'సొంత పేపర్‌, టీవీ ఛానల్‌ కావాలి' | Congress to Get Own News Paper in Telangana | Sakshi
Sakshi News home page

'సొంత పేపర్‌, టీవీ ఛానల్‌ కావాలి'

Published Mon, Aug 25 2014 2:25 PM | Last Updated on Sat, Aug 11 2018 7:16 PM

'సొంత పేపర్‌, టీవీ ఛానల్‌ కావాలి' - Sakshi

'సొంత పేపర్‌, టీవీ ఛానల్‌ కావాలి'

హైదరాబాద్: ప్రచార లోపాలతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిందని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అభిప్రాయడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి సొంత న్యూస్ పేపర్‌, టీవీ ఛానల్‌ ఉండాలని సూచించారు. దీని కోసం కార్యకర్తలంతా రూ.1000 చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. టీపీసీసీలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయాలని సలహాయిచ్చారు. కాంగ్రెస్ నేతలంతా సోషల్‌ మీడియాను వినియోగించాలని  సురేష్రెడ్డి సూచించారు.

కాగా, పార్టీ సంస్థాగత పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు పోరాడాలి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరుపై అధ్యయనం కోసం పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement