సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతగానితనం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై దూకుడుగా వ్యవహరిస్తోందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతగానితనం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై దూకుడుగా వ్యవహరిస్తోందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మండిపడ్డారు. ఇప్పటికైనా విభజనను అడ్డుకోకుంటే వారు తగిన మూల్యం చెల్లించకోక తప్పదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదని హెచ్చరించారు. ఈనెల 24న నిర్వహించనున్న సదస్సులో సమైక్య ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. అశోక్‌బాబు నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి, హెల్త్‌కార్డులు, పెన్షన్ల అంశాలపై ఆయనతో చర్చించారు.