ర కేంద్రమంత్రులు యూటీ కోసం పట్టుబట్టగా.. యూటీ మీకెందుకని షిండే ప్రశ్నించినట్టు తెలిసింది. ఎన్ని సంవత్సరాల యూటీ కావాలంటూ షిండే ఎదురు ప్రశ్న వేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత కోసమే యూటీ అడుగుతున్నామని సీమాంధ్ర మంత్రులు సమాధానమిచ్చారని తెలిసింది. సీమాంధ్రులపై గత నాలుగేళ్లలో దాడి జరిగిందా అని వారిని షిండే ప్రశ్నించారని సమాచారం. పోలవరం ప్రాజెకట్టు నిర్మాణాన్ని కేంద్రం చూసుకుంటుందని జైరామ్ రమేష్ హామీయిచ్చారు. -
మేమేమీ దద్దమ్మలం కాదు: దానం
హైదరాబాద్: తాము దద్దమ్మలం కాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మలం కాదని ఆయన స్పష్టం చేశారు. యూటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్ర నాయకులు కొందరు తమ స్వార్థం కోసం హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారని ఆరోపించారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళితే తామేం చేయాలో తమకు తెలుసని చెప్పారు. హైదరాబాద్‌పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని అంతకుముందు దానం హెచ్చరించారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు. -
యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి వంద శాతం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై న్యాయపరమైన అంశాల గురించి షిండేతో చర్చించినట్టు తెలిపారు. రాయల తెలంగాణపై తమ ప్రాంత నేతలతో మాట్లాడి చెప్తానని అన్నారు. డిసెంబర్ 20 కల్లా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవకాశముందని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
త్వరలోనే తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణ బిల్లు త్వరలోనే వస్తుంది అని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. దేశ శాంతి భద్రతల సమీక్షపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలపరిమితి ముగియకముందే తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతాం అని అన్నారు. హైదరాబాద్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిశీలనలో ఉంది అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పరిధి ఎంత ఉండాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. జీవోఎం నివేదిక కేబినెట్ కు వెళ్తుంది.. ఆతర్వాత రాష్ట్రపతికి.. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును పంపుతామని విభజన ప్రక్రియను మరోసారి షిండే తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమకు పోటీ కాదని అన్నారు. కాంగ్రెస్ కు మోడీ సవాల్ కాదు అని.. ఇలాంటి సవాళ్లను కాంగ్రెస్ చాలా ఎదుర్కొందని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. -
త్వరలోనే తెలంగాణ బిల్లు: షిండే
-
హైదరాబాద్ యూటీ చేయాలని ప్రదానికి విఙ్ఞప్తి
-
'హైదరాబాద్ ను యూటీ చేయండి'
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్రమంత్రులు సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేశారు. ఈ భేటీలో విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. దాదాపు అంగీకారానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రధానితో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. విభజనకు ఓకే అన్నట్టు సమాచారం. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను మన్మోహన్ ముందుంచినట్టు తెలిసింది. 11 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు సీమాంధ్రకు విభజన వల్ల కలిగే నష్టాలను పూరించేలా చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిసింది. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పురందేశ్వరీ.. జీవోఎం విధివిధానాలపై ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని ప్రధానితో తమతో అన్నారని తెలిపారు. కేంద్ర మంత్రుల రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధాని తమతో అన్నట్లు పురందేశ్వరీ చెప్పారు.