విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్బాబు | Telangana Bill will not pass in Lok Sabha, says Ashok Babu | Sakshi
Sakshi News home page

విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్బాబు

Published Sun, Feb 9 2014 5:05 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్బాబు - Sakshi

విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్బాబు

విజయవాడ: తెలంగాణ బిల్లును అడ్డుకోని సీమాంధ్ర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. సమైక్య పోరాటంలో నేటి నుంచి తొలి అడుగు వేశామని తెలిపారు. ఈనెల 11న ధియేటర్లు, పెట్రోల్ బంకుల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. 17, 18న చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. దీని కోసం 15న ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు.

తనకు తెలిసి విభజన జరగదని అశోక్బాబు అన్నారు. మహాయితే విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని చెప్పారు. లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందదని అన్నారు. పార్లమెంట్లో విభజన ఆపేవిధంగా సీమాంధ్ర నాయకుల చర్యలుండాలని సూచించారు. మన నేతలు ముందుంటే సమైక్యతకు జాతీయ నేతలు కలిసి వస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement