రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్తో కేంద్రమంత్రులు సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేశారు. అందుకు న్యాయం జరుగుతుందని సీమాంధ్ర కేంద్రమంత్రులతో ప్రధాని అన్నారని భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. విభజన నేపథ్యంలో మొత్తం 11 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చాం అని అన్నారు. నివేదికలోని అంశాలపై, జీవోఎమ్ సంబంధించి విధివిధానాలపై ప్రధానితో చర్చించామని తెలిపారు. అయితే తమ వాదనలకనుగుణంగా 'అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం' ప్రధాని చెప్పారని మీడియాకు పురందేశ్వరి వివరించారు. రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రధాని మాతో అన్నారని ఓ ప్రశ్నకు పురందేశ్వరి సమాధానమిచ్చారు.