
మేమేమీ దద్దమ్మలం కాదు: దానం
హైదరాబాద్: తాము దద్దమ్మలం కాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మలం కాదని ఆయన స్పష్టం చేశారు. యూటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్ర నాయకులు కొందరు తమ స్వార్థం కోసం హైదరాబాద్ను యూటీ చేయాలంటున్నారని ఆరోపించారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళితే తామేం చేయాలో తమకు తెలుసని చెప్పారు.
హైదరాబాద్పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని అంతకుముందు దానం హెచ్చరించారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు.