పోరాటాలకు పెట్టింది పేరు బీజేపీ
-
కార్మిక సదస్సులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు):
కార్మికులు శ్రేయస్సు కోసం రాజీలేని పోరాటం చేసింది బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా మజ్దూర్‌మోర్చ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పప్పులవీధిలో నిర్వహించిన కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై గ్లోబల్ ప్రచారం చేయడమే కమ్యూనిస్టుల ధ్యేయమన్నారు. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని నరేంద్రమోదీపై కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అసంఘటిత కార్మికుల కోసం త్వరలో ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించబోతుందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలకు తోక పార్టీ అంటూ ఏదన్నా ఉందంటే అది ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడింది ఒక్క బీజేపీ అని గుర్తు చేశారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు రూ.1000, రూ.500 నోట్లును రద్దు చేసే నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అందరూ స్వాగతిస్తున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు జాతీయవాద సిద్ధాంతానికి మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా వెంటనే సంబంధిత యాజమాన్యాలతో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఏఐటీయూసీలో ఉన్న కార్మికులు అక్కడి ఇబ్బందుల దృష్ట్యాతో మంచి నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. తొలుత నగరంలోని ఏబీఎం కాంపౌండు నుంచి అత్మకూరు బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట మీదుగా పప్పుల వీధి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి ప్రాంతంలో పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అంకయ్య, సత్యం, కప్పిర శ్రీనివాసులు, తేలపల్లి రాఘవయ్య, నరసింహులు, శ్రీధర్, మాలకొండయ్య, మండ్ల ఈశ్వరయ్య, మాధవ్, బయ్యా వాసు, సుబ్బారావు, మునిరత్నం, ముఠా కార్మిక నాయకులు వెంకటేశ్వర్లు, పెంచలయ్య పాల్గొన్నారు.