chalo delhi protest
-
ఆగిన ఢిల్లీ ఛలో! 5 పాయింట్లలో..
కీలక డిమాండ్ల సాధనలో నిన్నటి వెనక్కి తగ్గని అన్నదాతలు.. ఇప్పుడు చల్లబడ్డారా? లేకుంటే.. తమ ఆందోళనలను తీవ్ర తరం చేయబోతున్నారా? అసలు ఢిల్లీ ఛలోకి విరామం ఎందుకు ప్రకటించారు?. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అప్పటిదాకా ఏం చేయబోతున్నారనేది కూడా చెప్పేశారు. 1. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరీల వద్ద భారీ సంఖ్యలో రైతులు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సైతం భాష్పవాయువు ప్రయోగం.. లాఠీ ఛార్జీతో ఆ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. అయితే ఆ వెంటనే ఢిల్లీ ఛలోను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. తమ నిర్ణయం ఏంటన్నది ఆరోజునే(29న) ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేదాకా.. అక్కడే వివిధ రూపాల్లో నిరసనలను తెలపాలని రైతులకు.. రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2. ఇవాళ క్యాండిల్ మార్చ్.. రేపు రైతుల సమస్యల మీద సెమినార్ల నిర్వహణతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ-కేంద్రం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఆపై రెండు రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు జరుగుతాయన్నారు. రానున్న ఐదురోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, మరికొన్ని సంఘాలు భేటీ అయ్యి సంయుక్తంగా తదుపరి కార్యాచరణను రూపొందిస్తాయని ఆ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. 3. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానివైపు వైపు రైతులు కదం తొక్కేందుకు యత్నిస్తుండగా.. గత 11 రోజులుగా భద్రతా బలగాలు వాళ్లను నిలువరిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో బలగాలు.. ట్రాక్టర్లు, వాటికి రక్షణ కవచాలతో రైతులు పోటాపోటీ ప్రదర్శనలతో యుద్ధవాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చిన రైతులపై బలగాలు భాష్పవాయుగోళాలు ప్రయోగంతో పాటు లాఠీ ఛార్జీ చేయడం చేశాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. 4. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. అయితే.. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. దీంతో రైతుల నిరసనలు మొదలయ్యాక ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. 5.ఒకవైపు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం చెబుతుండగా.. మరోవైపు రైతు సంఘాలు మాత్రం నిర్ణీత కాల వ్యవధితో తమకు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అంటున్నాయి. ఇంకోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. -
వాళ్లేమీ నేరస్తులు కాదు: ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో హారాహరీగా సాగుతున్న రైతు ఉద్యమంపై దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పందించారు. వాళ్లు అన్నదాతలు..నేరస్థులు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న వార్తలపై ఆమె స్పందించారు. తన తండ్రికి భారతరత్న అవార్డును పురస్కరించుకుని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డెవలప్మెంటల్ ఎకనామిస్ట్ మధుర స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని అభ్యర్థించారు. రైతులు.. అన్నదాతలు వారిని నేరస్తులుగా పరిగణించలేమన్నారు. అంతేకాదు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నవంబర్ 2021లో ఎంఎస్ స్వామినాథన్ చేసిన ప్రకటనను ట్విటర్లో షేర్ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో చర్చల విఫలం తరువాత చేపట్టిన రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం గత రెండురోజులుగా ఉధృతంగా సాగుతోంది. హర్యానా, పంజాబ్, యూపీ రైతులు దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. అటు పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానాలో వారి కోసం జైళ్లను సిద్ధం చేశారు. డ్రోన్ల ద్వారా బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. పోలీస్ నిర్బంధ కాండను చేధించుకుంటూ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్‌కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఢిల్లీకి 200 కిలో మీటర్ల దూరంలోనే రైతుల ర్యాలీ కొనసాగుతోంది. కాగా అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీ చట్టం, రుణ మాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిషన్ మోర్చ, కిషన్ మజ్దూర్ మోర్చ ఛలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లలో ప్రధానమైంది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం మద్దతు ధర అమలు చేయడం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 2004లో కేంద్రం ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో కమిషన్‌ను రూపొందించింది. ప్రభుత్వం పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం పెంచాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. Here is what M S Swaminathan said when the farm laws were repealed @mssrf https://t.co/HYSmSlSOve. https://t.co/dC3ejbsZ8F — Madhura Swaminathan (@MadhuraFAS) February 13, 2024 ఇటీవల హరిత విప్లవ పితామహుడు, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతరం ఇటీవల భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింవది. గతేడాది సెప్టెంబర్‌లో స్వామినాథన్ మరణించారు. -
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
కదిలిన ఆదివాసీ దండు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ దండు కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9న జరిగే ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పయనమైంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఆదివాసీలు శనివారం జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్ నుంచి రైలుమార్గం ద్వారా నాగ్‌పూర్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక వాహనాలు, రైళ్ల ద్వారా వెళ్లగా, మిగతా వారు శనివారం బయల్దేరారు. రెండు జిల్లాల నుంచి 3వేల మంది వరకు వెళ్లినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఈ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ సభ జరగనుంది. గత కొన్నిరోజుల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు సభకు భారీ సంఖ్యలో తరలించేందుకు సన్నద్ధం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధ్రువపత్రాలను అరికట్టాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నారు. గుస్సాడీ వేషధారణలో ఢిల్లీకి పయనమవుతున్న యువకులు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టగా, దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టే సభ ద్వారా ఈ విషయం దేశమంతటా తెలిసేందుకు ఆస్కారం ఉంది. ఆదివాసీ అస్తిత్వ పోరాట సభకు ఆదివాసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. సభకు ఎంతమంది తరలివెళ్తున్నారనే విషయంపై ఇంటెలిజెన్స్, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో అక్కడ జరిగే సభ ఏర్పాట్లను, జిల్లా నుంచి వచ్చే ఆదివాసీల ఏర్పాట్లు, తదితరవి పరిశీలిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపుతున్నారు. రైలు మార్గం ద్వారా వెళ్లేవారికి మధ్యలో భోజనాలు, ఢిల్లీలో ప్రత్యేకంగా ఫంక్షన్హాల్లు ఏర్పాటుచేసినట్లు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. తుడుందెబ్బ జెండాలు తీసుకెళ్తున్న ఆదివాసీలు రైల్వేస్టేషన్లో సందడి.. ఢిల్లీలో జరిగే అస్తిత్వ పోరాట సభకు తరలివెళ్లేందుకు వచ్చిన ఆదివాసీలతో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ సందడిగా మారింది. వేలాది సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో రైల్వేస్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన జనంతో కిటకిటలాడింది. జై ఆదివాసీ.. జైజై ఆదివాసీ అనే నినాదాలతో రైల్వేస్టేషన్ మార్మోగింది. -
విభజన బిల్లు ఆమోదం పొందదు: అశోక్‌బాబు
విజయవాడ: తెలంగాణ బిల్లును అడ్డుకోని సీమాంధ్ర కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సమైక్య పోరాటంలో నేటి నుంచి తొలి అడుగు వేశామని తెలిపారు. ఈనెల 11న ధియేటర్లు, పెట్రోల్ బంకుల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. 17, 18న చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. దీని కోసం 15న ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. తనకు తెలిసి విభజన జరగదని అశోక్‌బాబు అన్నారు. మహాయితే విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని చెప్పారు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందదని అన్నారు. పార్లమెంట్లో విభజన ఆపేవిధంగా సీమాంధ్ర నాయకుల చర్యలుండాలని సూచించారు. మన నేతలు ముందుంటే సమైక్యతకు జాతీయ నేతలు కలిసి వస్తారు.